green energy power plant
-
గ్రీన్ ఎనర్జీ కేంద్రంగా.. డేటా సెంటర్ హబ్‌గా ఉమ్మడి విశాఖ
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో కీలక ప్రాజెక్టులకు అడుగులు పడుతున్నాయి. ఐటీ హబ్‌గా పర్యాటక డెస్టినీగా భాసిల్లుతున్న వైజాగ్.. ఇప్పుడు డేటా సెంటర్‌కు ప్రధాన కేంద్రంగానూ, గ్రీన్ ఎనర్జీకి కేరాఫ్‌గా మారనుంది. ఏకంగా 1.10 లక్షల కోట్ల పెట్టుబడితో 61 వేల మందికి ఉపా«ధి కల్పించేలా ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అదేవిధంగా రూ.7,210 కోట్ల పెట్టుబడితో 20 వేల పై చిలుకు ఉద్యోగాలు కల్పించేలా డేటా సెంటర్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఉమ్మడి విశాఖ చరిత్రలో ఒకేసారి రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడులు, 80 వేలకు పైగా ఉపాధి అవకాశాలు కల్పించే ప్రాజెక్టులకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. కీలక ప్రాజెక్టులకు కేంద్రంగా విశాఖపట్నం మారుతోంది. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై దృష్టిసారించిన రాష్ట్ర ప్రభుత్వం.. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో నగరంలో పెట్టుబడులకు, భారీ ప్రాజెక్టులకు ఉన్న అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ ఆ దిశగా చర్యలు చేపడుతోంది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో రెండ్రోజుల క్రితం జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(ఎస్ఐపీబీ) సమావేశంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.1,44,185.07 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగా.. ఇందులో సింహభాగం విశాఖకే చెందినవి కావడం గమనార్హం. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏకంగా రూ.1,17,210 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఈ రెండు ప్రాజెక్టుల రాకతో విశాఖ జిల్లా పారిశ్రామిక రంగంలో సరికొత్త విభాగాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. గ్రీన్ ఎనర్జీ కేరాఫ్ పూడిమడక దేశంలోనే మొట్టమొదటి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు అచ్యుతాపురం మండలంలోని పూడిమడక చిరునామాగా మారనుంది. ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్)లో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ) ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఏకంగా లక్షా 10 వేల కోట్ల రూపాయల వ్యయంతో న్యూ ఎనర్జీ పార్కు నిర్మించనుంది. ఈ పార్కులో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ మిథనాల్, హైడ్రోజన్ సంబంధిత ఉత్పత్తులు తయారవుతాయి. ఇంధన రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా కొత్త తరహాలో ఉత్పత్తి చేసేందుకు ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు ప్రణాళికలు తయారు చేసింది. రెండు దశల్లో పూర్తి చేసే ఈ ప్రాజెక్టు ద్వారా 61 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ రానున్నాయి. ప్రాజెక్టు పేరు : ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ పార్కు పెట్టుబడి : రూ.1,10,000 కోట్లు విస్తీర్ణం : సుమారు 1000 ఎకరాలు ఉపాధి అవకాశాలు : 61 వేల మందికి మొదటి దశ : రూ.55 వేల కోట్లు, 30 వేల మందికి ఉపాధి అవకాశాలు పూర్తి చేసే సమయం : 2027 రెండోదశ : రూ.55 వేల కోట్లు, 31 వేల మందికి ఉపాధి అవకాశాలు పూర్తి చేసే సమయం : 2033 కాపులుప్పాడలో డేటా సెంటర్ మధురవాడ ఐటీ హిల్స్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే అదానీ డేటా సెంటర్‌కు ప్రభుత్వం ఆమోదముద్ర వేసిన విషయం విదితమే. రూ.14,634 కోట్ల పెట్టుబడులతో 200 మెగావాట్ల సామర్థ్యంతో డేటాపార్క్ రాబోతోంది. తాజాగా 100 మెగావాట్ల సామర్థ్యంతో మరో డేటా సెంటర్ దాని సమీపంలోని కాపులుప్పాడ ప్రాంతంలో ఏర్పాటుకు ఎస్ఐపీబీ పచ్చజెండా ఊపింది. వైజాగ్ టెక్‌పార్క్ లిమిటెడ్ సంస్థ ఈ డేటా సెంటర్‌ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రూ.7,210 కోట్ల పెట్టుబడులతో 20,450 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించాలని సంకల్పించారు. మొత్తంగా ఈ రెండు ప్రాజెక్టులూ పూర్తయితే విశాఖ నగరం ఆంధ్రప్రదేశ్‌కు డేటా సెంటర్ హబ్‌గా మారనుంది. ప్రాజెక్టు పేరు : డేటా సెంటర్ ఎవరి ఆధ్వర్యంలో : వైజాగ్ టెక్ పార్క్ లిమిటెడ్ పెట్టుబడి : రూ.7,210 కోట్లు ఉపాధి అవకాశాలు : 20,450 మందికి ప్రత్యక్షంగా : 14,825 మందికి పరోక్షంగా ఉపాధి : 5,625 మందికి ప్రాజెక్టు పూర్తయ్యేది : 2026 మొదటి దశలో.. : 10 మెగావాట్లు రెండో దశలో : 40 మెగావాట్లు మూడో దశలో : 50 మెగావాట్లు -
‘గ్రీన్ ఎనర్జీ’లో రిలయన్స్ జోరు
న్యూఢిల్లీ: దేశీ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) తాజాగా పర్యావరణహిత విద్యుత్ (గ్రీన్ ఎనర్జీ) వ్యాపార విభాగంలో దూకుడు మరింతగా పెంచింది. రెండు కంపెనీలతో జట్టు కట్టింది. జర్మనీకి చెందిన ఫొటోవోల్టెయిక్ సోలార్ వేఫర్ల తయారీ సంస్థ నెక్స్‌వేఫ్ జీఎంబీహెచ్‌లో తమ అనుబంధ సంస్థ రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ (ఆర్ఎన్ఈఎస్ఎల్) వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు ఆర్ఐఎల్ తెలిపింది. ఇందులో భాగంగా 25 మిలియన్ యూరోలు (సుమారు రూ. 218 కోట్లు) ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వెల్లడించింది. అటు, డెన్మార్క్‌కు చెందిన స్టీస్డాల్ సంస్థ నుంచి హైడ్రోలైజర్ల తయారీ టెక్నాలజీకి లైసెన్స్ తీసుకుంటున్నట్లు వివరించింది. ‘ఫొటోవోల్టెయిక్ తయారీలో భారత్‌ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టే దిశగా నెక్స్వేఫ్లో పెట్టుబడులు తోడ్పడగలవు. ఇక స్టీస్‌డాల్‌తో భాగస్వామ్యం.. వచ్చే 1 దశాబ్దకాలంలో 1 కేజీ గ్రీన్ హైడ్రోజన్‌ను 1 డాలర్‌కు అందించాలన్న మా లక్ష్యాన్ని సాకారం చేసుకునేందుకు ఉపయోగపడగలదు‘ అని రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. రిలయన్స్ పెట్టుబడులతో ఉత్పత్తి, టెక్నాలజీల అభివృద్ధికి మరింత ఊతం లభించగలదని నెక్స్‌వేఫ్ ఒక ప్రకటనలో పేర్కొంది. రిలయన్స్ ఇటీవలే వరుసగా రెండు సంస్థల్లో కీలక వాటాలు కొనుగోలు చేసిన నేపథ్యంలో తాజా డీల్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నార్వేకు చెందిన సోలార్ ప్యానెల్ తయారీ సంస్థ ఆర్ఈసీ సోలార్ హోల్డింగ్స్‌ను 771 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన ఆర్ఐఎల్ మరోవైపు షాపూర్జీ పల్లోంజి గ్రూప్‌లో భాగమైన స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్‌లో 40 శాతం వాటాలను దక్కించుకుంది. రిలయన్స్ .. రాబోయే రోజుల్లో నాలుగు గిగా ఫ్యాక్టరీలు నెలకొల్పేందుకు అవసరమైన టెక్నాలజీ, నైపుణ్యాలకు తాజా డీల్స్ అన్నీ గణనీయంగా తోడ్పడనున్నాయి. తగ్గనున్న ఉత్పత్తి వ్యయం.. స్టీస్‌డాల్‌తో భాగస్వామ్యం ద్వారా భారత్‌లో హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్స్ తయారీకి అవసరమైన టెక్నాలజీ రిలయన్స్‌కు అందుబాటులోకి వస్తుంది. ఫ్యుయల్ సెల్స్ తయారీకి కావాల్సిన టెక్నాలజీ కోసం కూడా ఈ ఒప్పందాన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. పర్యావరణహిత హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసేందుకు ఎలక్ట్రోలైజర్లు ఉపయోగపడతాయి. ప్రస్తుత టెక్నాలజీలతో పోలిస్తే స్టీస్డాల్ సాంకేతికతతో ఉత్పత్తి వ్యయాలు భారీగా తగ్గుతాయని రిలయన్స్ పేర్కొంది. ప్రస్తుతం 1 కేజీ గ్రీన్ హైడ్రోజన్ రేటు 5 డాలర్లుగా ఉండగా.. రానున్న దశాబ్దకాలంలో దీన్ని 1 డాలర్ స్థాయికి తగ్గించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. -
కూకటివేళ్లు కదిలినా.. ముఖేష్ అంబానీ కుబేరుడే!
