governor najma heptulla
-
రేపు మణిపూర్ సీఎంగా బీరెన్ ప్రమాణం
ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో బీజేపీ తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. మంగళవారం సాయంత్రం ఆ రాష్ట్ర గవర్నర్ నజ్మా హెప్తుల్లా.. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానించారు. బీజేపీ శాసన సభ పక్ష నాయకుడు నాంగ్తోంబం బీరేన్ సింగ్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. బుధవారం ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మొత్తం 60 అసెంబ్లీ సీట్లున్న మణిపూర్లో కాంగ్రెస్కు 28, బీజేపీకి 21 సీట్లు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 31 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. బీజేపీ రెండో పార్టీగా నిలిచినా.. నలుగురేసి ఎమ్మెల్యేలున్న నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ), నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్)తో పాటు ఒక లోక్ జనశక్తి ఎమ్మెల్యే, ఒక తృణమూల్ ఎమ్మెల్యే, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే బీజేపీకి మద్దతిస్తున్నారు. దీంతో బీజేపీ బలం 32కు పెరిగింది. ప్రభుత్వ ఏర్పాటుకు తనకే అవకాశం ఇవ్వాలంటూ రాజీనామా చేసేందుకు తాజా ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత ఇబోబీ సింగ్ నిరాకరించినా.. హైడ్రామా నడుమ సోమవారం రాత్రి సీఎం పదవికి రాజీనామా చేసి, లేఖను గవర్నర్కు అందజేశారు. దీంతో బీజేపీకి లైన్ క్లియరైంది. -
రాజీనామాపై సీఎం భిన్న ప్రకటనలు
ఇంఫాల్: మణిపూర్ రాజకీయం ఊహించని మలుపులు తిరుగుతోంది. 60 సీట్లున్న మణిపూర్లో అధికార కాంగ్రెస్ 28 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతోంది. 21 సీట్లు గెలిచిన బీజేపీ ఇతర పార్టీల ఎమ్మెల్యేల (11) మద్దతు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న సంగతి తెలిసిందే. సోమవారం మణిపూర్లో హైడ్రామా చోటు చేసుకుంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు వీలుగా రాజీనామా చేయాలని ఆ రాష్ట్ర గవర్నర్ నజ్మా హెప్తుల్లా సూచించగా.. కాంగ్రెస్ నేత, ముఖ్యమంత్రి ఒక్రమ్ ఇబోబి తిరస్కరించారు. తనకు మెజార్టీ ఉందని, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోనని స్పష్టం చేశారు. కాగా ఇబోబి కొన్ని నిమిషాల్లోనే దిగొచ్చారు. 24 గంటల్లో రాజీనామా చేస్తానని తర్వాత ప్రకటించారు. మణిపూర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 31 ఎమ్మెల్యేలు ఉండాలి. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు తమకు మద్దతు ఇచ్చారని, మొత్తం 32 ఎమ్మెల్యేలు ఉన్నారని, ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని బీజేపీ నేతలు గవర్నర్ను కలసి కోరారు. 32 ఎమ్మెల్యేలను కూడా గవర్నర్ దగ్గరకు తీసుకెళ్లారు. కాగా ముఖ్యమంత్రి ఇబోబి కూడా గవర్నర్ను కలసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరగా.. ఆమె తిరస్కరించారు. బీజేపీకి మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున సీఎం పదవికి రాజీనామా చేయాలని ఇబోబికి సూచించారు. రాజీనామా చేయడానికి మొదట తిరస్కరించిన ఇబోబి.. అంతలోనే మనసు మార్చుకుని మంగళవారం రాజీనామా చేస్తానని ప్రకటించారు.