fake papers
-
ప్రభుత్వ స్థలం కబ్జా కాకుండా కాపాడండి
నాగోలు: నాగోలు డివిజన్ పరిధిలోని సర్వే నెంబర్ 96/1లో సాయినగర్ కాలనీలోని చర్చి వెనుకు ఉన్న ప్రభుత్వ స్ధలాన్ని కొత్త మంది కబ్జాదారులు దొంగ పేపర్లు సృష్టించి స్ధలాన్ని కబ్జా చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ ఎల్బీనగర్ కార్యదర్శి కె, చందు, నాగోలు డివిజన్ కార్యదర్శి కందుల సుధాకర్ బుధవారం మేడ్బల్ కలెక్టర్ కార్యాలయం, జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగోలు సాయినగర్‌లోని ప్రభుత్వ భూమిలో గత 15 సంవత్సరాలు 650 కుటుంబాలు గుడిసెలు వేసుకొని నివాసముంటున్నారు. ఈ సర్వే నెంబర్ సంబంధించిన 450 గజాలు స్ధలం ఖాళీగా ఉంది. ఈ భూమిని కొంత మంది భూకబ్జా దారులు కబ్జా చేయాడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ పార్టీ కార్యకర్తలు ఈ స్ధలం కబ్జా కాకుండా కాపాడాలని జీహెచ్ఎంసీ, ఉప్పల్ తహాశీల్దార్‌కు కోరారు. ఈ సందర్భంగా బుధవారం స్ధలం దగ్గర నిరసన వ్యక్తం చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్న సీపీఐ నాయకులు -
ట్రంప్ రాజీనామా!
వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్ ప్రజలు బుధవారం ఆశ్చర్యంలో మునిగిపోయారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాజీనామా చేశారని ’వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ’అన్‌ప్రెసిడెంటెడ్‘ అనే శీర్షికతో రాసిన కథనంలో ట్రంప్ రాజీనామాతో ప్రపంచదేశాల్లో సంబరాలు అంబరాన్ని అంటాయని వెల్లడించింది. 2019, మే 1వ తేదీతో ఉన్న ఈ పత్రికను కొందరు వాషింగ్టన్‌తో పాటు వైట్‌హౌస్ సమీపంలో ఉచితంగా పంచిపెట్టారు. ఈ తేదీని గమనించిన వ్యక్తులు ఇది నకిలీ ఎడిషన్ అని భావించారు. చివరికి ఈ విషయం వైరల్‌గా మారడంతో వాషింగ్టన్ పోస్ట్ పత్రిక స్పందిస్తూ.. అది నకిలీ ఎడిషన్ అనీ, దానితో తమకు సంబంధం లేదని ప్రకటించింది. ట్రంప్ 2019, ఏప్రిల్ 30న వైట్‌హౌస్‌ను వదిలివెళ్లిపోయినట్లు ఈ నకిలీ ఎడిషన్‌లో లీసా చుంగ్ పేరుతో కథనం ప్రచురితమైంది. ‘ రాజీనామా విషయంలో ట్రంప్ అధికారిక ప్రకటనను వెలువరించలేదు. 2019, ఏప్రిల్ 30న ఓవల్ కార్యాలయంలోని అధ్యక్షుడి డెస్క్ పక్కన ఓ న్యాప్కిన్ దొరికినట్లు నలుగురు వైట్‌హౌస్ అధికారులు తెలిపారు. అందులో ఎరుపురంగు ఇంక్‌తో ‘ఇందుకు(తన రాజీనామాకు) నిజాయితీ లేని హిల్లరీ క్లింటన్‌ను, హైఫియర్ను, నకిలీ వార్తల మీడియాను నిందించండి’ అని ట్రంప్ రాసినట్లు ఉంది. ప్రస్తుతం ఆయన శ్వేతసౌధం వదిలేసి రష్యాలోని క్రిమియాలో ఉన్న యాల్టా రిసార్ట్‌కు వెళ్లిపోయారు. దీంతో ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ అమెరికా అధ్యక్షుడిగా వెంటనే ప్రమాణస్వీకారం చేశారు’ అని కథనం ప్రచురితమైంది. ట్రంప్ రాజీనామాతో దేశవిదేశాల్లో సంబరాలు చేసుకున్నారని ఎడిషన్‌లో వార్త వచ్చింది. నకిలీ ఎడిషన్‌తో తమకు సంబంధంలేదని వాషింగ్టన్ పోస్ట్ ప్రకటించింది. ‘యస్ మెన్’ అనే గ్రూపు నకిలీ పత్రిక, వెబ్‌సైట్‌ను నడుపుతోందని అమెరికా జర్నలిస్ట్ రామ్సే చెప్పారు. -
భారత పాస్‌పోర్టుల కోసం ఉగ్రవాదుల ప్రయత్నం
