Government space
-
ప్రభుత్వ స్థలం కబ్జా కాకుండా కాపాడండి
నాగోలు: నాగోలు డివిజన్ పరిధిలోని సర్వే నెంబర్ 96/1లో సాయినగర్ కాలనీలోని చర్చి వెనుకు ఉన్న ప్రభుత్వ స్ధలాన్ని కొత్త మంది కబ్జాదారులు దొంగ పేపర్లు సృష్టించి స్ధలాన్ని కబ్జా చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ ఎల్బీనగర్ కార్యదర్శి కె, చందు, నాగోలు డివిజన్ కార్యదర్శి కందుల సుధాకర్ బుధవారం మేడ్బల్ కలెక్టర్ కార్యాలయం, జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగోలు సాయినగర్‌లోని ప్రభుత్వ భూమిలో గత 15 సంవత్సరాలు 650 కుటుంబాలు గుడిసెలు వేసుకొని నివాసముంటున్నారు. ఈ సర్వే నెంబర్ సంబంధించిన 450 గజాలు స్ధలం ఖాళీగా ఉంది. ఈ భూమిని కొంత మంది భూకబ్జా దారులు కబ్జా చేయాడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ పార్టీ కార్యకర్తలు ఈ స్ధలం కబ్జా కాకుండా కాపాడాలని జీహెచ్ఎంసీ, ఉప్పల్ తహాశీల్దార్‌కు కోరారు. ఈ సందర్భంగా బుధవారం స్ధలం దగ్గర నిరసన వ్యక్తం చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్న సీపీఐ నాయకులు -
ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం
► రెండెకరాలు సాగు చేస్తున్నట్టు రికార్డుల్లో నమోదు ► తాడోపేడో తేల్చుకునేందుకు ► రాజుపేట గ్రామస్తుల నిర్ణయం వడ్డించేవాడు మనోడైతో బంతిలో అఖరిన కూర్చొన్న అన్నీ అందుతాయన్న సామెత అక్షరాల నిజం అనిపిస్తుంది. అధికారం ఉంది కదా అని అధికారులను ప్రసన్నం చేసుకొని ఏకంగా విలువైన ప్రభుత్వ స్థలాన్ని కాజేస్తున్న సంఘటన మండలంలోని రాజుపేటలో చోటు చేసుకుంది. గ్రామంతో సంబంధం లేని వ్యక్తి పేరిట రెండెకరాల స్థలం ఉండటం మరింత బలం చేకూర్చుతోంది. మునగపాక: మండలంలోని రాజుపేట గ్రామంలో సర్వే నంబరు 310లో 5.16 ఎకరాల మేర ప్రభుత్వ స్థలాన్ని గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో స్పోర్స్ట్ కాంప్లెక్స్‌కు కేటాయించారు. అయితే మండల కేంద్రానికి దూరంగా ఉన్నందున ఖాళీగా ఉండిపోయింది. అయితే ఈస్థలాన్ని కాజేసేందుకు అధికార పార్టీ నేతలు తమదైన శైలిలో ప్రయత్నాలు చేశారు. ఇదే అదనుగా భావించిన తిమ్మరాజుపేట గ్రామానికి చెందిన భీమిశెట్టి వెంకటరమణ తాను గత కొంతకాలంగా సర్వేనంబర్ 310 -1లో 2 ఎకరాల స్థలాన్ని సాగు చేస్తున్నట్లు రికార్డులు సృష్టించి పట్టాదారు పాసు పుస్తకం పొందినట్టు సమాచారం. రెవెన్యూశాఖ, భూమి రికార్డుల కంప్యూటరీకరణలో పట్టాదారుని అడంగల్, సహానీ కాఫీలో రైతు పేరు భీమిశెట్టి వెంకటరమణ , సన్ఆఫ్ లేటు జగ్గారావు, ఖాతా నంబర్ 283, సర్వేనెంబర్ 310-1లో 2 ఎకరాల సాగు చేస్తున్నట్లు ఉండటంతో గ్రామస్తులు కంగుతిన్నారు. ప్రభుత్వ భూమిని తాము సాగులో ఉన్నామంటూ పొందుపరచడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇదంతా చోటుచేసుకుందని వారు