క్రీమర్ అజేయ శతకం
జింబాబ్వే 373 ఆలౌట్
హరారే: జింబాబ్వే కెప్టెన్ గ్రేమ్ క్రీమర్ (207 బంతుల్లో 102 నాటౌట్; 10 ఫోర్లు) వీరోచిత పోరాటంతో జట్టును ఫాలోఆన్ నుంచి తప్పించాడు. శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టులో జింబాబ్వే తొలి ఇన్నింగ్‌సలో 107.5 ఓవర్లలో 373 పరుగుల వద్ద ఆలౌటైంది. 88/1 ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం మూడో రోజు ఆట కొనసాగించిన జింబాబ్వే జట్టులో పీటర్ మూర్ (84 బంతుల్లో 79; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), తిరిపానో (92 బంతుల్లో 46; 7 ఫోర్లు) రాణించారు.
వీరిద్దరి ఆండతో క్రీమర్ అజేయ శతకం సాధించాడు. లంక బౌలర్లలో లక్మల్, హెరాత్ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. పెరీరాకు 2 వికెట్లు దక్కారుు. తొలి ఇన్నింగ్‌సలో శ్రీలంకకు 164 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్‌స మొదలు పెట్టిన లంక ఆట నిలిచే సమయానికి వికెట్ నష్టపోకుండా 5 పరుగులు చేసింది. కరుణరత్నే (1 బ్యాటింగ్), కౌశల్ సిల్వా (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.