Grandmaster Viswanathan Anand
-
లండన్ క్లాసిక్ టోర్నీ: మళ్లీ ఓడిన ఆనంద్
లండన్: భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ లండన్ చెస్ క్లాసిక్ టోర్నమెంట్లో తన నిరాశజనక ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. మాక్సిమి వాచిర్ లాగ్రెవ్ (ఫ్రాన్స్)తో జరిగిన ఏడో రౌండ్ గేమ్‌లో ఆనంద్ 34 ఎత్తుల్లో ఓడిపోయాడు. పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో ఆనంద్‌కిది మూడో పరాజయం కావడం గమనార్హం. ఏడో రౌండ్ తర్వాత ఆనంద్ 2.5 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. 4.5 పాయింట్లతో మాక్సిమి వాచిర్ లాగ్రెవ్ అగ్రస్థానంలోకి వచ్చాడు. -
ఆనంద్‌కు ఐదో ‘డ్రా’
సెయింట్ లూయిస్: సింక్యూఫీల్డ్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ వరుసగా ఐదో ‘డ్రా’ నమోదు చేసుకున్నాడు. సో వెస్లీ (అమెరికా)తో జరిగిన ఏడో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 39 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. తొలి రెండు రౌండ్లలో ఓడిన ఆనం ద్ ఆ తర్వాత వరుసగా ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకోవడం గమనార్హం. మిగి లిన రెండు రౌండ్లలో అరోనియన్, కార్ల్సన్ లతో ఆనంద్ తలపడతాడు. ప్రస్తు తం ఆనంద్ 2.5 పాయిం ట్లతో 9వ స్థానంలో ఉన్నా డు. మరో గేమ్‌లో ప్రపంచ చాంపియన్ కార్ల్సన్ ఆరున్నర గంటలు పోరాడినా తుదకు 66 ఎత్తుల్లో గ్రిష్చుక్ (రష్యా) చేతిలో ఓడిపోయాడు. -
ఆనంద్ పరాజయం
సెయింట్ లూయిస్ (అమెరికా): సింక్యూఫీల్డ్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌కు తొలి రౌండ్లోనే ఓటమి ఎదురైంది. హికారు నకముర (అమెరికా)తో జరిగిన తొలి రౌండ్ గేమ్‌లో ఆనంద్ 43 ఎత్తుల్లో ఓటమి పాలయ్యాడు. మొత్తం 10 మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో తొలి రౌండ్లో జరిగిన ఐదు గేముల్లో ఫలితాలు రావడం విశేషం. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్-10లో ఉన్న ఎనిమిది మంది క్రీడాకారులు ఈ టోర్నీ బరిలో ఉన్నారు.