Governor K Rosaiah
-
ఎదుర్కొంటా!
గవర్నర్ పరవునష్టం దావాపై ఈవీకేఎస్ వ్యాఖ్య కోవై, నీలగిరుల్లో ప్రచారం సాక్షి, చెన్నై: రాష్ర్ట గవర్నర్ రోశయ్య తనకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పరువు నష్టం దావాను చట్టపరంగా ఎదుర్కొంటానని టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ స్పష్టం చేశారు. మదుపుటేనుగును గుంకీ ద్వారా అణచి వేయాలే గానీ, తోడేలు, ముల్ల పంది, నక్క ద్వారా కా దంటూ పరోక్షంగా డీఎండీకే - ప్రజాసంక్షేమ కూటమిపై విరుచుకుపడ్డారు. ఈ కూటమి అన్నాడీఎంకేకు మద్దతుగా ఆవిర్భవించిందేనని ధ్వజమెత్తారు. గురువారం కోయంబత్తూరు, నీలగిరి జిల్లాల్లో ఎన్నికల బరిలో ఉన్న డీఎంకే, కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ సుడిగాలి ప్రచారం సాగించారు. తన మీద గవర్నర్ ద్వారా పరువు నష్టం దావా వేయించారని, దీనిని ఎలా ఎదుర్కొనాలో తనకు తెలుసునని, చట్టపరంగా ఎదుర్కొంటా అని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికలు ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న సమరంగా పేర్కొన్నారు. ధర్మం నిల బడాలంటే, డీఎంకే , కాంగ్రెస్ కూటమిని ఆదరించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. మదపుటేనుగును గుంకీ ద్వారా అణగదొక్కాలేగానీ, తోడేలు, ముళ్లపంది, నక్క ద్వారా కాదని పరోక్షంగా ప్రజా సంక్షేమ కూటమిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇందులో గుంకీ ఎనుగు డీఎంకే, కాంగ్రెస్ కూటమి అని, మదపుటేనుగు, తోడేలు, ముళ్ల పంది, నక్క ఎవ్వరో ఈ పాటికి ఓటర్లకు అర్థమై ఉంటుందని వ్యాఖ్యానించారు. ప్రజా సంక్షేమ కూటమి అన్నాడీఎంకేకు అనుకూలంగా పుట్టుకొచ్చిందని ఆరోపించారు. ప్రజా సంక్షేమ కూటమి లక్ష్యం మళ్లీ జయలలితను సీఎం చేయడమేనని పేర్కొన్నారు. వారి కుట్రల్ని భగ్నం చేద్దామని, డీఎంకే, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి కరుణానిధి చేతికి అధికార పగ్గాలు అప్పగిద్దామని పిలుపునిచ్చారు. ఏదో మాయాజాలం సృష్టించాలని బీజేపీ ప్రయత్నిస్తున్నదని, వారి పాచికలు ఇక్కడ పారబోవని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్నే అమలు చేయని కేంద్రంలోని పాలకులు, ఇక్కడ అంతా ఇచ్చేస్తారంటా..? అని ఎద్దేవా చేశారు. జౌళి ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న కోయంబత్తూరు జిల్లా ఇప్పుడు అన్ని విధాలుగా వెనుకబడి ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ అన్నాడీఎంకేకు అవకాశాలు ఇస్తూ రావడంతోనే, ఓటర్లు ఆ పార్టీకి చులకన అయ్యారని సూచించారు. ఏనుగుల మీద చూపించే ప్రేమను కూడా ఇక్కడి ఓటర్ల మీద ఆ పార్టీ అధినేత్రి చూపించడం లేదని మండి పడ్డారు. రాష్ట్రంలో పారిశ్రామికంగా మొదటి స్థానంలో ఉండేదని, ఇప్పుడు చివరి స్థానానికి చేరిందని వ్యాఖ్యానించారు. ఇతర రంగాల్లో వెనుకబడుతూ వస్తున్నామన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని సూచించారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా వెనక్కు నెట్టడం, వీధివీధికి ఓ టాస్మాక్ తెరిచి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడడం వంటివే ఐదేళ్ల అన్నాడీఎంకే అధినేత్రి పాలన ఘనత అని మండిపడ్డారు. ప్రజలు ఇప్పటికైనా మేల్కొనాలని డీఎంకే, కాంగ్రెస్ అభ్యర్థుల్ని ఆదరించాలని విన్నవించారు. -
కన్నె ర్ర !
