goverener
-
కశ్మీర్ ఎల్జీకి మరిన్ని అధికారాలు
న్యూఢిల్లీ/శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ)కి కేంద్రం మరిన్ని అధికారాలు కట్టబెట్టింది. పోలీసు శాఖ, అఖిల భారత సర్వీసుల అధికారులు, వివిధ కేసుల విచారణ అనుమతులు వంటి కీలక అంశాలపై అధికారాలను కల్పించింది. ఈ మేరకు జమ్మూకశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ చట్టం–2019కు హోం శాఖ సవరణలు చేపట్టింది. ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లద్దాఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్రం ఈ చట్టం చేసింది. ఇప్పటి వరకు పోలీసు, జైళ్లు, శాంతిభద్రతలు, అఖిల భారత సర్వీసులు, ఏసీబీలకు సంబంధించిన నిర్ణయాలపై జమ్మూకశ్మీర్ ఆర్థిక శాఖ నుంచి ఆమోదం పొందాకనే ఎల్జీ వద్దకు వచ్చేవి. తాజా నిబంధనల ప్రకారం..ఆయా సర్వీసులకు సంబంధించిన ఫైళ్లు ఇకపై చీఫ్ సెక్రటరీ నుంచి నేరుగా ఎల్జీ వద్దకే చేరుతాయి. అడ్వకేట్ జనరల్, ఇతర న్యాయాధికారుల నియామక అధికారాలు కూడా తాజాగా ఎల్జీకే దఖలు పడ్డాయి.అధికారాలను హరించేందుకే..కేంద్రం నిర్ణయంపై జమ్మూకశ్మీర్‌లోని రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికయ్యే ప్రభుత్వం అధికారాలను హరించేందుకే కేంద్రం ప్రయత్నిస్తోందని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ), పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ(పీడీపీ)లు ఆరోపించాయి. జమ్మూకశ్మీర్‌లో సెప్టెంబర్ 30వ తేదీలోగా అసెంబ్లీ ఎన్నికలు చేపట్టి, రాష్ట్రం హోదాను పునరుద్ధరించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించడం తెల్సిందే. -
రాజ్‌భవన్‌లో సీజేఐ ఎన్వీ రమణకు తేనీటి విందు
-
బూర్గులకు గవర్నర్ దత్తాత్రేయ నివాళి
సాక్షి, హైదరాబాద్: నిస్వార్థ నాయకుడిగా, హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా విశేష సేవలు అందించిన మహావ్యక్తి బూర్గుల రామకృష్ణారావు అని హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ కొనియాడారు. దత్తాత్రేయ శనివారం బూర్గుల వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఉత్తరప్రదేశ్, కేరళ రాష్ట్రాలకు గవర్నర్‌గా సేవలందించిన గొప్పవ్యక్తి అని తెలిపారు. దత్తాత్రేయ హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ హోదాలో నగరానికి రావడంతో జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ జయరాజ్ కెనడీ, సీసీఆర్‌ఓ వెంకటరమణ ఘనంగా స్వాగతం పలికారు. కాగా బండారు దత్తాత్రేయ ఇటీవల హిమాచల్‌ప్రదేశ్ 27వ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. -
సింధును సత్కరించిన ఏపీ గవర్నర్
-
ఆహ్లాదకరంగా ఎట్ హోం..
