Graeme creamer
-
జింబాబ్వే కెప్టెన్, కోచింగ్ స్టాఫ్‌పై వేటు
హరారే: వన్డే ప్రపంచకప్–2019కు అర్హత సాధించడంలో జింబాబ్వే జట్టు విఫలమవడంతో కెప్టెన్ గ్రేమ్ క్రేమర్‌తో పాటు కోచింగ్ స్టాఫ్‌పై వేటు పడింది. ఇటీవల ముగిసిన ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో పేలవ ప్రదర్శనతో వరల్డ్‌కప్‌లో పాల్గొనే అవకాశం కోల్పోయిన జింబాబ్వే పై ఆ దేశ క్రికెట్ బోర్డు చర్యలు తీసుకుంది. క్రేమర్ను కెప్టెన్సీ నుంచి తొలగించి అతని స్థానంలో బ్రెండన్ టేలర్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. హెడ్ కోచ్ హీత్ స్ట్రీక్, బ్యాటింగ్ కోచ్ లాన్స్ క్లూసెనర్, బౌలింగ్ కోచ్ డగ్లస్ హోండో, ఫీల్డింగ్ కోచ్ వాల్టర్ చవగుట, ఫిట్నెస్ కోచ్ సీన్ బెల్, అనలిస్ట్ స్టాన్లె చీజాలతో పాటు శిక్షణ బృందాన్ని తక్షణమే తొలగిస్తున్నట్లు శుక్రవారం తెలిపింది. వీరితో పాటు సెలక్షన్ కమిటీ కన్వీనర్ తతేంద తైబు, అండర్–19 కోచ్ స్టీఫెన్ మాన గోంగోలను కూడా వారి పదవుల నుంచి తొలగించింది. 1979 తర్వాత జింబాబ్వే ప్రపంచకప్‌నకు అర్హత సాధించకపోవడం ఇదే తొలిసారి. -
క్రీమర్ అజేయ శతకం
జింబాబ్వే 373 ఆలౌట్ హరారే: జింబాబ్వే కెప్టెన్ గ్రేమ్ క్రీమర్ (207 బంతుల్లో 102 నాటౌట్; 10 ఫోర్లు) వీరోచిత పోరాటంతో జట్టును ఫాలోఆన్ నుంచి తప్పించాడు. శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టులో జింబాబ్వే తొలి ఇన్నింగ్సలో 107.5 ఓవర్లలో 373 పరుగుల వద్ద ఆలౌటైంది. 88/1 ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం మూడో రోజు ఆట కొనసాగించిన జింబాబ్వే జట్టులో పీటర్ మూర్ (84 బంతుల్లో 79; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), తిరిపానో (92 బంతుల్లో 46; 7 ఫోర్లు) రాణించారు. వీరిద్దరి ఆండతో క్రీమర్ అజేయ శతకం సాధించాడు. లంక బౌలర్లలో లక్మల్, హెరాత్ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. పెరీరాకు 2 వికెట్లు దక్కారుు. తొలి ఇన్నింగ్సలో శ్రీలంకకు 164 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స మొదలు పెట్టిన లంక ఆట నిలిచే సమయానికి వికెట్ నష్టపోకుండా 5 పరుగులు చేసింది. కరుణరత్నే (1 బ్యాటింగ్), కౌశల్ సిల్వా (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.