కంగనా గౌను అదరహో!
కంగనా రనౌత్‌ని ‘ఫ్యాషన్ ఐకాన్’ అంటారు. కాస్ట్యూమ్స్ మొదలుకుని కాలి చెప్పుల వరకు చాలా ఫ్యాషన్‌గా ఉండాలని కోరుకుంటారామె. దానికోసం ఎంత ఖర్చుపెట్టడానికైనా వెనకాడరు. అందుకు ఉదాహరణగా ఇటీవల జరిగిన ఓ సంఘటనను చెప్పుకోవచ్చు. ముంబయ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు కంగనా. ఆ వేదికపై పొడవాటి గౌనులో మిలమిలా మెరిసిపోయారు ఈ హాట్ గాళ్. అది ఓ విదేశీ బ్రాండ్‌కి చెందిన గౌను. దాని ఖరీదు ఐదు లక్షల రూపాయలని విని చాలామంది నోళ్లు వెళ్లబెట్టారు. ఈ గౌనుని కంగనాకి పంపించడంతో పాటు, దాన్ని ఎలా తొడుక్కోవాలో కూడా ఆ ఉత్పత్తిదారులు వివరాలు పంపించారట. ఎలా తొడుక్కోవాలో కూడా సూచించారంటే.. అది ఎంత క్లిష్టమైన గౌనో అర్థం చేసుకోవచ్చు. అది తొడుక్కోవడానికి ఏం పాట్లు పడ్డారో కంగనాకే తెలుసు కానీ, ‘బ్యూటిఫుల్’ అంటూ బోల్డన్ని కాంప్లిమెంట్స్ మాత్రం కొట్టేశారట.