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ రాజ్‌భవన్‌లో బుధవారం సాయంత్రం ఎట్‌హోం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆహ్లాదకర వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజకీయ నేతలు, న్యాయాధిపతులు, అధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. గవర్నర్ నరసింహన్ దంపతులు ఇచ్చిన ఈ తేనీటి విందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఏపీ ఉప ముఖ్యమంత్రి ఎన్. చినరాజప్ప, హైకోర్టు చీఫ్ జస్టిస్ టి.బి.రాధాకృష్ణన్, రాష్ట్ర శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్, స్పీకర్ ఎస్.మధుసూదనాచారి పాల్గొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్షనేత కె.జానారెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎంపీలు బండారు దత్తాత్రేయ, కె.కేశవరావు, డి.శ్రీనివాస్, సుజనా చౌదరి, బి.వినోద్‌కుమార్, మల్లారెడ్డి, విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ప్రభాకర్ హాజరయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వివిధ రంగాల ప్రముఖులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఎల్జీయే ఢిల్లీకి బాస్
న్యూఢిల్లీ: రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ)కే ప్రాధాన్యత ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇతర కేంద్రపాలిత ప్రాంతాలతో పోలిస్తే రాజ్యాంగంలోని 239ఏఏ ఆర్టికల్ ప్రకారం ఢిల్లీలో ప్రభుత్వం కంటే ఎల్జీకే ఎక్కువ అధికారాలుంటాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం గురువారం వెల్లడించింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచీ ఎల్జీతో రోజూ ఘర్షణ తప్పట్లేదని.. మంత్రులంతా అధికారుల ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందని ఆప్ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీనిపై విచారించిన ధర్మాసనం.. ‘ఆర్టికల్ 239ఏఏ ఢిల్లీకే ప్రత్యేకం. రాజ్యాంగ పరిధిలో ఈ చట్టం ఎల్జీకే విశిష్టాధికారాలు కట్టబెట్టింది’ అని పేర్కొంది. ‘రాష్ట్రపతికి ఉండే పలు అధికారాలు ఢిల్లీలో ఎల్జీకి ఉంటాయని చట్టంలో స్పష్టంగా ఉంది. అయితే, మంత్రుల సలహాలతో ఎల్జీ పనిచేయాల్సి ఉంటుంది. వీరి ఆలోచనలతో విభేదిస్తే.. సమస్యల త్వరిత పరిష్కారం కోసం ఆయన రాష్ట్రపతి దృష్టికి సదరు విషయాన్ని తీసుకెళ్లాలి’ అని ధర్మాసనం స్పషం చేసింది. -
ఢిల్లీకి తమిళనాడు గవర్నర్
రాష్ట్ర గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ఆదివారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలతో ఆయన భేటీ కానున్నారు. ఇందులో తమిళ రాజకీయ పరిస్థితులు చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సాక్షి, చెన్నై: తమిళనాట సాగుతున్న రాజకీయ పరి ణామాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలో పడి ఉండడంతో కోర్టు తీర్పు ఎలా ఉంటుందో, అందుకు తగ్గట్టుగా గవర్నర్ ఎలా స్పందిస్తారో అన్న ఎదురుచూపులు పెరిగాయి. ఈ పరిస్థితుల్లో పూర్తిస్థాయి గవర్నర్‌గా బన్వరి లాల్ పురోహిత్ పగ్గాలు చేపట్టడంతో ఆయన అడుగులు ఎలా ఉండనున్నాయో అన్న ప్రశ్న బయలు దేరింది. గతంలో ఇతర రాష్ట్రాల్లో నెలకొన్న అనేక రాజకీయ సంక్లిష్ట పరిస్థితుల్ని చాకచక్యంగా వ్యవహరించి గట్టెక్కించిన బన్వరి లాల్‌ను తమిళ రాజకీయలు కాస్త ఇరకాటంలో పెట్టి ఉన్నాయని చెప్పవచ్చు. తమిళ రాజకీయాలపై పట్టు సాధించడంతో పాటు, తన మార్క్ కనిపించే రీతిలో ఆయన అడుగులు వేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇందుకు తగ్గట్టుగా ఢిల్లీ పెద్దల ఆశీస్సులతో, సర్వాధికారాల్ని గుప్పెట్లోకి