gowru venkatareddy
-
వైఎస్సార్సీపీ బలోపేతానికి కృషి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లాలో వైఎస్సార్సీపీ బలోపేతానికి కృషి చేస్తామని ఆ పార్టీ నంద్యాల, కర్నూలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు శిల్పా చక్రపాణి రెడ్డి, బీవై రామయ్య అన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా భావించి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూతన అధ్యక్షులను నియమించిన విషయం విదితమే. బుధవారం గౌరు వెంకటరెడ్డి నివాసంలో నూతన అధ్యక్షులు తమ పదవీ బాధ్యతలను స్వీకరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించిన గౌరు వెంకటరెడ్డి వీడ్కోల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ..ప్రస్తుతం ఉన్న జిల్లాలు బ్రిటీషు కాలం నాటి లెక్కలు, భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగానే ఉండడంతో పరిపాలన సౌలభ్యానికి ఇబ్బందిగా మారుతోందన్నారు. పది లక్షల జనాభాకు ఒక జిల్లా ఉండాలనే సంకల్పంతో నంద్యాల ఉపఎన్నికల్లో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటిస్తామన్న హామీ ఇచ్చారన్నారు. అందుకు అనుగుణంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా నూతన జిల్లా ఏర్పాటు ప్రక్రియకు శ్రీకారం చుట్టామన్నారు. గత ఎన్నికల్లో రెండు పార్లమెంట్, 11 అసెంబ్లీ, జెడ్పీ చైర్మన్‌తోపాటు పలు మునిసిపాలిటీలను వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడంలో గౌరు వెంకటరెడ్డి కృషి ఎంతో ఉందన్నారు. మున్ముందు ఆయ న సేవలుఎంతో అవసరమని చెప్పారు. సలహాలు, సూచనలు స్వీకరిస్తాం.. శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ..పార్టీ అధ్యక్షుడు తనపై ఉంచిన నమ్మకాన్ని పార్టీని బలోపేతం చేసి నిలబెట్టుకుంటానన్నారు. నం ద్యాల పార్లమెంట్‌లోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేస్తానన్నారు. పార్టీలో ఎవరూ చేరినా స్వాగతిస్తానని, అందరిని సమన్వయం తో పనిచేస్తూ తాను చేస్తానని ముందుం టాన్నారు. గౌరు వెంకటరెడ్డి తమ కుటుంబానికి ఎంతో ఆత్మీయుడని, ఆయన సలహాలు, సూచనలను స్వీకరిస్తాన్నారు. గెలుపే లక్ష్యం.. బీవై రామయ్య మాట్లాడుతూ..365 రోజులు..24 గంటలు పార్టీ కోసం పని చేస్తానన్నారు. నాయకులు, కార్యకర్తలతో కలసి పనిచేస్తానని, పార్టీ బలోపేతం కోసం ఎవరూ సలహాలు, సూచనలు ఇచ్చినా స్వీకరిస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో సమష్టి నిర్ణయాలతో కర్నూలు పార్లమెంట్ పరిధిలోని అన్ని స్థానాల్లో గెలుపు కోసం ప్రణాళికలు రూపొందిస్తానని చెప్పారు. సహకారం మరువలేనిది.. గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ...2014 ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు అందించిన సహకారం మరువలేన్నారు. ఎవరైనా ఇబ్బంది పెడితే క్షమించాలని కోరారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యే వరకు పార్టీలో ఏ బాధ్యతలు ఇచ్చినా తీసుకుంటానన్నారు. పార్టీ బలోపేతంకోసం తనవంతు సేవలను కొనసాగిస్తానని చెప్పారు. -
‘ప్రజా సంకల్పం’ విజయవంతం చేస్తాం
కల్లూరు (రూరల్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపడుతున్న ప్రజాసంకల్ప పాదయాత్రను విజయవంతం చేస్తామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య అన్నారు. శుక్రవారం స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత చేపట్టబోయే ప్రజాసంకల్ప పాదయాత్రను అడ్డుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చూస్తున్నారన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర ఆగబోదన్నారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకోవడంతోపాటు హామీలను నెరవేర్చకుండా చంద్రబాబు ఎలా మోసం చేశారో వివరిస్తామన్నారు. రుణమాఫీ చేస్తానని రైతులు, డ్వాక్రా మహిళలను మోసం చేసిన ఘనత టీడీపీ అధినేతదేనన్నారు. మోసం చేయడమే ముఖ్యమంత్రి, టీడీపీ నాయకుల నైజమన్నారు. ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి ఇరుక్కున్నారని, గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటలో 29 మంది చనిపోతే ఇంతవరకూ విచారణ లేదన్నారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. తహసీల్దార్ వనజాక్షిపై దాడి చేశారని, పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని..సాక్షాత్తు ఏపీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ చొక్కాపట్టుకుని అవమానించారని..అయినా వారిపై చర్యలు లేవన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో నిందితుడైన కేఈ శ్యామ్‌బాబును ఆరునెలలైనా అరెస్ట్ చేయకపోవడం దారుణమన్నారు. కేఈ శ్యామ్‌బాబును అరెస్ట్ చేయకపోతే త్వరలోనే నిరాహార దీక్షకు కూర్చుంటామని హెచ్చరించారు. చెరుకులపాడు నారాయణరెడ్డి కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు. తుని సంఘటనలో రైలును తగలబెట్టింది ఎవరో ప్రజలకు తెలిసిపోయిందన్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారితో రాజీనామా చేయించేదాకా అసెంబ్లీని బహిష్కరిస్తున్నట్లు తమ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు పతనానికి కౌంట్ డౌన్ మొదలైందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు. -
గౌరు వెంకటరెడ్డి నామినేషన్ దాఖలు
కర్నూలు : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఐజయ్య, గౌరు చరిత, బాలనాగిరెడ్డి, సాయిప్రసాద్ రెడ్డి, పార్టీ నేతలు గంగుల ప్రభాకర్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాస్తవానికి కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్ సీపీ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉంది. కాగా అధికారపార్టీ నుంచి ఇప్పటివరకూ అభ్యర్థి ఖరారు కాలేదు. మరోవైపు నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల కోటా మండలి ఎన్నికలకు వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా ఆనం విజయకుమార్‌రెడ్డి పేరు ఖరారు అయింది.