రాష్ట్ర చరిత్రలో ప్రప్రథమంగా గవర్నర్ తరఫున ప్రభుత్వ న్యాయవాది పరువునష్టం దావాను బుధవారం కోర్టులో దాఖలు చేశారు. గవర్నర్ రోశయ్య పరువుకు భంగం కల్గించే విధంగా వ్యాఖ్యలు చేసిన టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్‌పై కన్నెర్ర చేశారు. సాక్షి, చెన్నై: రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితకు వ్యతిరేకంగా ఆధార రహిత ఆరోపణలు ఎవ్వరైనా గుప్పిస్తే చాలు పరువునష్టం దావాల మోత మోగుతుంది. ఇప్పటికే డీఎంకే అధినేత కరుణానిధి, దళపతి ఎంకే స్టాలిన్, డీఎండీకే అధినేత విజయకాంత్, పీఎంకే అధినేత రాందాసు తదితర నాయకులు ఈ దావాల్ని ఎదుర్కొంటున్నారు. ఈ దావాల పర్వం ఓ వైపు సాగుతుంటే, మరో వైపు విచారణలకు అడ్డుకట్ట వేయాలంటూ ఉన్నత న్యాయస్థానం ద్వారా స్టేలు తెంచుకున్న నాయకులు కూడా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర చరిత్రలో ప్రప్రథమంగా ప్రభుత్వం తరఫున గవర్నర్ రోశయ్య పరువుకు భంగం కల్గించే విధంగా వ్యవహరించిన వారిపై కన్నెర్ర చేస్తూ చెన్నై సెషన్స్‌కోర్టులో పరువు నష్టం కేసు నమోదుకు పిటిషన్ దాఖలైంది. పరువు నష్టం దావా: రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరువు నష్టం దావాల్ని కోర్టుల్లో కార్పొరేషన్ న్యాయవాది ఎంఎల్ జగన్ దాఖలు చేస్తూ రావడం తెలిసిందే. ఉదయం చెన్నై సెషన్స్ కోర్టులో ఆయన ఓ దావా దాఖలు చేశారు. అందులో టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్‌పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈవీకేఎస్ ఇళంగోవన్ గత నెల చివర్లో ఓ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో గవర్నర్ రోశయ్య పరువుకు భంగం కలిగే విధంగా ఆధార రహిత ఆరోపణలు చేశారని వివరించారు. వీసీల నియామకంలో పెద్ద ఎత్తున నగదు చేతులు మారాయని, ఇందులో ఓ వాటా తనకు, మరో వాటా సీఎం జయలలితకు రోశయ్య ఇచ్చి ఉన్నారని ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కోర్టు దృష్టికి తెచ్చారు. బాధ్యత గల పదవిలో, రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రథమ పౌరుడిగా ఉన్న రోశయ్యపై ఆయన చేసిన ఆరోపణలు ఆధార రహితంగా పేర్కొన్నారు. రాజకీయ ఉద్దేశంతో ఈవీకేఎస్ ఈ వ్యాఖ్యలు చేసి ఉన్నారని పేర్కొంటూ, సీఎం జయలలితను సైతం కించ పరిచే విధంగా ఆధార రహితంగా వ్యాఖ్యలు చేసి ఉన్నారని కోర్టుకు వివరించారు. రాష్ర్ట గవర్నర్ పరువుకు భంగం కల్గించే విధంగా వ్యవహరించిన ఈవీకేఎస్ ఇళంగోవన్‌పై క్రిమినల్ కేసుగా పరువు నష్టం దావా దాఖలు చేస్తున్నామని వివరించారు. ఈ పిటిషన్ న్యాయమూర్తి రాజమాణిక్యం ముందు ఒకటి రెండు రోజుల్లో విచారణకు రానున్నది. -
