Grand slam tennis tournment
-
ప్రజ్నేశ్ గుణేశ్వరన్‌కు నిరాశ
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ క్వాలిఫయింగ్ బరిలో మిగిలిన చివరి భారత ప్లేయర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ పోరాటం రెండో రౌండ్లోనే ముగిసింది. ప్రజ్నేశ్ 3–6, 4–6తో క్రిస్టోఫర్ యుబ్యాంక్స్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. క్రిస్టోఫర్ 14 ఏస్‌లు సంధించగా... ప్రజ్నేశ్ 5 ఏస్‌లను మాత్రమే కొట్టాడు. ఇతర భారత ప్లేయర్లు సుమిత్ నగాల్, రామ్‌కుమార్... మహిళల విభాగంలో అంకిత రైనా తొలి రౌండ్లోనే ఓడారు. -
సుమీత్ నాగల్ సంచలనం
న్యూయార్క్: భారత టెన్నిస్ యువతార సుమీత్ నాగల్ తన కెరీర్లోనే గొప్ప ప్రదర్శన చేశాడు. తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల సుమీత్ ప్రధాన ‘డ్రా’లో బెర్త్ దక్కించుకున్నాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 190వ స్థానంలో ఉన్న సుమీత్ 2 గంటల 27 నిమిషాల పాటు సాగిన క్వాలిఫయింగ్ చివరి రౌండ్ మ్యాచ్ లో 5–7, 6–4, 6–3తో జావో మెనెజెస్ (బ్రెజిల్)పై గెలుపొందాడు. తొలి సెట్‌ను కోల్పోయి, రెండో సెట్లో 1–4తో వెనుకబడిన దశలో సుమీత్ అద్భుతంగా పుంజుకున్నాడు. వరుసగా ఐదు గేమ్‌లు గెలిచి సెట్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక మూడో సెట్లో సుమీత్ పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. సోమవారం మొదలయ్యే ప్రధాన టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌తో సుమీత్ తలపడనున్నాడు. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మంగళవారం ఉదయం జరుగుతుంది. 1998 తర్వాత...: సుమీత్ మెయిన్ ‘డ్రా’కు చేరుకోవడంతో... 1998 తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో ఇద్దరు భారత ఆటగాళ్లు మెయిన్ ‘డ్రా’లో ఆడనున్నారు. ర్యాంకింగ్ ఆధారంగా భారత నంబర్‌వన్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ యూఎస్ ఓపెన్‌లో నేరుగా మెయిన్ ‘డ్రా’లో చోటు సంపాదించాడు. తొలి రౌండ్లో అతను ఐదో సీడ్ మెద్వెదేవ్ (రష్యా)తో తలపడతాడు. చివరిసారి 1998 వింబుల్డన్ టోర్నీ పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో లియాండర్ పేస్, మహేశ్ భూపతి రూపంలో ఇద్దరు భారత ఆటగాళ్లు ఈ ఘనత సాధించారు. ‘‘టెన్నిస్ రాకెట్ పట్టే ప్రతి ఒక్కరూ ఏనాడైనా ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో మెయిన్ ‘డ్రా’లో ఆడాలని కలలు కంటారు. నా విషయంలోనూ అంతే. యూఎస్ ఓపెన్ మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందడంతో చాలా సంతోషంగా ఉన్నాను. ఆర్థర్ యాష్ స్టేడియం సెంటర్ కోర్టులో వేలాది మంది ప్రేక్షకుల నడుమ ఫెడరర్‌లాంటి దిగ్గజంతో తొలి రౌండ్ మ్యాచ్ ఆడే అవకాశం రావడం నిజంగా అద్భుతం. టెన్నిస్‌లో దేవుడిలాంటివాడైన ఫెడరర్‌తో తలపడే అవకాశం రావాలని ఇటీవలే కోరుకున్నాను. ఇంత తొందరగా నా కోరిక తీరుతుందని అనుకోలేదు. ఈ మ్యాచ్ కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నాను.’’ – సుమీత్ నాగల్ -
ఒసాకా, సెరెనా ఔట్
తొలి రెండు మ్యాచ్‌ల్లో అతి కష్టమ్మీద గట్టెక్కిన మహిళల సింగిల్స్ ప్రపంచ నంబర్‌వన్ నయోమి ఒసాకా మూడో రౌండ్లో మాత్రం ఆ అద్భుతం చేయలేకపోయింది. డబుల్స్‌లో నంబర్‌వన్‌గా ఉన్న కాటరీనా సినియకోవాతో జరిగిన మ్యాచ్‌లో వరుస సెట్లలోనే చేతులెత్తేసిన ఒసాకా ఫ్రెంచ్ ఓపెన్ నుంచి నిష్క్రమించింది. మరోవైపు మాజీ చాంపియన్ సెరెనా విలియమ్స్ కూడా ఇంటిదారి పట్టింది. అమెరికాకే చెందిన సోఫియా కెనిన్ వరుస సెట్లలో సెరెనాను ఓడించి తన కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో శనివారం పెను సంచలనాలు చోటు చేసుకున్నాయి. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ క్రీడాకారిణి నయోమి ఒసాకా ... పదో సీడ్, మాజీ చాంపియన్ సెరెనా విలియమ్స్ (అమెరికా) పోరాటం మూడో రౌండ్లోనే ముగిసింది. డబుల్స్ నంబర్‌వన్, సింగిల్స్‌లో 42వ ర్యాంకర్ కాటరీనా సినియకోవా (చెక్ రిపబ్లిక్) ధాటికి ఒసాకా ఇంటిముఖం పట్టింది. 77 నిమిషాల పాటు జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో సినియకోవా 6–4, 6–2తో ఒసాకాను ఓడించి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీ సింగిల్స్ విభాగంలో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రపంచ 35వ ర్యాంకర్ సోఫియా కెనిన్ 6–2, 7–5తో సెరెనాను బోల్తా కొట్టించింది. ఈ ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో ఒసాకా తొలి సెట్‌ను కోల్పోయి, తర్వాతి రెండు సెట్లు గెలిచి నిలిచింది. కానీ మూడో మ్యాచ్‌లో మాత్రం అది సాధ్యం కాలేదు. ఒసాకా దూకుడుకు పగ్గాలు వేస్తూ సినియకోవా తొలి సెట్లో ఒకసారి... రెండో సెట్లో రెండుసార్లు సర్వీస్ బ్రేక్ సాధించింది. మరోవైపు ఒసాకా ఏకంగా 38 అనవసర తప్పిదాలు, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. సినియకోవా సర్వీస్‌లో బ్రేక్ సాధించేందుకు ఏడు సార్లు అవకాశం వచ్చినా ఈ జపాన్ స్టార్ ఒక్కసారీ సద్వినియోగం చేసుకోలేదు. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో డిఫెండింగ్ చాంపియన్ సిమోనా హలెప్ (రొమేనియా), 14వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా), ఇగా స్వియాటెక్ (పోలాండ్) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. హలెప్ 6–2, 6–1తో సురెంకో (ఉక్రెయిన్)పై, కీస్ 6–3, 6–7 (5/7), 6–4తో బ్లిన్కోవా (రష్యా)పై, స్వియాటెక్ 0–6, 6–3, 6–3తో మోనికా పుయిగ్ (ప్యూర్టోరికో)పై గెలిచారు. సీడెడ్ ఆటగాళ్ల జోరు... పురుషుల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ జొకోవిచ్ 6–3, 6–3, 6–2తో కరుసో (ఇటలీ)పై, ఆరో సీడ్ సిట్సిపాస్ 7–5, 6–3, 6–7 (5/7), 7–6 (8/6)తో క్రాజినోవిచ్ (సెర్బియా)పై, నాలుగో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) 6–3, 4–6, 6–2, 7–5తో పాబ్లో క్యువాస్ (ఉరుగ్వే)పై, ఐదో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 6–4, 6–2, 4–6, 1–6, 6–2తో లాజోవిచ్ (సెర్బియా)పై, తొమ్మిదో సీడ్ ఫాగ్నిని 7–6 (7/5), 6–4, 4–6, 6–1తో అగుట్ (స్పెయిన్)పై గెలిచారు. పదో సీడ్ ఖచనోవ్ (రష్యా), మాజీ చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్), ఎనిమిదో సీడ్ డెల్‌పొట్రో (అర్జెంటీనా) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్ చేరారు. పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో లియాండర్ పేస్ (భారత్)–బెనోయిట్ పెయిర్ (ఫ్రాన్స్) జంట 0–6, 6–4, 3–6తో మూడో సీడ్ కబాల్–ఫరా (కొలంబియా) జోడీ చేతిలో ఓడిపోయింది. -
‘క్వీన్’ క్విటోవా...
రెండోసారి వింబుల్డన్ టైటిల్ వశం టైటిల్ పోరులో బౌచర్డ్‌పై గెలుపు కేవలం 55 నిమిషాల్లో ముగిసిన ఫైనల్ రూ. 18 కోట్ల ప్రైజ్‌మనీ సొంతం లండన్: యువజోరుపై అనుభవమే పైచేయి సాధించింది. వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ టైటిల్ మాజీ చాంపియన్ పెట్రా క్విటోవా వశమైంది. శనివారం ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో ఈ చెక్ రిపబ్లిక్ అమ్మాయి 6-3, 6-0తో ‘కెనడా భామ’ యూజిన్ బౌచర్డ్‌పై గెలిచింది. కేవలం 55 నిమిషాల్లోనే ముగిసిన ఈ టైటిల్ పోరులో 24 ఏళ్ల క్విటోవా తన ప్రత్యర్థికి కేవలం మూడు గేమ్‌లే సమర్పించుకోవడం విశేషం. విజేతగా నిలిచిన ఆరో సీడ్ క్విటోవాకు 17 లక్షల 60 వేల పౌండ్లు (రూ. 18 కోట్ల 5 లక్షలు); రన్నరప్, 13వ సీడ్ బౌచర్డ్‌కు 8 లక్షల 80 వేలు (రూ. 9 కోట్ల 2 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 2011లో తొలిసారి వింబుల్డన్ విజేతగా అవతరించిన క్విటోవాకు ఆనాటి అనుభవం ఈసారి ఉపయోగపడింది. మరోవైపు కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడిన 20 ఏళ్ల బౌచర్డ్ ఒత్తిడికిలోనై తడబడి మూల్యం చెల్లించుకుంది. 6 అడుగుల ఎత్తు, 70 కేజీల బరువున్న క్విటోవా శక్తివంతమైన రిటర్న్ షాట్లతో ఏదశలోనూ బౌచర్డ్‌కు పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. ఫైనల్ చేరే క్రమంలో తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోని బౌచర్డ్‌కు అంతిమ సమరంలో ఆరంభం నుంచే ఇబ్బందులు ఎదురయ్యాయి. తన సర్వీస్‌ను నిలబెట్టుకోవడానికి ఆమె తీవ్రంగా శ్రమించింది. క్విటోవా సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేసిన బౌచర్డ్ తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి తొలి సెట్‌ను 32 నిమిషాల్లో చేజార్చుకుంది. రెండో సెట్లో క్విటోవా దూకుడుకు బౌచర్డ్ వద్ద సమాధానమే కరువైంది. క్విటోవా చెలరేగి తన సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతోపాటు మూడుసార్లు బౌచర్డ్ సర్వీస్‌ను బ్రేక్ చేసింది. దాంతో ఈ సెట్లో బౌచర్డ్ ఒక్క గేమూ నెగ్గలేకపోయింది. నాలుగు ఏస్‌లు, మూడు డబుల్ ఫాల్ట్‌లు సంధించిన క్విటోవా... నెట్‌వద్ద 14 సార్లు దూసుకొచ్చి 11 సార్లు పాయింట్లు నెగ్గింది. 28 విన్నర్స్ కొట్టిన క్విటోవా, 12 అనవసర తప్పిదాలు చేసింది. నేటి పురుషుల సింగిల్స్ ఫైనల్ ఫెడరర్ Xజొకోవిచ్ సాయంత్రం గం. 6.00 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం -
ఫెడరర్ శుభారంభం
సెరెనా, రద్వాన్‌స్కా ముందంజ సోమ్‌దేవ్ ఓటమి ఫ్రెంచ్ ఓపెన్ పారిస్: మాజీ నంబర్‌వన్, స్విట్జర్లాండ్ స్టార్ రోజర్ ఫెడరర్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో శుభారంభం చేశాడు. మహిళల డిఫెండింగ్ చాంపియన్, టాప్‌సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా), మూడో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్) కూడా ముందంజ వేశారు. పురుషుల విభాగంలో నాలుగో సీడ్ ఫెడరర్ 6-2, 6-4, 6-2తో లుకాస్ లాకో (స్లోవేకియా)పై విజయం సాధించాడు. ఆదివారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో 32 ఏళ్ల స్విస్ స్టార్ గంటకు 200 కి.మీ. వేగంతో చేసే సర్వీస్‌కు ప్రత్యర్థి నిలువలేకపోయాడు. పదో సీడ్ జాన్ ఇస్నర్ (అమెరికా) 7-6 (7/5), 7-6 (7/4), 7-5తో హెర్బెర్ట్ (ఫ్రాన్స్)పై చెమటోడ్చి నెగ్గగా, ఆరోసీడ్ బెర్డిచ్ 6-3, 6-4, 6-4 పొలన్‌స్కీ (కెనడా)పై గెలిచాడు. 13వ సీడ్ సోంగా (ఫ్రాన్స్) 7-6 (7/4), 7-5, 6-2తో సహచరుడు రోజర్ వాసెలిన్పై నెగ్గాడు. నల్లకలువల జోరు మహిళల సింగిల్స్‌లో సెరెనా విలియమ్స్ 6-2, 6-1తో అలిజ్ లిమ్ (ఫ్రాన్స్)పై విజయం సాధించగా... ఆమె సోదరి వీనస్ విలియమ్స్ 6-4, 6-1తో బెన్సిక్ (స్విట్జర్లాండ్)పై గెలిచింది. మూడో సీడ్ రద్వాన్‌స్కా 6-3, 6-0తో షువాయ్ జంగ్ (చైనా)పై, స్లోవేకియా సుందరి డానియెల హంతుచోవా 2-6, 6-2, 6-4తో జాక్సిక్ (సెర్బియా)పై గెలుపొందారు. మళ్లీ తొలిరౌండ్లోనే... భారత సింగిల్స్ స్టార్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ వరుసగా ఈ సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ ఈవెంట్లోనూ తొలిరౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. అన్‌సీడెడ్ సోమ్‌దేవ్ 7-5, 3-6, 6-7 (4/7), 3-6తో నెదోవ్‌యెసోవ్ (కజకిస్థాన్) చేతిలో ఓడిపోయాడు. ఈ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ అయిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌లోనూ సోమ్‌దేవ్ మొదటి రౌండ్లోనే నిష్ర్కమించాడు.