
టెలివిజన్ నటి సోనారికా భదోరియా వ్యాపారవేత్త వికాస్ పరాశర్‌ను పెళ్లాడింది. నిన్న ( ఫిబ్రవరి 18న) రాజస్థాన్ రణతంబోర్‌లోని సవాయ్ మాధోపూర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఎట్టకేలకు తమ అభిమాన నటి వివాహ బంధంలోకి అడుగు పెట్టడంతో ఫ్యాన్స్ ఈ లవ్‌బర్డ్స్‌కు విషెస్ అందిస్తున్నారు.
గోవాలో రోకా వేడుక అనంతరం వివాహం ఘనంగా జరిగింది. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌లో హల్దీ, మెహిందీ, తదితర ప్రీ వెడ్డింగ్ వేడుకలు, సోనారికా భావోద్వేగానికి గురైన దృశ్యాలతో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సోనారికా భదోరియా 'దేవో కే దేవ్ మహదేవ్’ సీరియల్‌లో పార్వతీ దేవి పాత్రతో టీవీ పార్వతిగా పాపులర్ అయింది. ప్రియుడు వికాస్‌తో ఎనిమిదేళ్లుగా డేటింగ్‌లో ఉన్న సోనారిక 2022 మే నెలలో మాల్దీవుల్లో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment