సాక్షి, నెల్లూరు: దర్గామిట్ట ప్రభుత్వాస్పత్రిలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఆకస్మిక తనిఖీ చేశారు. కనీస సౌకర్యాలు లేకపోవడంతో సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. కరోనా బాధితులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. నిన్న (శనివారం) కూడా ఆసుపత్రుల్లో మంత్రి అనిల్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సేవలందించేలా చర్యలు తీసుకోవాలని నారాయణ కోవిడ్ ఆసుపత్రి డాక్టర్లకు మంత్రి సూచించారు. ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. భోజన నాణ్యతపై ఆరా తీశారు. వైద్యం కోసం వచ్చే పేషెంట్లకు ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. అడ్మిషన్లు జాప్యం చేయకుండా చూడాలని ఆస్పత్రి అధికారులను ఆదేశించారు. అవసరమైన ప్రతి ఒక్కరికి రక్త పరీక్షలు, ఎక్స్‌రే, సీటీ స్కానింగ్ పరీక్షలు చేయాలని సూచించారు.
చదవండి: వెలగపూడి వైరస్: పేదల ఫుడ్ కోర్టుపై ‘పడగ’
ప్రియుడి ఇంటి ముందు మౌనదీక్ష
Comments
Please login to add a commentAdd a comment