సెమీస్ లో దీపికా పళ్లికల్
టొరంటో: గ్రానైట్ ఓపెన్ స్క్వాష్ టోర్నమెంట్లో స్టార్ ప్లేయర్ దీపికా పళ్లికల్ సెమీఫైనల్స్‌లో ప్రవేశించింది. గతేడాది రన్నరప్‌గా నిలిచిన రెండో సీడ్ దీపికా బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో 12-10, 11-2, 11-4తో సల్మా హనీ ఇబ్రహీమ్‌ను చిత్తు చేసింది.