GPS equipment
-
అపహరణకు గురైనవాడే నేరస్తుడు, ఫిర్యాదుదారుడే నిందితుడు
న్యూఢిల్లీ: మనం ఎన్నో విచిత్రమైన కేసులు గురించి విన్నాం. కానీ ఈ కేసు అత్యంత విచిత్రమైంది. పోలీసులకు ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నప్పుడూ అత్యంత ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో అత్యంత విస్తుపోయే విషయమేమిటంటే..అపహరణకు గురైనవాడిపై గతంలో చీటింగ్ కేసు నమోదైంది. ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే నిందితులే బాధితులుగా మారడం. ఈ ఘటన నోయిడాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....గ్రేటర్ నోయిడాలోని కస్నా ప్రాంతంలో వ్యాపారవేత్త అమిత్ కుమార్ కిడ్నాప్‌కి గురయ్యారు. వ్యాపారవేత్త కారుని ఒక రౌండ్అబౌట్ వద్ద ఆపి, అతనిని, అతని డ్రైవర్ కుందన్‌ను కొట్టి హెచ్చరిక కాల్పులు జరిపారు. అనంతరం కుమార్‌తో కలిసి వేగంగా వెళ్లిపోయారు. అయితే వ్యాపారవేత్త డ్రైవర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమెదు చేసుకుని విచారించడం మొదలు పెట్టారు. ఈ మేరకు ఈ ఘటనలోని ప్రధాన నిందితుడుగా పర్వీందర్ తెవటియాని గుర్తించి అరెస్టు చేయడమే కాకుండా నేరానికి ఉపయోగించిన కారు, పిస్టల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత పోలీసులు ఈ కేసు తాలుకా షాకింగ్ విషయాలు విని ఆశ్చర్యపోయారు. అపహరణకు గురైన వ్యాపారవేత్త పై సుమారు రెండున్నర కోట్ల చీటింగ్ కేసు నమైదైందని గుర్తించారు. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఆ వ్యాపారవేత్త మీద ఫిర్యాదు చేసినవాడే అపహరించాడని పోలీసులు తెలుసుకున్నారు. దీంతో పోలీసులు మరింత లోతుగా విచారించగా అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల కథనం ప్రకారం.. "వ్యాపారవేత్త అమిత్ కుమార్ తనకు మంత్రిత్వ శాఖలో పరిచయాలు ఉన్నాయని చెప్పి నిందితుడు తెవతియాకి భూమికి సంబంధించిన సమస్యలో సాయం చేశాడు. ఆ తర్వాత తనకు హోమంత్రితో ఉన్న పరిచయాలతో ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇప్పించగలనని చెప్పాడు. దీంతో తెవతియా అతని కూతురు, పలువురు ప్రభుత్వ ఉద్యోగాల కోసం సుమారు రెండున్నర కోట్లు ఈ వ్యాపారవేత్తకు ఇచ్చారు. ఏడాది గడుస్తున్న ఉద్యోగాలు రాకపోడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తేవటియా కుమార్ కారుకు జీపీఎస్ సిస్టమ్‌ను అమర్చి, అతడిని అనుసరించి మరీ అపహరించాడు" అని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఇద్దరూ జైల్లోనే ఉన్నారు. (చదవండి: ఇరు కుటుంబాల మధ్య పాతకక్షలు...హంతకుడిగా మారిన పెళ్లి కొడుకు) -
వాహన రుణగ్రహీతలకు ‘జీపీఎస్’ కమీషన్ వెనక్కి
ముంబై: హెచ్డీఎఫ్సీ బ్యాంకు వద్ద వాహనరుణాలు తీసుకుని, జీపీఎస్ పరికరాలను సైతం కొనుగోలు చేసిన కస్టమర్లకు ‘కమీషన్ల’ను త్వరలో తిరిగి చెల్లించనున్నట్టు ప్రకటించింది. 2013–14 నుంచి 2019–20 ఆర్థిక సంవత్సరం మధ్య వాహన రుణాలు తీసుకున్న కస్టమర్లతో హెచ్డీఎఫ్సీ బ్యాంకు జీపీఎస్ పరికరాలను కూడా కొనుగోలు చేయించింది. ఆయా పరికరాల విక్రయం రూపంలో కమీషన్లను సంపాదించుకుంది. వాహన రుణాల్లో అవకతవకలు జరిగినట్టు గతేడాది బ్యాంకు చీఫ్‌గా ఉన్న ఆదిత్యపురి సైతం అంగీకరించారు. దీనిపై ఆర్బీఐ రూ.10 కోట్ల జరిమానా కూడా విధించింది. ఈ నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. 2013–14 నుంచి 2019–20 మధ్య వాహన రుణాలు తీసుకుని, జీపీఎస్ పరికరాలనూ కొనుగోలు చేసిన వారికి కమీషన్లను తిరిగి చెల్లించనున్నట్టు ప్రకటించింది. బ్యాంకు వద్ద నమోదై ఉన్న కస్టమర్ల ఖాతాలకు వచ్చే 30 రోజుల్లో ఈ మొత్తాన్ని జమ చేయనున్నట్టు తెలిపింది. దీనిపై కస్టమర్లు బ్యాంకు శాఖలను సంప్రదించొచ్చని సూచించింది. వాహన రుణ దరఖాస్తును ఆమోదించే సమయంలో కస్టమర్‌తో రూ.18,000 విలువ చేసే జీపీఎస్ పరికరాన్ని హెచ్డీఎఫ్సీ బ్యాంకు కొనుగోలు చేయించిందన్నది ఆరోపణ. నిబంధనల ప్రకారం బ్యాంకు లు ఇతర ఉత్పత్తులను విక్రయించరాదు. సేవల ప్రారంభానికి ప్రయత్నిస్తున్నాం అదే పనిగా డిజిటల్ సేవల్లో అంతరాయాలు ఏర్పడుతుండడంతో.. నూతన క్రెడిట్ కార్డులు మంజూరు చేయకుండా ఆర్బీఐ విధించిన నిషేధం నుంచి బయటపడేందుకు తమవంతు కృషి చేస్తున్నట్టు హెచ్డీఎఫ్సీ బ్యాంకు చీఫ్ ఇన్ఫర్మేషన్ అధికారి రమేష్ లక్ష్మీనారాయణ తెలిపారు. నూతన టెక్నాలజీని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. సేవల్లో అంతరాయాలు ప్రస్తుత పాత వ్యవస్థ కారణంగానే చోటుచేసుకుంటున్నట్టు పేర్కొన్నారు. వీటిని సాధ్యమైనంత వేగంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. తరచూ సాంకేతిక అవాంతరాలు ఏర్పడుతుండడంతో కొత్తగా క్రెడిట్ కార్డులు, నూతన డిజిటల్ సేవలు ప్రారంభించకుండా 2020 డిసెంబర్లో ఆర్బీఐ నిషేధం విధించడం గమనార్హం. -
ఇసుకపై నిరంతర నిఘా!
సాక్షి, అమరావతి: నిరంతర నిఘా ద్వారా ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాకు పూర్తిగా చెక్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్క టన్ను ఇసుక కూడా దారిమళ్లడానికి, దుర్వినియోగానికి అవకాశం లేకుండా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేయాలన్న సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం గట్టి చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అన్ని రీచ్‌లు, స్టాక్ యార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అధికారులు నిరంతర నిఘా కొనసాగించనున్నారు. అంతేకాకుండా ఇసుక తరలించే వాహనాలను నిరంతరం ట్రాకింగ్ చేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా జీపీఎస్ పరికరాలు అమర్చిన వాహనాలను మాత్రమే ఇసుక రవాణాకు అనుమతించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వాహనాలను కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించనుంది. కాగా, రాష్ట్రంలో అన్ని ఇసుక రేవులు, స్టాక్ యార్డుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ టెండర్లు నిర్వహించింది. ఈ టెండర్లలో అతి తక్కువ మొత్తానికి రూ.58,970.5కు కోట్ చేసిన ఆర్యాస్ స్మార్ట్ సిటీ ప్రైవేట్ లిమిటెడ్ ఎల్–1గా నిలిచింది. ‘రూ.59,689.66కు బిడ్ వేసిన యాపిల్ విజన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎల్–2గా, రూ.1,32,299కి కోట్ చేసిన బ్రిస్పతి అనే సంస్థ ఎల్–3గా నిలిచాయి. కెమెరా, స్తంభం, బ్యాటరీ, సోలార్ ప్యానల్, ఇన్స్టలేషన్ కలిపి సీసీ కెమెరా యూనిట్‌గా నిర్ణయించి 302 యూనిట్లకు టెండర్లు పిలవగా ఒక్కో యూనిట్‌కు రూ.58,970.5కు ఆర్యాస్ బిడ్ వేసింది. ఇదే తక్కువ మొత్తం కావడంతో ఈ సంస్థకే టెండరును ఖరారు చేశారు. అలాగే ఇసుక తవ్వకం (క్వారీల్లో ఇసుక తవ్వకం, కూలీలతో ట్రాక్టర్‌కు లోడింగ్, స్టాక్ యార్డుకు రవాణా, అన్ లోడింగ్, అక్కడ నుంచి వినియోగదారులకు రవాణా చేసేందుకు టిప్పర్‌కు లోడింగ్) కోసం తొమ్మిది షెడ్యూళ్లకు టెండర్లు పిలవగా 40 మంది బిడ్లు వేశారు. అంతకుముందు తొలి విడతలో 38 షెడ్యూళ్లకు టెండర్లు ఖరారు చేశారు. రవాణా టెండర్లు రద్దు స్టాక్ యార్డుల నుంచి వినియోగదారులకు ఇసుక రవాణా చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ జిల్లా యూనిట్‌గా పిలిచిన టెండర్లు రద్దు కానున్నాయి. జీపీఎస్ పరికరాలు అమర్చుకుని భూగర్భ గనుల శాఖలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాలన్నింటికీ స్టాక్ యార్డుల నుంచి వినియోగదారులు కోరిన చోటకు ఇసుక రవాణా చేసే అవకాశం కల్పించాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆ టెండర్లు రద్దయినట్టే. ప్రజలకు సరసమైన ధరలకు ఇసుకను తీసుకెళ్లే అవకాశం వాహన యజమానులందరికీ కల్పించాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రవాణా శాఖ అధికారులు వాహన యజమానుల అసోసియేషన్లతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి ఇసుక రవాణా ధరలను ఖరారు చేయాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. -
‘వాహనాలకు జీపీఎస్,సీసీ కెమెరాలు తప్పనిసరి’
సాక్షి, హైదరాబాద్: త్వరలో హైదరాబాద్‌లోని అన్ని రవాణా వాహనాలకు జీపీఎస్ పరికరాలు తప్పనిసరి చేయనున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో సేఫ్ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా మహిళల భద్రతపై డీజీపీ కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. డీజీపీ మహేందర్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పోలీసు అధికారులతోపాటు విమెన్ సేఫ్టీ వింగ్ చీఫ్, ఐజీ (ఎల్ అండ్ వో) స్వాతి లక్రా, రవాణ శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ తదితరులు పాల్గొన్నారు. మహిళల భద్రత గురించి తీసుకోవాల్సిన అంశాలే కేంద్రంగా ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో అనుమతి ఉన్న కార్లు, ఆటోలు తదితర రవాణా వాహనాలకు జీపీఎస్ సౌకర్యం ఉండాలని రవాణా అధికారులు సూచించారు. నగరంలో సీసీ కెమెరాల సంఖ్యను మరింత పెంచాలని, పలు ప్రజా రవాణా వాహనాల్లోనూ సీసీ కెమెరాలను అమర్చాలని సమావేశం అభిప్రాయపడింది. -
‘వాట్సప్’లోకి పౌరసరఫరాల శాఖ
త్వరలో ప్రత్యేక నంబర్ ద్వారా రేషన్ ఫిర్యాదుల స్వీకరణ సాక్షి, హైదరాబాద్: ప్రజాపంపిణీ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ చర్యలు చేపడుతోంది. గ్రామ స్థాయిలో జరిగే ఏ చిన్న అక్రమానికి సంబంధించిన సమాచారమైనా ప్రధాన కార్యాలయానికి చేరే లా ప్రత్యేక వాట్సప్ నంబర్‌ను త్వరలో ప్రకటించనుంది. మండల స్థాయి నిల్వ కేంద్రాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు, సరుకుల తరలింపు లారీలకు జీపీఎస్ పరికరాలు, బయోమెట్రిక్ విధానం, సోషల్ మీడియా ద్వారా రేషన్ ఫిర్యాదుల స్వీకరణ వంటి చర్యలు తీసుకుంటోంది. అక్రమాల అడ్డుకట్టే ఏకైక లక్ష్యం..: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా రూ. 196 కోట్ల సబ్సిడీని భరించి 1.75 లక్షల టన్నుల బియ్యాన్ని రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేస్తోంది. అయితే రేషన్ బియ్యం పక్కదారి పట్టడం ఆనవాయితీగా మారింది. ఈ జాడ్యానికి చరమగీతం పాడేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. సరుకులు మార్గమధ్యంలో దారిమళ్లకుండా వెహికిల్ ట్రాకింగ్ కోసం 1,150 ట్రక్కులకు జీపీఎస్ పరికరాలు అమర్చారు. జీపీఎస్, సీసీటీవీలు, సోషల్ మీడియాను పరిశీలించడానికి వీలుగా పౌరసరఫరాల శాఖ ప్రధాన కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కేంద్రాన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్ల కార్యాలయాలకు అనుసంధానిస్తున్నారు. -
కరెంటునిచ్చే హైటెక్ వస్త్రం!
అమెరికా : చేతికున్న వస్త్రాలను చూస్తే ఏమనిపిస్తోంది.. కొత్త స్టైల్ కోసం అలా కట్టుకున్నాడనుకుంటున్నారా..? అదేం కాదు.. ఇవి హైటెక్ వస్త్రాలు... ఎందుకంటే వీటితో తయారైన దుస్తులను ధరిస్తే విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. నూలు పోగులతో పాటు అక్కడక్కడా ఉండే ప్లాస్టిక్ సోలార్ సెల్స్ సూర్యుడి వేడిని విద్యుత్‌గా మారుస్తాయి. అంతేకాదు వీచే గాలితో కూడా అందులో టైబ్రో ఎలక్ట్రిక్ నానో జనరేటర్లు కరెంటును ఉత్పత్తి చేస్తాయి. గుండీల స్థానంలో బ్యాటరీలను వాడితే ఈ విద్యుత్తునే స్మార్ట్ఫోన్లు, జీపీఎస్ పరికరాలకు చార్జింగ్ పెట్టుకోవచ్చు. అమెరికాలోని జార్జియా టెక్ యూనివర్సిటీ పరిశోధకుడు ఝాంగ్ లింగ్ వాంగ్ ఈ ఐడియాను వాస్తవరూపంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ట్రిబో ఎలక్ట్రిక్ నానో జనరేటర్లు.. ట్రిబో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, ఎలక్ట్రోస్టాటిక్ ఇండక్షన్ అనే రెండు భౌతిక ధర్మాల ఆధారంగా కదలికలు, ప్రకంపనల నుంచి చిన్నమొత్తంలో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. 320 మైక్రోమీటర్ల మందం మాత్రమే ఉండే ఈ హైటెక్ వస్త్రాన్ని జోడించడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ఝాంగ్ చెబుతున్నారు.