11న పాలిటెక్నిక్ హాస్టల్ ప్రారంభం
పోచమ్మమైదాన్ : వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ ఆవరణలోని బాలికల హాస్టల్ భవనం ఈ నెల 11వ తేదీన ఎట్టకేలకు ప్రారం భం కానుంది. హా స్టల్ భవనం మూ డేళ్లుగా ప్రారంభానికి నోచుకోవడంలేదని పలుమార్లు ‘సాక్షి’లో కథనాలు ప్రచురితం కాగా, వరంగల్ పశ్చిమ శాసన సభ్యుడు దాస్యం వినయ్‌భాస్కర్ చూసి తనిఖీ చేశారు. ప్రారంభానికి కావాల్సిన అన్ని వసతుల గురించి ప్రిన్సిపాల్ శంకర్‌తో చర్చించారు. విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చేతులమీదుగా గురువారం ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సుమారు రూ.కోటికి పైగా నిధులతో నిర్మించిన ఈ భవనం ప్రారంభానికి నోచుకోలేదు. హాస్టల్ భవనం ప్రారంభించేందుకు చొరవ చూపిన ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌కు పాలిటెక్నిక్ జేఏసీ చైర్మన్ మేకల అక్షయ్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.