green lands
-
పంజగుట్టలో దారి దోపిడీ.. 3.5 లక్షలున్న బ్యాగ్‌తో పరార్.. పోలీసులు వెంబడించడంతో..
సాక్షి, హైదరాబాద్: నగరం నడిబొడ్డన దారి దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. పంజగుట్టలో ఓ వ్యక్తి గోల్డ్ షాప్ క్లోజ్ చేసి డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్తుండగా.. దృష్టి మళ్లించిన దొంగలు దారి దోపిడికి తెగబడ్డారు. గ్రీన్ ల్యాండ్స్ దారిలో బైక్‌పై వచ్చిన దొంగలు బంగారం షాపు యాజమాని నుంచి రూ. 3.5 లక్షలున్న రెండు బ్యాగ్‌లతో పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు దొంగలను వెంబడించడంతో రూ. 1.5 లక్షలు నగదు ఉన్న బ్యాగ్‌ను రోడ్డు మీదే వదిలేసి 2 లక్షల బ్యాగ్‌తో పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ద్వారా విచారణ జరుపుతున్నారు. నిందితులు ఎవరు, తెలిసినవాళ్ల పనేనా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. చదవండి: హైదరాబాద్: 60 శాతం బస్సులు మేడారానికే.. ప్రత్యామ్నాయమేదీ? -
గ్రీన్లాండ్స్ విజయం
సాక్షి, హైదరాబాద్: బ్యాట్స్‌మన్ సుధీంద్ర (95 నాటౌట్)తో పాటు బౌలర్ నిఖిల్ (7/36) రాణించడంతో గ్రీన్లాండ్స్ జట్టు విజయం సాధించింది. ఎ- డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా ఇంపీరియల్ సీసీతో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంపీరియల్ సీసీ జట్టు 30.3 ఓవర్లలో 120 పరుగులు చేసింది. అనంతరం గ్రీన్లాండ్స జట్టు 14.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 121 పరుగులు చేసి గెలిచింది. సుధీంద్ర దూకుడుగా ఆడి ఆకట్టుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల వివరాలు హైదరాబాద్ పేట్రియాట్స్: 267 (శైలేష్ 49; అరుణ్ 3/62), మయూర్: 69/9 (మహేశ్ 5/21). హెచ్‌సీఏ అకాడమీ: 406 (శ్రీనివాస్ 151; శశికుమార్ 5/121), సెయింట్ ప్యాట్రిక్స్: 181 (సాహిల్ 42; శివకోఠి 5/40). రాయల్ సీసీ: 207 (రవి శంకర్ 40; అమృత్ 3/18), సెయింట్ సాయి: 107 (హూస్టన్ 41; రాఘవ 4/28). తిరుమల: 209 (శ్రీకాంత్ 42, నవీన్ 76; బషీరుద్దీన్ 4/32, షరీఫ్ 3/14), బాయ్స్ టౌన్: 201 (బషీరుద్దీన్ 75; ధనంజయ్ 5/36). యంగ్ సిటిజన్: 154 (అస్లమ్ 71; అభిజిత్ 5/38, హిమాన్షు 5/6); నోబెల్: 157/8 (అనిరుధ్ 59, షంశుద్దీన్ 54; సాయి సృతీశ్ 7/21). -
రేస్ ఇలా...
బర్డ్‌వాచర్స్ అంతా ఒకచోటికి చేరి నలుగురేసి చొప్పున బృందాలుగా విడిపోతారు. హైదరాబాద్ చుట్టూ 60 కిలోమీటర్ల పరిధిలో పక్షి జాతులను చూసేందుకు కారులో వెళతారు. లాగ్ బుక్‌లో ఎవరెవరు ఎక్కడెక్కడ ఏఏ పక్షులు చూశారో రాయాలి. చీకటి పడే సమయానికి స్టార్టింగ్ పాయింట్లో అంతా కలుస్తారు. అనుభవాలు షేరు చేసుకుంటారు. ఎక్కువ పక్షులు లెక్కించినవారిని సన్మానిస్తారు. ప్రస్తుతం నగరంలో 300 మంది బర్డ్ వాచర్స్ ఉన్నారు. ఒకవేళ కారు లేకున్నా నో ప్రాబ్లమ్. ఏదో కారులో చోటు కల్పిస్తారు. ఎవరైనా పాల్గొనవచ్చు. ఎంట్రీ ఉచితం. ఆదివారం ఉదయం ఏడు గంటలకు రేస్ మొదలవుతుంది. స్టార్టింగ్ పాయింట్: బేగంపేట గ్రీన్‌ల్యాండ్స్ ఎదురుగా ఉన్న హోటల్ ది ప్లాజా వద్దకు చేరుకోవాలి. రేస్ ముగిసిన తరువాత మళ్లీ అంతా ఇక్కడే మీట్ అవ్వాలి. వివరాలకు ఫోన్: షఫత్: 849229552 సురేఖ: 9949038532 -
పచ్చధనమని..?
