groom suicide
-
పెళ్లై 40 రోజులు.. ఏమైందో ఏమో.. బయటకు వెళ్తున్నానని చెప్పి!
సాక్షి, చెన్నై: పెళ్లైన కొద్ది రోజులకే నవ వరుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం రేపింది. పుదుకోట్టై జిల్లా అరంతాంగి తాలూకా పెరుమాల్పట్టికి చెందిన సురేష్‌కు (30). ఆవుడయార్ కోయిల్ సమీపం పెరియవీర మంగళంలకు చెందిన ఉష (22)తో గత 40 రోజుల క్రితం వివాహమైంది. ఆషాడం నెలను పురస్కరించుకుని ఉషను ఆమె తల్లిదండ్రులు వారి ఇంటికి తీసుకుని వెళ్లారు. ఈ క్రమంలో ఈజెల 17వ తేదీ భార్యను చూడడానికి సురేష్ అత్తగారి ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో ఉష అన్న ఉలగనాథన్ విదేశాలకు వెళ్లడానికి సిద్ధం కావడంతో అతనికి కావలసిన వస్తువులు తీసుకురావడానికి ఉష, సురేష్, ఉష తల్లి అరంతాంగికి వెళ్లిసాయంత్రం నాలుగు గంటలకు ఇంటికి తిరిగి వచ్చారు. తరువాత తాను అరంతాంగికి వెళుతున్నానని భార్యకు చెప్పి సురేష్ బయటకు వెళ్లాడు. తరువాత రాత్రి 8 గంటలకు ఉష భర్తకు ఫోన్‌చేయగా తాను ఉదయం ఇంటికి వస్తానని చెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఉష ఇంటికి కొద్ది దూరంలో ఉన్న చింతచెట్టుకు సురేష్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న ఆవుడయార్ కోవిల్ పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో సరేష్ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ బంధువులు అరంతాంగి ప్రభుత్వాస్పత్రిని ముట్టడించారు. అధికారులు వారితో సమాధానం మాటలు మాట్లాడి ఆందోళన విరమింప చేశారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తూ వున్నారు. -
ఇష్టం లేని పెళ్లి చేశారని నవ వరుడు..
అనంతపురం,కణేకల్లు: ఇష్టం లేని అమ్మాయితో పెళ్లి చేయడంతో మనోవేధనకు గురైన నవ వరుడు గొల్ల మంజునాథ (28) పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్న ఘటన కణేకల్లులో చోటు చేసుకొంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు ... కణేకల్లులోని ముల్లావీధిలో నివాసముంటున్న గొల్ల మంజునాథ (28) టైలరింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తల్లిదండ్రులు గత నెల 10వ తేదిన తాడిపత్రి మండలం గంగదేవరపల్లి గ్రామానికి చెందిన యువతితో వివాహం చేశారు. పెళ్లి నిశ్చయం నుండి ఈమెతో పెళ్లి వద్దని పలుమార్లు కుటుంబ సభ్యులతో మొరపెట్టుకొన్నాడు. అయినప్పటికీ అతని మాటను ఎవరూ లెక్క చేయకుండా నవంబర్ 10న పెళ్లి చేశారు. దీంతో తీవ్ర మనోవేధనకు గురైన మంజునాథ మంగళవారం ఉదయం కణేకల్లు శివారులోని హెచ్చెల్సీ అక్విడెక్ట్ వద్ద పురగుల మందు సేవించి ఆత్మహత్యకు యత్నించాడు. అపస్మారకస్థితిలో పడి ఉన్న అతన్ని గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లై ఇరవైరోజులు కూడా గడవకముందే..
