Govt Hospital visit
-
ప్రభుత్వాసుపత్రి సిబ్బందిపై మంత్రి సీరియస్
-
ప్రభుత్వాసుపత్రి సిబ్బందిపై మంత్రి సీరియస్
సాక్షి, నెల్లూరు: దర్గామిట్ట ప్రభుత్వాస్పత్రిలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ ఆకస్మిక తనిఖీ చేశారు. కనీస సౌకర్యాలు లేకపోవడంతో సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. కరోనా బాధితులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. నిన్న (శనివారం) కూడా ఆసుపత్రుల్లో మంత్రి అనిల్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సేవలందించేలా చర్యలు తీసుకోవాలని నారాయణ కోవిడ్ ఆసుపత్రి డాక్టర్లకు మంత్రి సూచించారు. ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. భోజన నాణ్యతపై ఆరా తీశారు. వైద్యం కోసం వచ్చే పేషెంట్లకు ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. అడ్మిషన్లు జాప్యం చేయకుండా చూడాలని ఆస్పత్రి అధికారులను ఆదేశించారు. అవసరమైన ప్రతి ఒక్కరికి రక్త పరీక్షలు, ఎక్స్రే, సీటీ స్కానింగ్ పరీక్షలు చేయాలని సూచించారు. చదవండి: వెలగపూడి వైరస్: పేదల ఫుడ్ కోర్టుపై ‘పడగ’ ప్రియుడి ఇంటి ముందు మౌనదీక్ష -
ప్రసవాల సంఖ్య పెంచాలి
సాక్షి, మెదక్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రçసవాల సంఖ్య పెంచాలని జిల్లా వైద్యధికారి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గురువారం పాపన్నపేట ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. గర్భిణులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించకుండా ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చేలా చొరవ తీసుకోవాలని వైద్యులకు సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రçసవాల విషయంలో పాపన్నపేట వైద్య సిబ్బంది పనితీరు బాగుందని జిల్లా వైద్యధికారి వెంకటేశ్వర్లు ప్రశంసించారు. మండల కేంద్రమైన పాపన్నపేట ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆయన గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల మొదటి నుంచి ఇప్పటివరకు 19 ప్రసవాలు పాపన్నపేట ఆరోగ్య కేంద్రంలో జరపడంపై వైద్య సిబ్బంది పనితీరును ప్రశంసించారు. జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు గర్భిణులు ప్రైవేటును ఆశ్రయించకుండా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేలా చోరవ తీసుకోవాలని పేర్కొన్నారు. తమ ఆస్పత్రిలో ప్రçసవాలు బాగా జరుగుతున్నాయని సిబ్బంది కొరతవల్ల కొంత ఇబ్బంది పడుతున్నామని, మరో స్టాప్ నర్సును ఇవ్వాలని పీహెచ్సీ వైద్యుడు హరిప్రసాద్ కోరారు. జిల్లా వైద్యధికారికి సానుకూలంగా స్పందించారు. డెలివరీ రూం, సంపు నిర్మాణం పనులను వేగవంతం చేయాలని జిల్లా వైద్యాధికారి సూచించారు. అలాగే అస్పత్రికి వచ్చే రోగులు కూర్చోవడానికి ముందు భాగంలో దాతల సహయంతో సిమెంట్ బెంచీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. బుధవారం డెలివరీ జరిగిన ఇద్దరు మహిళలకు కేసీఆర్ కిట్స్ను అందించారు. వీరి వెంట డాక్టర్ హరిప్రసాద్, సీహెచ్ఓ చందర్, మేరీ, అలీ, పద్మ ఉన్నారు. -
విధులలో అలసత్వం వహిస్తే చర్యలు
బద్వేలు అర్బన్: విధులలో అలసత్వం వహించినా, రోగులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినా చర్యలు తప్పవని వైద్యవిధాన పరిషత్ జాయింట్ కమిషనర్ డాక్టర్ జయచంద్రారెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త డాక్టర్పి. జయరాజన్తో కలిసి స్థానిక ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు ఓపీ రిజిస్టర్లను , డ్యూటి రిజిస్టర్లను తనిఖీచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులలో కాన్పుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా వైద్యులు పనిచేయాలని సూచించారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న నవజాత శిశువు సంరక్షణ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని కోరారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ ఆసుత్రి, ప్రైవేటు ఆసుపత్రులలో కాన్పుల సంఖ్య సమానంగా ఉందని దీనిని ప్రభుత్వాసుపత్రులలో ఎక్కువ ప్రసవాలు జరిగేలా పెంచాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటి సివిల్ సర్జన్ డాక్టర్ ఎన్.మల్లీశ్వరి, గైనకాలజిస్ట్ డాక్టర్ దుర్గాభవాణి, వైద్యాధికారి డాక్టర్ శిరీష పాల్గొన్నారు.