హుజూర్నగర్, న్యూస్‌లైన్: గ్రీన్‌ల్యాండ్ పై అక్రమార్కుల కన్నుపడింది. దాదాపు 30 ఏళ్ల నుంచి వివిధ వెంచర్ల ద్వారా పంచాయతీకి చెందాల్సిన భూములు ఇప్పుడు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. హుజూర్నగర్ గ్రామపంచాయతీగా ఉన్నప్పుడు వివిధ లే అవుట్ల ద్వారా సంక్రమించిన స్థలాలు కనిపించకుండా పోయాయి. 1982 నుంచి 2011 వరకు పట్టణంలో 137, 187, 188, 190, 191, 203, 204, 205, 206, 207, 208, 211, 212, 285, 292, 300, 302, 478 తదితర సర్వే నంబర్లలో 46 వెంచర్ల ద్వారా లేఅవుట్ రూపంలో గ్రామ పంచాయతీకి సుమారు 60వేల చదరపు గజాల స్థలాలను కేటాయించారు. కాగా ఆయా స్థలాలు నిబంధనల ప్రకారం సంబంధిత పంచాయతీ ఈఓల పేరుమీద అగ్రిమెంట్ చేయాల్సి ఉంది. కానీ, ఈ స్థలాలను కొందరు ప్రజాప్రతినిధులు, మధ్యవర్తుల ద్వారా గ్రామ పంచాయతీ అధికారి పేరు మీద అగ్రిమెంట్ చేయకుండా సంబంధిత స్థల యజమాని పేరు మీదనే ఉంచారు. దీంతో ఈ స్థలాలు విక్రయించుకునేందుకు ఆయా స్థలాల యజమానులకు వెసులుబాటు కలిగింది. ఈ విషయంలో పట్టణానికి చెందిన ప్రజాప్రతినిధులు కొందరు మధ్యవర్తులుగా గ్రామ పంచాయతీ ఈఓ, ప్లాట్ యజమానుల మధ్య అవగాహన కుదిర్చి స్థలాలను విక్రయించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని ప్లాట్లను ఆయా ప్లాట్ల వెంట ఉన్న వారు పంచాయతీ అధికారులతో అవగాహన కుదుర్చుకుని కబ్జాలు చేశారు. కబ్జాకు గురైన స్థలాలివిగో... 204 సర్వే నంబర్లో గ్రామ పంచాయతీకి లేఅవుట్ కింద 450 చదరపు గజాలను కేటాయించారు. ఈ స్థలాన్ని గ్రామ పంచాయతీకి అగ్రిమెంట్ చేయకుండా అప్పటి ఈఓ పాలకవర్గంలోని కొందరు ప్రజాప్రతినిధులతో కలిసి సదరు యజమాని పేరు మీదనే ఉంచారు. దీంతో ఆ యజమాని గత ఏడాది ఈ ప్లాట్‌ను అమ్ముకున్నాడు. అదేవిధంగా 208 సర్వే నంబర్లోని ప్లాట్ నెం.45లో 203 చదరపు గజాలను కూడా గత ఏడాదే అమ్మారు. సర్వే నెం.298/అ, 298/ఆ, 298/ఉ, 298/ఇ, 298/ఊ, 298/అ1లలో గ్రామ పంచాయితీ లే అవుట్ కింద130, 131, 132, 133, 134, 143, 144, 129, 145 నంబర్ ప్లాట్లను మొత్తం 2268 చదరపు గజాలను కేటాయించారు. ఈ స్థలాలు గ్రామ పంచాయతీకి అగ్రిమెంట్ చేయకుండా ప్రస్తుతం బీనామీ పేర్లతో ఉంచారు. వీటిని ఏ క్షణంలో నైనా విక్రయించేందుకు సదరు బినామీలు సమయం కోసం వేచిచూస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో గ్రామ పంచాయతీ కాస్త నగర పంచాయతీగా మారడంతో ప్లాట్ల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో కొందరు మధ్యవర్తులు అదేపనిగా విక్రయాలు, కబ్జాలు చేయిస్తూ చక్రం తిప్పుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అయితే 1982 నుంచి 2011 వరకు గ్రామ పంచాయితీకి కేటాయించిన లే అవుట్ భూముల అన్యాక్రాంతంపై గత ఏడాది అఖిలపక్ష నాయకులు విచారణ జరపాలని కోరుతూ నగర పంచాయతీ కమిషనర్‌కు, ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందజేసి ఆందోళన కూడా చేశారు. అయినా వాటిపై ఉన్నతాధికారులు ఎలాంటి విచారణ జరపలేదు. ఇప్పటికైనా వాటిపై విచారణ చేపట్టకుంటే ఆందోళన చేపట్టేందుకు అఖిలపక్షం నాయకులు సిద్ధమవుతున్నారు. రికార్డులు తనిఖీ చేస్తున్నాం : నగర పంచాయతీ కమిషనర్ పంచాయతీ లే అవుట్ స్థలాల కబ్జా విషయంపై రికార్డులు తనిఖీ చేస్తున్నామని హుజూర్నగర్ నగర పంచాయతీ కమిషనర్ కోట రాంరెడ్డి తెలిపారు. హుజూర్నగర్ పంచాయతీగా ఉన్నకాలంలో అన్యాక్రాంతమైన ప్లాట్లను గుర్తిస్తున్నామన్నారు. త్వరలోనే వాటిని గుర్తించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు.