ఆడపిల్లలను కాపాడుకోవాలి
l పోషించలేమనే భయం వీడండి
l ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్
l 234 మందికి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ
కామారెడ్డి : ఆడపిల్ల భారం అనే భావనను వీడి, ఆడపిల్లలను ఉన్నతంగా చదివించాలని, ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కోరారు. ఆదివారం కామారెడ్డిలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహం ఆవరణలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులు 234 మందికి రూ.51 వేల చొప్పున రూ.కోటీ 20 లక్షల విలువైన చెక్కులన విప్ పంపిణీ చేశారు. ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ..ఆడపిల్ల పుడితే చాలా మంది చెత్తకుప్పల్లో పడేస్తున్నారని, ఈ రోజుల్లో కూడా ఆడపిల్లను భారంగా చూడడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఆడపిల్ల భారం అన్న భావన వీడాలని కోరారు. ప్రభుత్వం ఆడపిల్లల చదువుల కోసం ఎన్నో కార్యక్రమాలను చేపట్టిందని, వారి పెళ్లిళ్లు కూడా భారం కావద్దని సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కార్యక్రమాలు అమలు చేశారని పేర్కొన్నారు. ఒక్క కామారెడ్డి నియోజక వర్గంలో 234 మందికి చెక్కులు ఇస్తున్నామని, త్వరలోనే మరికొందరికి అందిస్తామన్నారు. ఆడపిల్లను కాపాడుకుంటేనే మానవజాతికి మనుగడ ఉంటుం దని పేర్కొన్నారు. ఆడపిల్లలకు ప్రభుత్వమే కాక స్వచ్ఛంద సంస్థలు కూడా చేయూతనందిస్తాయన్నారు.
కామారెడ్డిలో బాంబేక్లాథ్ హౌస్ యాజమాన్యం వంద జంటలకు ఉచితంగా పెళ్లిళ్లు జరిపించారని గుర్తు చేశారు. ఆడపిల్ల తల్లిదండ్రులు అధైర్యపడవద్దని కోరారు. ఆడ పడచులు నీటి కోసం ఇబ్బందులు పడకూడదని ప్రభుత్వం మిషన్ భగీరథ కార్యక్రమానికి రూ.40 వేల కోట్లు ఖర్చు చేస్తోందని, త్వరలోనే ఇంటింటికీ నల్లా ద్వారా శుద్ధిచేసిన నీటిని సరఫరా చేస్తామన్నారు. నియోజకవర్గా న్ని బహిరంగ మలవిసర్జన రహిత నియోజకవర్గంగా రూపొ ందించేదుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పిప్పిరి సుష్మ, ఎంపీపీలు లద్దూరి మంగమ్మ, బాల్‌రాజవ్వ, రాణి, జడ్పీటీసీ సభ్యులు నంద రమేశ్, మధుసూధన్‌రావ్, గ్యార లక్ష్మి, ఏఎంసీ చైర్మన్ అమృతరెడ్డి, టీఆర్‌ఎస్ నేతలు నిట్టు వేణు, పొన్నాల లక్ష్మారెడ్డి, మోహన్‌రెడ్డి, ఆనంద్, రవి, నర్సింలు, ఆయా మండలాల అధికారులు, నాయకు లు పాల్గొన్నారు.