వరుణుడు కరుణించాలని..
వరణుడి కరుణించాలని ఆస్పరి మండలం బిణిగేరి గ్రామస్తులు గ్రామ దేవతకు జలాభిషేకం చేసేందుకు తుంగభద్ర నీటిని యాత్రగా తీసుకెళ్తున్నారు. ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలు వర్షాలు లేక వాడు ముఖం పట్టడంతో శుక్రవారం తుంగ భద్రనదీ జలం కోసం వెళ్లారు. శనివారం తిరుగు ప్రయాణంలో ఆదోని మీదుగా వెళ్తున్నారు. మారణాయుధాలు, కర్రలకు పూలు అలంకరించడం.. కళశాలతో నీళ్లు తీసుకెళ్తూ ప్రత్యేకంగా కనిపించారు.
– ఆదోని టౌన్