నాగోలు: నాగోలు డివిజన్ పరిధిలోని సర్వే నెంబర్ 96/1లో సాయినగర్ కాలనీలోని చర్చి వెనుకు ఉన్న ప్రభుత్వ స్ధలాన్ని కొత్త మంది కబ్జాదారులు దొంగ పేపర్లు సృష్టించి స్ధలాన్ని కబ్జా చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ ఎల్‌బీనగర్ కార్యదర్శి కె, చందు, నాగోలు డివిజన్ కార్యదర్శి కందుల సుధాకర్ బుధవారం మేడ్బల్ కలెక్టర్ కార్యాలయం, జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగోలు సాయినగర్‌లోని ప్రభుత్వ భూమిలో గత 15 సంవత్సరాలు 650 కుటుంబాలు గుడిసెలు వేసుకొని నివాసముంటున్నారు. ఈ సర్వే నెంబర్ సంబంధించిన 450 గజాలు స్ధలం ఖాళీగా ఉంది. ఈ భూమిని కొంత మంది భూకబ్జా దారులు కబ్జా చేయాడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ పార్టీ కార్యకర్తలు ఈ స్ధలం కబ్జా కాకుండా కాపాడాలని జీహెచ్‌ఎంసీ, ఉప్పల్ తహాశీల్దార్‌కు కోరారు. ఈ సందర్భంగా బుధవారం స్ధలం దగ్గర నిరసన వ్యక్తం చేశారు.
నిరసన వ్యక్తం చేస్తున్న సీపీఐ నాయకులు
Comments
Please login to add a commentAdd a comment