వివాదమైన కో ఆప్షన్ ఎన్నిక
కామారెడ్డి/కామారెడ్డిటౌన్: మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక ఎమ్మెల్యే గంపగోవర్ధన్, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మధ్య ఆధిపత్య పోరు కు వేదికైంది. మున్సిపల్లో మూడు కో-ఆప్షన్ పదవుల కోసం ఇటీవల నో టిఫికేషన్ జారీ చేశారు. నామినేషన్లు వేసిన వారిలో రౌడీషీటర్, అధిక సం తానం అభ్యర్థి ఉన్నారని ఎమ్మెల్సీ, కాంగ్రెస్ కౌన్సిలర్లు అభ్యంతరం వ్య క్తం చేశారు.అయితే నిర్ధారించాల్సింది కోర్టులోనని ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పట్టుపట్టారు.
అభ్యర్థులపై ఫిర్యాదు వచ్చినందున వాటిపై అధికారుల నుంచి వివరాలు తీసుకున్న తరువాత ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి చైర్మన్ ఎన్నికను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించి వెళ్లిపోయారు. అయితే అప్పటికప్పుడు టీఆర్ఎస్ సభ్యులు ప్యానల్ చైర్మన్‌గా చాట్ల లక్ష్మిని ఎన్నుకున్నారు. కో ఆప్షన్ సభ్యుల ను ఎన్నికున్నారు.
సమావేశం జరిగిందిలా..
కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం మొదట్లో ఇటీవల మాసాయిపేటలో జరిగిన రైలు ప్రమాదంలో మృతిచెందిన విద్యార్థులకు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం సభ మొదలైంది. మున్సిపల్ ఆక్ట్ ప్రకారం కో- ఆప్షన్ సభ్యుల ఎన్నిక జరుగడం లేదని కాంగ్రెస్ కౌన్సిలర్ నిమ్మ దామోదర్‌రెడ్డి అభ్యతరం చేయగా, కమిషనర్, చైర్పర్సన్ సంతకాల ఎజెండా నోటీసులతో చట్టప్రకారమే ఎన్నిక జరుగుతుందని టీఆర్ఎస్ కౌన్సిలర్ ముప్పారపు ఆనంద్ పేర్కొన్నారు.
అనంతరం ఎమ్మె ల్సీ షబ్బీర్ అలీ మాట్లాడుతూ కేవలం పత్రికా ప్రకటన మాత్ర మే ఇచ్చారని, నోటిఫికేషన్ ఇవ్వలేదని, ఆస్తుల వివరాలు, కేసులు, పన్నుల క్లియరెన్స్, అఫిడవిట్లను నామినేషన్ సభ్యులు అంద జేయాల్సి ఉందని ఇందుకు విరుద్ధంగా జరిగిందన్నారు. కో ఆప్షన్ సభ్యులుగా పోటీకి నామినేషన్ దాఖ లు చేసిన ఎండీ అక్బర్హుస్సేన్కు అధిక సం తానం ఉన్నారని, సాజీద్ అనే వ్యక్తిపై రౌడీషీటర్‌గా ఎన్నో కేసులు ఉన్నాయని, అలాగే నరేశ్ పార్నాని మైనార్టీగా ఎలా నిర్ధారించారని షబ్బీర్ అలీ కమిషనర్‌ను నిలదీశారు. నా మినేషన్ ల పరి శీల నకు, స్కూృ టినీ విషయై మె ఎవరికీ సమాచారం ఇవ్వలేదని పేర్కొంటూ ఎన్నికలను వాయిదా వేయాలని చైర్‌పర్సన్‌ను కోరారు.
దీంతో క ల్పించుకున్న ఎమ్మెల్యే గంప గోవర్ధన్ రౌడీషీటర్లు, అధిక సంతానం తేల్చాల్సింది ఇక్కడ కాదని, కోర్టు తీర్పు ఇస్తుందని చట్ట ప్రకారమే ఎన్నికలు జరుపాలని కమిషన ర్, చైర్‌పర్సన్‌తో వాధించారు. కాసేపు కాం గ్రెస్, టీఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చెలరేగడంతో అరగంటపాటు సమావేశం వాయిదావేస్తూ చైర్పర్సన్ వెళ్లిపోయారు. అరగంట అనంతరం ఇదే అంశంపై ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, టీఆర్ ఎస్, కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం జరిగింది. దీంతో ఎన్నికలను వాయి దా వేస్తున్నట్లు ప్రకటించి చైర్పర్సన్ సమావేశం నుంచి వెళ్లి పోగా, ఎన్నిక వాయిదా వేసే హక్కు చైర్‌పర్సన్‌కు లేదని ఎమ్మెల్యేతో పాటు టీఆర్ఎస్, ఇతర కౌన్సిలర్లు హల్లోనే కూర్చున్నారు.
