గడ్డివామి దగ్ధం
బొమ్మనహాళ్(రాయదుర్గం) : గోవిందవాడ గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు వరి గడ్డివామి దగ్ధమైంది. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో బీడీ తాగి ఆర్పకుండా పడేయడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని బాధిత రైతు కుమారస్వామి తెలిపాడు. దాదాపు రూ.80వేల నష్టం వాటిల్లిందని ఎస్ఐ శ్రీరామ్ శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేసి, తహసీల్దార శివయ్యకు రాతపూర్వకంగా అర్జీ అందజేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాని విజ్ఞప్తి చేశారు.