ధ్వజమెత్తుతున్నారు. దీనిపై తాడోపేడో తేల్చుకునేందుకు రాజుపేట గ్రామస్తులు సిద్ధపడుతున్నారు. రాజుపేట పంచాయతీలో ప్రభుత్వ భూమికి సంబంధించి తిమ్మరాజుపేట గ్రామస్తుల పేరిట రికార్డులో నమోదు కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ ప్రజాప్రతినిధి అండదండలతోనే ఇదంతా జరిగిందని ప్రచారం జరుగుతోంది. దీనిపై తహశీల్దార్ రాంబాబును వివరణ కోరగా ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అడంగల్‌లో తిమ్మరాజుపేట వాసిపేరిట ఎలా నమోదైందన్న దానిపై విచారణ చేస్తామని చెప్పారు. -
వేయిస్తంభాల గుడి పక్కన ‘యెతిమ్‌ఖానా’
వేయిస్తంభాల గుడి పక్కన ఉన్న ప్రభుత్వ స్థలంలో యెతిమ్‌ఖానా(అనాథాశ్రమం) ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహముద్ అలీ అన్నారు. హన్మకొండలోని జక్రియా ఫంక్షన్హాల్లో శనివారం నిర్వహించిన ‘ఈద్‌మిలాప్’ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. దాదాపు 2 కోట్ల మంది ముస్లింలకు రంజాన్ పండుగ సరుకులు అందజేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తర్వాత ఆయన రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని సందర్శించారు. కలెక్టరేట్‌ను కూడా పరిశీలించారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ హన్మకొండ చౌరస్తా : వేయిస్తంబాలగుడి సమీప ప్రభుత్వ స్థలంలో యెతిమ్‌ఖానా(అనాథాశ్రమం) ఏర్పాటు చేయనున్నట్లు ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. హన్మకొండలోని జక్రి యా ఫంక్షన్‌హాల్ లో శనివారం నిర్వహించిన ‘ఈద్‌మిలాప్’ కార్యక్రమానికి ఆయన హాజరై మా ట్లాడారు. రాష్ట్రంలో తొలిసారి రంజాన్ పర్వదినాన్ని అధికారికంగా నిర్వహించింది కేసీఆర్ సర్కారేనన్నారు. సుమారు 2 కోట్ల మంది ము స్లింలకు పండుగ సరుకులు అందజేసి మతసామరస్యానికి ప్రతీకగా నిలిచారన్నారు. జిల్లాలో వక్ఫ్‌బోర్డు స్థలాల ను చూపెడితే ఖబరస్థాన్ల ఏర్పాటుకు అధికారులతో చర్చిస్తామన్నారు. టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి మా ట్లాడుతు తెలంగాణ ఉద్యమంలో ముస్లిం మైనారిటీలు ముందు వరుసలో నిలిచారన్నారు. ముస్లింల జీవన విధానంపై సచార్ కమిటీ ఇచ్చిన నివేదిక చూసి కేసీఆర్ కంటతడి పెట్టారని గుర్తు చేశారు. టీ ఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపెల్లి రవీందర్రావు మాట్లాడుతూ, ఎన్ని ఆరోపణలు ఎదురైనా నిజాం సర్కార్ పనితీరును మెచ్చుకున్న వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు. అనంతరం డిప్యూటీ సీం పెద్దమ్మగడ్డ ఈద్గా పరిశీలించారు. వివాదంలో ఉన్న స్థలాల సమస్య పరిష్కారం కోసం సీఎం కేసీఆర్‌తో మాట్లాడుతానని హామీ ఇచ్చా రు. కార్యక్రమంలో లింగంపల్లి కిషన్‌రావు, కోలా జనార్దన్, మహ్మద్ నయిమొద్దీన్, డాక్టర్ అనీఫ్ సిద్దిఖీ, వెంకటాచారి పాల్గొన్నారు.