మధ్యాహ్నం మళ్లీ సా ధరణ సమావేశం నిర్వహించేందుకు 2:15 మళ్లీ చైర్పర్సన్ వచ్చారు. సర్వసభ్య సమావేశం ప్రారంభిస్తున్నామని చైర్పర్సన్ ఎజెండా చదవడంతో టీఆర్ఎస్ కౌన్సిలర్లు, ఎమ్మెల్యే గంపగోవర్ధన్లు ఏ విధంగా ఎన్నికను వాయిదా వేస్తారని, మినిట్స్ బుక్స్‌లో ఏం రాశారని నిలదీశారు. మెజార్టీ సభ్యుల ఆమోదం మేర కు ఎన్నికలు నిర్వహించాలని గొడవ చేశారు. మినిట్స్ బుక్స్ ఇష్టానుసారంగా కౌన్సిల్ హాల్లో రాయల్సింది పోయి చైర్పర్సన్ ఛాంబర్లో ఎలా రాస్తారని నిలదీశారు. అనుమతి లేకుండా మినిట్స్ బుక్ బయటకు ఎలా వెళ్లిందని కమిషనర్‌పై మండిపడ్డారు.
మినిట్స్ బుక్‌లో మెజారీ కౌన్సిల్ సభ్యుల నిర్ణయాన్ని రాసిన తర్వాతనే ఎన్నికను వాయిదా వేయాలని ఇది రాజ్యాంగ విరుద్ధమని, ఇక్కడ మెజారీటి సభ్యుల ఆమోదం మెరకే ఎన్నికలు జరపాలని టీఆర్ఎస్ పట్టుబట్టారు. కాంగ్రెస్‌కే 17 సీట్లు ఉన్నాయని టీఆర్ఎస్కే ఐదు సీట్లు ఉన్నాయని తమ మెజారిటీ ఎక్కువగా ఉందని కాంగ్రెస్ నాయకులు గొడవ చేశారు. డబ్బులకు అమ్ముడు పోయి టీఆర్ఎస్లో కాం గ్రెస్ కౌన్సిలర్లు చేరారని కాంగ్రెస్ కౌన్సిలర్లు, రూ. కోటిన్న ర పంచిపెట్టి చైర్మన్ పదవి దక్కించుకున్నారని టీఆర్ఎస్ నాయకులు ఒకరినొకరు విమర్శించుకున్నారు.
పెద్దపెట్టున ఇరువర్గాల వారు నినాదాలు చేసుకున్నారు. మహిళ కౌన్సిలర్లు, చైర్పర్సన్లు తమకు ఇక్కడ రక్షణ లేదని ఆరోపించారు. మూడుసార్లు సమావేశం వాయిదా వేసే హక్కు చైర్‌పర్సన్‌కు ఉంటుందని ఎన్నికలు వాయిదా వేయాలని కాంగ్రెస్ కౌన్సిలర్లతో పాటు ఎమ్మె ల్సీ బయటకు వెళ్లి పోయారు. ఈసమావేశాన్ని కూ డా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి చైర్పర్సన్ వెళ్లిపోయారు.
ప్యానల్ కమిటీ చైర్‌పర్సన్‌ను ఎన్నుకుని..
మెజార్టీ కౌన్సిలర్లు సమావేశానికి హాజరయ్యారని మున్సిపల్ ఆక్ట్ ప్రకారం ఉన్న సభ్యులతో ప్యానల్ కమిటీ చైర్మన్ ఎన్నికను, కోఆప్షన్ సభ్యులను ఎన్నుకోవచ్చని కమిషనర్ బాలాజీనాయక్‌తో ఎమ్మెల్యే వాగ్వాదం చేసి మినిట్స్ బుక్స్ తెప్పించుకుని కౌన్సిల్హాల్లో ప్యానల్ కమిటీ చైర్మన్‌గా ఎన్నుకుని చాట్ల లక్ష్మిని చైర్మన్‌గా ప్రకటించారు. అనంతరం చాట్ల లక్ష్మి చైర్మన్‌గా వ్యవహరిస్తు ముగ్గురు కోఆప్షన్ సభ్యులను ఎన్నుకున్నారు.
జనరల్ కేటగిరిలో నిట్టు క్రిష్ణామోహన్రావు, మైనార్టీ మహిళ విభాగం లో అప్సరీ భేగం, పురుషుల విభాగంలో మహ్మ ద్ సాజిద్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రక టించారు. అనంతరం మినిట్స్ బుక్స్‌లో వివరాలు రాసి సమావేశం ముగించారు. గతంలో గోడవలను దృష్టి పెట్టుకుని ఈసారి ఎలాంటి ఘటనలు జరుగకుండా భారీగా పోలీసులు బలగాలను ఏర్పాటు చేసారు. కౌన్సిల్ హల్లో సైతనం మఫ్టీలో పోలీసులను నిలబెట్టి సమావేశం నిర్వహించారు.