ప్రపంచ కుబేరుల జాబితాలో 4వ స్థానంలో ఉన్న ముఖేష్ అంబానీ తన సంపదను మరింత వృద్ధి చేసుకోనున్నారు. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం..గుజరాత్ రాష్ట్రం జామ్‌నగర్‌లో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ కోసం రానున్న రోజుల్లో సుమారు రూ.60వేల కోట్లు డాలర్ల పెట్టుబడి పెట్టునున్నారు.ఈ పెట్టుబడులతో రూ.6.04 లక్షల కోట్లుగా ఉన్న ముఖేష్ అంబానీ సంపద మరింత పెరగనుంది. మనీ మేకింగ్ మిషన్ ముఖేష్ అంబానీకి గుజరాత్ జామ్ నగర్లో ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రం ఉంది. ఈ కేంద్రం ద్వారా అరేబియా సముద్రంలో ముడి చమురును వెలికి తీసి ఫ్యూయల్, ప్లాస్టిక్, కెమికల్స్‌ను తయారు చేస్తారు. దీని విస్తీర్ణం సుమారు న్యూయార్క్ సిటీలో మాన్ హాటన్ ప్రాంతం సగం వరకు ఉంటుందని అంచనా. తద్వారా పైప్లైన్ల నెట్వర్క్ ఇక్కడ రోజుకు14 లక్షల బారెల్స్ పెట్రోలియంను ప్రాసెస్ చేస్తున్నారు. 2021 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ తన సొంత కార్యకలాపాల కోసం 45 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ను ఉత్పత్తి చేసినట్లు బ్లూమ్ బెర్గ్ లెక్కలు చెబుతున్నాయి. ముఖేష్ ఆస్థి మొత్తంలో 60 శాతం ముడి చమురు ఉత్పత్తుల ద్వారా వచ్చిన సంపదే. కాబట్టే ఆర్ధిక వేత్తలు సైతం జామ్ నగర్ చమురు ఉత్పత్తి కేంద్రం ముఖేష్ అంబానీకి మనీ మేకింగ్ మిషన్ లాంటిదని అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. 10శాతం తగ్గుతుందేమో! ప్రపంచం మొత్తం పెట్రో కెమికల్స్ వ్యాపారాన్ని విస్తరించేందుకు ముఖేష్ అంబానీ భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో పాటు గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడులు పెట్టినా 2026 ఆర్థిక సంవత్సరం నాటికి వడ్డీ, పన్నులు, తరుగుదల, తీసుకున్న రుణాల్ని తీర్చినా రిలయన్స్ ఆదాయంలో 10% మాత్రమే ఖర్చవుతుందని, ఆయిల్-టు-కెమికల్స్ ప్రాసెస్ తో వచ్చే ఆదాయం 33 శాతం ఉంటుందని శాన్ఫోర్డ్ ఎనలిస్ట్ సి. బెర్న్‌స్టెయిన్ అంచనా వేశారు. గ్లోబల్ వార్మింగ్ దెబ్బ బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ రమణ మాట్లాడుతూ..జామ్ నగర్ చమురు శుద్ధి కేంద్రాల వల్ల పర్యావరణానికి ప్రమాదమని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పెట్టుబడుల కోసం చేపట్టే ఉత్పత్తుల వల్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని సంకేతాలు వెలువడుతున్నా ముఖేష్ అంబానీ పట్టించుకోవడం లేదని అన్నారు. అలా చేస్తే రిలయన్స్ కూకటి వేళ్లు కదిలే ప్రమాదం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే గ్రీన్ ఎనర్జీపై పెట్టుబడులు?! ఈ ఏడాది జూన్‌లో జరిగిన రిలయన్స్ వార్షిక సమావేశంలో ముఖేష్ అంబానీ మాట్లాడుతూ మొబైల్ నెట్‌వర్క్‌లో జియో ఎలాంటి సంచలనాలు సృష్టించిందో, ఏ స్థాయిలో మార్పులు తీసుకువచ్చిందో..