పెళ్లి కొడుకా మజాకా.. కళ్లు చెదిరే స్టెప్పులు | Groom Dances With Friends As Bride Looks On | Sakshi
Sakshi News home page

పెళ్లి కొడుకా మజాకా.. కళ్లు చెదిరే స్టెప్పులు

Published Tue, Feb 28 2017 3:06 PM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

Groom Dances With Friends As Bride Looks On


ఆన్‌లైన్‌లో ఓ సరదా వీడియో హల్‌ చల్‌ చేస్తోంది. రెండు రోజుల్లోనే దాదాపు 30 లక్షల మంది దీనిని వీక్షించగా.. దాదాపు 50వేల మంది షేర్‌ చేసుకున్నారు. అయితే, ఇదేదే కామెడీ వీడియో కాదు.. ఓ వివాహ వేడుక సందర్భంలో చోటుచేసుకున్న వీడియో. పూర్తి ఉల్లాసభరితంగా సాగిన ఈ వీడియోలో ప్రధాన ఆకర్షణ పెళ్లి కొడుకే. తన పెళ్లి కోసం ముందే డ్యాన్స్‌ నేర్చుకొని వచ్చాడా లేక పెళ్లయిన ఆనందంలో అంతలా స్టెప్పులు వేశాడా అనిపించడం ఖాయం చూసేవారందరికి.

పెళ్లికి వచ్చిన తన మిత్రులతో కలిసి దుమ్ములేచిపోయేలా అతడు కాలుకదుపుతు గంతులేస్తుంటే పెళ్లి కూతురు ఎంతో ముచ్చటపడింది. తన మెడలో తాళి కట్టిన భర్త అంతమందిలో అబ్బురపరిచేలా లోకాన్ని మైమరిచి డ్యాన్స్‌లు వేస్తుంటే వావ్‌.. అనుకుంటే తేలిపోయింది. పెళ్లి కొడుకే కాదు.. అతడి స్నేహితులందరు కలిసి వివాహ వేదికపై చేసిన ఈ డ్యాన్స్‌ ఇప్పుడు ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయగా అది వైరల్‌ అయింది. ‘మీ ఉత్తమ స్నేహితులు మీ పెళ్లి రోజు ఈ విధంగా డ్యాన్స్‌లు వేయకుంటే వాళ్లు నిజంగా మే ఉత్తమ స్నేహితులు కాదు’ అంటూ ఆ ఫేస్‌బుక్‌ పోస్ట్‌ వీడియోకు ట్యాగ్‌లైన్‌గా పెట్టారు. మొత్తానికి ఈ వీడియో ఇప్పుడు అందరినీ అమితంగా ఆకర్షిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement