groom dance
-
బుల్లెట్టు బండి’ పాటకు వధువు సూపర్ డ్యాన్స్..
-
పెళ్లి కొడుకు హుషారు చూసి పెళ్లి కూతురు షాక్.. వామ్మో!
ఈ మధ్యకాలంలో చాలా మంది పెళ్లి వేడుకను వినూత్నంగా జరుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా పెళ్లిలో ఫన్నీ, నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్నిసార్లు వరుడు చేసే వింత పనులకు విసుగెత్తిన నవ వధువు వెంటనే కటీఫ్ చెబుతున్న ఘటనలు జరుగుతున్నాయి. అయితే తాజాగా పెళ్లి మధ్యలో ఓ వరుడు లేచి డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పెళ్లి మండపంలో వరుడు, వధువు కూర్చుని ఉండగా.. పక్కనే పురోహితుడు పెళ్లి కార్యక్రమాలను నడిపిస్తున్నాడు. అయితే పెళ్లి కొడుకు అకస్మాత్తుగా లేచి.. బాడీ మొత్తం షేక్ చేస్తూ డ్యాన్స్ చేస్తాడు. పట్టరాని ఆనందంలో సంతోషాన్ని వ్యక్త చేస్తాడు. దీంతో పెళ్లి కూతురితో పాటు చుట్టూ ఉన్న బంధువులు ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోను చూసి నెటిజన్లు ఎంజాయ్ చేస్తున్నారు. (చదవండి: వైరల్: నీటి కోసం వెళ్లి మొసలికి బలైన చిరుత!) -
పెళ్లి కొడుకా మజాకా.. కళ్లు చెదిరే స్టెప్పులు
-
పెళ్లి కొడుకా మజాకా.. కళ్లు చెదిరే స్టెప్పులు
ఆన్లైన్లో ఓ సరదా వీడియో హల్ చల్ చేస్తోంది. రెండు రోజుల్లోనే దాదాపు 30 లక్షల మంది దీనిని వీక్షించగా.. దాదాపు 50వేల మంది షేర్ చేసుకున్నారు. అయితే, ఇదేదే కామెడీ వీడియో కాదు.. ఓ వివాహ వేడుక సందర్భంలో చోటుచేసుకున్న వీడియో. పూర్తి ఉల్లాసభరితంగా సాగిన ఈ వీడియోలో ప్రధాన ఆకర్షణ పెళ్లి కొడుకే. తన పెళ్లి కోసం ముందే డ్యాన్స్ నేర్చుకొని వచ్చాడా లేక పెళ్లయిన ఆనందంలో అంతలా స్టెప్పులు వేశాడా అనిపించడం ఖాయం చూసేవారందరికి. పెళ్లికి వచ్చిన తన మిత్రులతో కలిసి దుమ్ములేచిపోయేలా అతడు కాలుకదుపుతు గంతులేస్తుంటే పెళ్లి కూతురు ఎంతో ముచ్చటపడింది. తన మెడలో తాళి కట్టిన భర్త అంతమందిలో అబ్బురపరిచేలా లోకాన్ని మైమరిచి డ్యాన్స్‌లు వేస్తుంటే వావ్.. అనుకుంటే తేలిపోయింది. పెళ్లి కొడుకే కాదు.. అతడి స్నేహితులందరు కలిసి వివాహ వేదికపై చేసిన ఈ డ్యాన్స్ ఇప్పుడు ఫేస్బుక్లో పోస్ట్ చేయగా అది వైరల్ అయింది. ‘మీ ఉత్తమ స్నేహితులు మీ పెళ్లి రోజు ఈ విధంగా డ్యాన్స్‌లు వేయకుంటే వాళ్లు నిజంగా మే ఉత్తమ స్నేహితులు కాదు’ అంటూ ఆ ఫేస్బుక్ పోస్ట్ వీడియోకు ట్యాగ్‌లైన్‌గా పెట్టారు. మొత్తానికి ఈ వీడియో ఇప్పుడు అందరినీ అమితంగా ఆకర్షిస్తోంది.