అనుమానిత హుజి (హర్కతుల్ జీహాద్ ఇస్లామీ) ఉగ్రవాదులపై టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం రావడంతో.. చంచల్‌గూడ సమీపంలోని ఎంఎం జిరాక్స్ పాయింట్ వద్ద సోదాలు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు సీసీఎస్ జాయింట్ కమిషనర్ ప్రభాకర్ రావు తెలిపారు. నకిలీ పత్రాలతో భారత పాస్‌పోర్టులు పొందేందుకు వాళ్లు ప్రయత్నిస్తున్నారని తెలిసిందన్నారు. ఈ దాడుల్లో తాము ముందుగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. మహ్మద్ నజీర్, మసూద్ అలీఖాన్, పర్వేజ్ఖాన్లను అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరిని విచారించగా, మసూద్ అలీఖాన్ ఇంట్లో మరో ముగ్గురు ఉన్నట్లు తెలిసి, వాళ్లను కూడా కస్టడీలోకి తీసుకున్నట్లు తెలిపారు. తాము మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రభాకర్ రావు చెప్పారు. వీళ్లంతా పుట్టుక రీత్యా బంగ్లాదేశీయులని, అక్కడి నుంచి ఆరేడేళ్ల వయసు ఉన్నప్పుడే పాకిస్థాన్ వెళ్లిపోయారని సీసీఎస్ జాయింట్ కమిషనర్ ప్రభాకర్ రావు తెలిపారు. 2010లో భారతదేశంలోకి అక్రమంగా చొరబడ్డారని, ముందుగా ముజఫర్‌నగర్, పానిపట్ లాంటి కొన్ని ప్రాంతాల్లో తిరిగారని అన్నారు. గడిచిన మార్చి నెలలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చారని, అప్పటినుంచి జైపల్లిలోని యునానీ ఆస్పత్రిలో పనిచేస్తున్నారని వివరించారు. వీళ్లలో మహ్మద్ నజీర్‌కు హుజితో సంబంధాలు ఉన్నాయని, బంగ్లాదేశ్‌లోని హుజి ప్రధాన నాయకుడు జబ్బార్‌తో నిరంతరం టచ్‌లో ఉంటున్నారని చెప్పారు. దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల నిందితుడు సోనీని బంగ్లాదేశ్ పంపేందుకు వీళ్లే సాయపడ్డారని ఆయన అన్నారు. -
పాస్‌పోర్టుల కోసం ఉగ్రవాదుల ప్రయత్నం
-
న్యాయశాఖ మంత్రి డిగ్రీ పత్రాలు నకిలీవే
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ న్యాయశాఖ మంత్రి జితేంద్రసింగ్ తోమర్ ఇక్కట్లు పెరుగుతున్నాయి. ఆయన డిగ్రీ పత్రాలు నకిలీవని ఢిల్లీ బార్ కౌన్సిల్ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీనిపై కేసు నమోదు చేసే విషయాన్ని కూడా బార్ కౌన్సిల్ యోచిస్తోంది. జితే ంద్ర సింగ్ తోమర్ పత్రాలు నకిలీవని దక్షిణ ఢిల్లీ డీసీపీకి ఫిర్యాదుచేసింది. తోమర్ సమర్పించిన డిగ్రీ పత్రాలు నకిలీవని ఢిల్లీ బార్ కౌన్సిల్ కార్యదర్శి జిల్లా పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని రాంమనోహర్ లోహియా అవధ్ యూనివర్సిటీ నుంచి పొందిన డిగ్రీ పట్టా నకిలీదిగా యూనివర్సిటీ తేల్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. బిహార్‌లోని తిల్కా మాంఝీ యూనివర్సిటీ నుంచి రిజిష్టర్ నంబర్ 3687 తో పొందినట్లు ఎల్ఎల్బీ పట్టా నకిలీదని సంబంధిత యూనివర్సిటీ తేల్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు జరిపించవలసిందిగా బార్ కౌన్సిల్ ఢిల్లీ పోలీసులను కోరింది. తోమర్ 2011లో బార్‌కౌన్సిల్ సభ్యత్వం కోసం ధరఖాస్తు చేసి అదే సంవత్సరం సభ్యత్వం పొందారు. న్యాయమంత్రిని అరెస్టు చేయాలి: బీజేపీ నకిలీ సర్టిఫికేట్ల వ్యవహారంలో న్యాయమంత్రి జితేంద్ర సింగ్ తోమర్‌ను అరెస్టు చేయాలని బీజేపీ బుధవారం డిమాండ్ చేసింది. ఢిల్లీ బార్ కౌన్సిల్ ఫిర్యాదు మేరకు మంత్రిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సతీశ్ ఉపాధ్యాయ డిమాండ్ చేశారు.. ఆప్ ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గే పోలీసులు ఇంతవరకూ తోమర్‌ను అరెస్టు చేయలేదని విమర్శించారు. గ త 12 రోజులుగా ఈ విషయమై బీజేపీ ప్రశ్నిస్తున్నప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. పోలీసులు ఎవరి ఒత్తిడికీ తలొగ్గి పని చేయరాదన్నారు. ఢిల్లీని పాలిస్తున్న నకిలీ ప్రభుత్వం, దాని నకిలీ మంత్రుల నిజ స్వరూపాలు బయట పడాల్సి ఉందని ఉపాధ్యాయ అన్నారు.