కంగనా గౌను అదరహో! | Kangna Ranaut buys gown for Rs 5 lakh | Sakshi
Sakshi News home page

కంగనా గౌను అదరహో!

Published Thu, Dec 5 2013 1:13 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

కంగనా గౌను అదరహో! - Sakshi

కంగనా గౌను అదరహో!

 కంగనా రనౌత్‌ని ‘ఫ్యాషన్ ఐకాన్’ అంటారు. కాస్ట్యూమ్స్ మొదలుకుని కాలి చెప్పుల వరకు చాలా ఫ్యాషన్‌గా ఉండాలని కోరుకుంటారామె. దానికోసం ఎంత ఖర్చుపెట్టడానికైనా వెనకాడరు. అందుకు ఉదాహరణగా ఇటీవల జరిగిన ఓ సంఘటనను చెప్పుకోవచ్చు. ముంబయ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు కంగనా. ఆ వేదికపై పొడవాటి గౌనులో మిలమిలా మెరిసిపోయారు ఈ హాట్ గాళ్. అది ఓ విదేశీ బ్రాండ్‌కి చెందిన గౌను. దాని ఖరీదు ఐదు లక్షల రూపాయలని విని చాలామంది నోళ్లు వెళ్లబెట్టారు. ఈ గౌనుని కంగనాకి పంపించడంతో పాటు, దాన్ని ఎలా తొడుక్కోవాలో కూడా ఆ ఉత్పత్తిదారులు వివరాలు పంపించారట. ఎలా తొడుక్కోవాలో కూడా సూచించారంటే.. అది ఎంత క్లిష్టమైన గౌనో అర్థం చేసుకోవచ్చు. అది తొడుక్కోవడానికి ఏం పాట్లు పడ్డారో కంగనాకే తెలుసు కానీ, ‘బ్యూటిఫుల్’ అంటూ బోల్డన్ని కాంప్లిమెంట్స్ మాత్రం కొట్టేశారట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement