Grandfather died
-
తాతకు తలకొరివి పెట్టిన మనవరాలు
అనారోగ్యంతో మృతి చెందిన తాతకు తన మనవరాలు తలకొరివి పెట్టిన సంఘటన తొర్రూరు మండలంలోని చింతలపెల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. కొండం చంద్రారెడ్డి (75) ఒక్కగానొక్క కొడుకు యాకూబ్‌రెడ్డి గతంలో మృతి చెందాడు. యాకూబ్‌రెడ్డికి కుమారై శ్రావ్య మాత్రమే ఉంది. దీంతో చంద్రారెడ్డికి మనవరాలు శ్రావ్యతో తలకొరివి పెట్టించారు. అతి చిన్న వయసులోనే తాతకు మనవరాలు తలకొరివి పెట్టడాన్ని చూసిన ప్రజలు కన్నీరుమున్నీరుగా రోదించారు. -
మనవడి ఆత్మహత్య వార్త విని గుండెపోటుతో తాత మృతి
నిజామాబాద్: మనవడు ఆత్మహత్య చేసుకున్నాడరన్న వార్త తెలిసి, తాత గుండెపోటుతో మృతి చెందాడు. గాంధారి మండలం తరువపూర్ గ్రామంలో ఈ విషాద ఘటన జరిగింది. గొడుగు సంజీవ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మనవడి మరణవార్త తెలిసి తట్టుకోలేక తాతయ్య గుండెపోటుతో మృతి చెందాడు. తాతామనవడు ఇద్దరూ ఒకే రోజు మృతి చెందడంతో ఆ కుటుంబం పూర్తిగా విషాదంలో మునిగిపోయింది.