ప్రగతి పాలన
చెన్నై, సాక్షి ప్రతినిధి:అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించేందుకు గవర్నర్ కే రోశయ్య ఉద యం 11.45 గంటలకు సచివాలయం చేరుకున్నారు. అసెంబ్లీ స్పీకర్ ధనపాల్, కార్యదర్శి జమాలుద్దీన్ ఆయనకు స్వాగతం పలికి లోనికి తీసుకెళ్లగా 12 గంటలకు గవర్నర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. గవర్నర్ రోశయ్య మాట్లాడడం ప్రారంభించగానే డీఎంకే ప్రతిపక్ష నేత స్టాలిన్ లేచి నిలబడి తాము మాట్లాడాల్సిన అవసరం ఉందని కోరా రు. అయితే ఇందుకు స్పీకర్ నిరాకరించడంతో డీఎంకేతో పాటూ ఆపార్టీకి మద్ద తు పలుకుతున్న పుదియతమిళగం, మని దనేయ మక్కల్ కట్చి సభ్యులు సైతం సభ నుంచి వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగిస్తూ, అనేక వినూత్న పథకాలు, విదేశీ సంస్థల సహకారంతో రాష్ట్రం ప్రగతిబాటలో పయనిస్తోందని కితాబిచ్చారు. జపాన్ సంస్థ సహకారంతో రాష్ట్రంలో రూ.770 కోట్లతో పారిశ్రామిక ప్రగతిని రాష్ట్రం సాధించనుందని అన్నారు. 2013-14 వార్షిక బడ్జెట్ కింద రూ.37,128 కోట్లు కేటాయించగా, 2014-15కు రూ.42,185 కోట్లకు పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. రాష్ట్రం 33 శాతం వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్నా ఆహార ధాన్యాల దిగుమతులకు లోటుకలగకుండా జాగ్రత్తపడిందని చెప్పారు. ఆహార భద్రత కోసం 2013-14 కు రూ.400 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇది కాక కేంద్రం ప్రవేశపెట్టిన ఆహారభద్రత చట్టాన్ని సరైన రీతిలో అమలు చేసేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. విద్యుత్, తాగునీరు తదితర అవసరాలకు రూ.834 కోట్లతో 12 పథకాలను ప్రభుత్వం సిద్ధం చేసిందని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని చెప్పారు. అనుమతివ్వనందుకే వాకౌట్ అసెంబ్లీ వెలుపల మీడియాతో స్టాలిన్ మాట్లాడుతూ, గవర్నర్ ప్రసంగానికి ముందుగా మాట్లాడేందుకు తమకు అవకాశం ఇవ్వాలని కోరినా అనుమతించనందున వాకౌట్ చేయాల్సివచ్చిందని తెలిపారు. 2013 జనవరి 1వ తేదీనాటి గవర్నర్ ప్రసంగంలో అనేక పొరపాట్లు దొర్లగా వాటిని సరిదిద్దాలని ఆనాడే కోరామని తెలిపారు. అయితే నేటి వరకు సవరింపులు జరగకపోగా తాజా ప్రసంగంలో మరిన్ని తప్పులు చోటుచేసుకున్నాయని అన్నారు. రాష్ట్రంలో అసమర్థ పాలన, ప్రతిపక్షాలపై అక్రమ కేసులు, పరువు నష్టందావాలు, ప్రతిపక్షాల సభలకు పోలీస్ అనుమతి నిరాకరణ వంటివి సాగడాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించామని తెలిపారు.