రాబోయే రోజుల్లో అదే తరహా పరిస్థితులు గ్రీన్ ఎనర్జీ రంగంలో తెచ్చేందుకు కృషి చేస్తుందన్నారు. అంతేకాదు మూడు శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధికి ఊతం ఇచ్చిన శిలాజ ఇంధనాల యుగం ఎక్కువ కాలం కొనసాగదంటూనే.. గ్రీన్ ఎనర్జీపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కాబట్టే ఈ గ్రీన్ ఎనర్జీపై పెట్టుబడులు పెట్టేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ చమురు ఉత్పత్తులు తగ్గి రిలయన్స్ కూకటివేళ్లు కదిలే పరిస్థితి ఎదురైనా.. ముఖేష్ అంబానీ కుబేరుడి స్థానానికి వచ్చిన ఢోకా ఏం లేదని జోస్యం చెబుతున్నారు. చదవండి : పసిడి మరింత పైపైకి.. రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం!! -
పెన్నానదిలో కార్మికుడి గల్లంతు
చెన్నూరు, న్యూస్‌లైన్: చెన్నూరు సమీపంలోని గ్రీన్కో ఎనర్జీ పవర్‌ప్లాంట్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్లాంట్‌కు సంబంధించిన కార్మికుడు ఒకరు విధి నిర్వహణలో పెన్నానదిలో గల్లంతు కావడంపై బంధువులు, స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్లాంట్ జీఎం, షిఫ్ట్ ఇంజినీర్ సహా సెక్యూరిటీ సిబ్బందిపైనా వారు దాడి చేశారు. అంతటితో వారి ఆగ్రహం చల్లారలేదు. జీఎం కారుతో పాటు ప్లాంట్‌కు సంబంధించిన ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎందుకంటే... చెన్నూరు మండలం దౌలతాపురానికి చెందిన మహేశ్వరరెడ్డి పైన పేర్కొన్న ప్లాంట్‌లో టర్బైన్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. ప్లాంట్‌కు చెందిన రెండు నీటి మోటార ్లకు సంబంధించిన విద్యుత్ తీగలు తెగి రెండు నెలలుగా పని చేయడం లేదు. దీంతో ఆదివారం సాయంత్రం ప్లాంట్ జీఎం హనుమంతరావు ఆదేశం మేరకు మహేశ్వరరెడ్డి సహా సుబ్బారెడ్డి, గంగాప్రసాద్, సుబ్బారెడ్డి అనే నలుగురిని షిఫ్ట్ ఇంజినీర్ సుబ్రమణ్యం వారిని నదిలోకి దింపారు. నది మధ్యలోకి వెళ్లగానే మహేశ్వరరెడ్డి జారి లోపలికి పడిపోయారు. దీంతో భయాందోళనకు గురైన మిగిలిన ముగ్గురూ వెనుదిరిగి వచ్చారు. వంతెన బీమ్ పట్టుకుని కొద్దిసేపు ఆగిన మహేశ్వరరెడ్డి చాలా సేపు పట్టుకోలేక నీటి వేగానికి కొట్టుకెళ్లిపోయారు. ఆ తరువాత అతను గల్లంతయ్యాడు. జీఎం, షిఫ్ట్ ఇంజినీర్, సెక్యురిటీపై దాడి విషయం తెలుసుకొన్న మహేశ్వర్‌రెడ్డి కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు, స్థానికులు పెద్ద ఎత్తున పెన్నానది వద్దకు చేరుకున్నారు. ‘మీ నిర్లక్ష్యం వల్లే మా బిడ్డ నీటిలో మునిగిపోయాడంటూ’ వారు రోదించారు. నదిలో గల్లంతైన విషయం తెలిసినా తమకు ఎందుకు సమాచారం అందించలేదని మండిపడ్డారు. ఒక మనిషి నీటిలో మునిగిపోతే కనీసం గాలింపు చర్యలైనా చేపట్టరా అంటూ నిలదీశారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా నదిలోకి ఎలా దింపారంటూ దాడికి దిగారు. ఇందుకు బాధ్యుడైన జీఎం కారును ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన సెక్యూరిటీ గార్డు వేణుగోపాల్‌రెడ్డిపైనా దాడి చేశారు. ఫర్నీచర్‌ను పడేసి పనికి రాకుండా చేసేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సమాచారం అందిన వెంటనే ఎస్ఐ రాజగోపాల్ తమ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. జరిగిన సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. రెండు వర్గాల వారితోనూ చర్చించి పరిస్థితిని చక్కదిద్దారు.