తెచ్చుకుని తమిళ ప్రభుత్వంపై పట్టుకు ముందుకు సాగుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇందుకు అద్దంపట్టే రీతిలో ఢిల్లీ పెద్దలతో సమాలోచనలు సాగించేందుకు గాను ఆదివారం ఢిల్లీ పయనం కావడం గమనార్హం. బిజీ షెడ్యూల్ మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో రాజ్ భవన్‌నుంచి చెన్నై విమానాశ్రయానికి గవర్నర్ బయలు దేరారు. అక్కడ ఇండిగో ఎయిర్ లైన్స్ విమానంలో ఢిల్లీ వెళ్లారు. సోమవారం బిజీ షెడ్యూల్‌తో ఢిల్లీ పర్యటన సాగనుండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. తొలుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో, తదుపరి ప్రధాని నరేంద్రమోదీతో గవర్నర్ భేటీ సాగనుంది. ప్రధానంగా తమిళ రాజకీయాలు, ప్రభుత్వ బల పరీక్ష వ్యవహారం, అనర్హత వేటు వ్యవహారాలపై చర్చించి, తన అధికారాలు, పరిమితుల మేరకు నిర్ణయాలు తీసుకునే రీతిలో ఈ సమావేశం ద్వారా ఆయన పెద్దల ఆశీస్సుల్ని అందుకునే అవకాశాలున్నట్టు తెలిసింది. అలాగే, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, రక్షణ శాఖ మంత్రి నిర్మల సీతారామన్లతోనూ భేటీకి బన్వరి లాల్ నిర్ణయించి ఉండటం గమనార్హం. మంగళవారం కూడా ఆయన ఢిల్లీలోనే ఉండి బుధ, గురువారం ఢిల్లీలో జరిగే రాష్ట్రాల గవర్నర్ల భేటీ ముగించుకున్న తదుపరి చెన్నైకి తిరుగు పయనం అవుతారని సమాచారం. స్టాన్లీలో అగ్నిప్రమాదం తిరువొత్తియూరు: స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం రాత్రి అగ్ని ప్రమాదం ఏర్పడింది. నాల్గవ అంతస్తులో జనరల్ చికిత్స విభాగంలో వైద్యులు ఉండేందుకు ఓ గది ఉంది. ఈ గదిలోని ఏసీ నుంచి శనివారం రాత్రి మంటలు ఏర్పడ్డాయి. డాక్టర్లు, నర్సులు, సిబ్బంది, రోగులు, సహాయకులు కిందకు పరుగెత్తారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది గంటపాటు పోరాడి మంటలు ఆర్పారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఏర్పడినట్టు తెలిసింది. -
నోట్ల కష్టాలు గవర్నర్‌కు విన్నవిస్తాం
విజయపురిసౌత్ : నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు పడుతున్న కష్టాలను వివరించేందుకు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం గవర్నర్‌ను కలవనున్నట్టు మాచర్ల ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. విజయపురిసౌత్‌లోని మాచర్ల జెడ్పీటీసీ శేరెడ్డి గోపిరెడ్డి గృహంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బ్యాంకుల్లో సైతం చిన్ననోట్లు అందుబాటులోకి రాలేదన్నారు. రైతులు, సన్న, చిన్నకారు వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి నోట్ల రద్దు విషయం ముందుగానే తెలిసినా ప్రజలకు ప్రత్యామ్నాయాన్ని చూపించలేకపోయారని ఆరోపించారు. పెద్దనోట్ల రద్దు విషయంపై ప్రధానికి స్వయంగా లేఖ రాశానని చెప్పటమే ఇందుకు నిదర్శనమన్నారు. దేశం, రాష్ట్రంలోని ప్రజలకు ప్రత్యామ్నాయాన్ని చూపించాల్సిన బాధ్యత అటు ప్రధాని మోదీపై, ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఉందన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు అందరూ రాష్ట్ర గవర్నర్‌ను మధ్యాహ్నం 2.30 గంటలకు కలిసి ప్రజల బాధలను వివరిస్తామన్నారు. అనంతరం జెడ్పీటీసీ గోపిరెడ్డి విజయపురిసౌత్‌లో పారిశుధ్య సిబ్బంది లేకపోవటంతో ఎక్కడ చెత్త అక్కడే నిలిచి వీధులు అపరిశుభ్రంగా ఉన్నాయని, సిబ్బంది నియామకం జరిగేలా చూడాలని ఎమ్మెల్యేను కోరారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళి సమస్య పరిష్కారం చేస్తానని హామీనిచ్చారు. ఎమ్మెల్యే వెంట వైఎస్సార్ సీపీ నాయకులు జూలకంటి వీరారెడ్డి, బూడిద శ్రీను తదితరులు ఉన్నారు.