సాక్షి, పెద్దమండ్యం(చిత్తూరు) : పచ్చని పందిళ్లు.. మామిడి తోరణాలు వాడలేదు.. రంగవల్లులు చెరగలేదు.. ఆ నవ వరుడు కాళ్ల పా రాణి ఆరలేదు.. ఆ ఇంట ఇంకా వివాహ వైభవం తాలూకు స్మృతులు చెరగలేదు.. ఏమైందో ఏమో ఆ వరుడికి పెళ్లైన 20 రోజులకే నూరేళ్లు నిండాయి. దీంతో ఆ రెండు కుటుం బాల్లో విషాదం కమ్ముకుంది. పురుగుల మందు తాగి నవవరుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని వెలిగల్లు పంచాయతీ చల్లవారికుంటలో గురువారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. చల్లావారికుంట గ్రామానికి చెందిన నీళ్ల అమరనారాయణ కుమారుడు మహేష్ (26)కు, వైఎస్సార్ కడప జిల్లా చిన్నమండ్యం మండలం దిగువగొట్టివీడుకు చెందిన జంగం శ్రీనివాసులు కుమార్తె మీనాక్షితో గతనెల 16న వివాహమైంది. దిగువగొట్టివీడులోనే వీరిద్దరి వివాహాన్ని మీనాక్షి కుటుంబ సభ్యులు జరిపించారు. మహేష్ మదనపల్లెలో టైలరింగ్ పని చేస్తూ జీవనం సాగించేవాడు. వివాహం కాగానే వెలిగల్లులో తల్లిదండ్రులు అద్దెకు ఉంటు న్న ఇంటికి భార్యతో కలిసి వచ్చారు. అయితే ఆషాడమాసం కావడంతో తిరిగి అత్తగారింటికి భార్యతో కలిసి వెళ్లాడు. అక్కడ నుంచి మదనపల్లెకు వెళ్లి, గురువారం తిరిగి వెలిగల్లుకు వచ్చిన మహేష్ చల్లావానికుంట వద్ద ఉన్న తమ పొలం దగ్గరికి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటనా స్థలాన్ని ఏఎస్ఐ హేమసుందరం పరిశీళించారు. మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
నవ వరుడు ఆత్మహత్య
చెన్నై ,తిరువొత్తియూరు: వివాహమైన మూడు నెలలకే నవ వరుడు కుటుంబ కలహాలతో గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. పల్లావరం క్రోంపేట రంగానగర్‌కు చెందిన ప్రకాష్(24) ఇనుప వస్తువుల తయారీ పట్ర నడుపుతున్నాడు. రమ్య అనే యువతిని ప్రేమించి మూడు నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. గురువారం రమ్య సమీపంలో ఉన్న తన తల్లిదండ్రుల ఇంట్లో జరుగుతున్న ఓ కార్యక్రమానికి వెళ్ళింది. భార్య లేకపోవడంతో గురువారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు ప్రకాష్. ఇది చూసిన అతని తల్లిదండ్రులు గట్టిగా మందలించారు. దీంతో విరక్తి చెందిన ప్రకాష్ ఇంట్లోని గదిలోకి వెళ్లి ప్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న శంకర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
నవ వరుడు ఆత్మహత్య
చెన్నై , టీ.నగర్: వివాహమైన నాలుగు రోజుల్లోనే నవ వరుడు ఆదివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చెన్నై అశోక్‌నగర్‌లో ఈ సంఘటన సంచలనం కలిగించింది. విల్లుపురానికి చెందిన సంతోష్‌కుమార్ (26) ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. ఇతను తిరుక్కోవిలూరుకు చెందిన మీనా (24) ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం సంతోష్‌కుమార్ తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో వారు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇలాఉండగా విల్లుపురం మహిళా పోలీసు స్టేషన్లో మీనా సంతోష్‌కుమార్ తనను ప్రేమించి మోసగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఫిర్యాదు చేసింది. దీంతో సంతోష్‌కుమార్, మీనాను నాలుగు రోజుల క్రితం వివాహం చేసుకున్నాడు. చెన్నై అశోక్‌నగర్‌లోని ఒక ప్రైవేటు పాఠశాలలో మీనా ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. దీంతో వారు వెస్ట్ మాంబళంలోని పరోటా వీధిలో కాపురం పెట్టారు. ఇలావుండగా ఆదివారం విల్లుపురంలోని ఓ ఆలయానికి మీనా వెళ్లింది. అక్కడ స్వామి దర్శనం చేసుకుని భర్తకు ఫోన్ చేసింది. అతను చాలా సేపు లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానించిన మీనా ఇంటి సమీపంలోని వారిని ఇంటికి వెళ్లి చూడాలని కోరింది. వారు అక్కడికి వెళ్లి కిటికీలో చూడగా అతను ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. దీనిగురించి అశోక్‌నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం రాయపేట ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
వారం రోజుల్లో పెళ్లి వరుడు ఆత్మహత్య
-
నా జీవితం నాశనం చేశారు
విజయనగరం టౌన్: ‘మా నాన్నకు నేనొక్కతినే కుమార్తెను. రంజాన్ నుంచి నన్ను చూస్తున్నారు. మా ఇంటికి మూడు నెలలుగా నా భర్త వస్తుండేవారు. ఇప్పుడు ఆయన మరణించాక... పెళ్లి కుమార్తె మారిపోయిందంటూ నాపై అభాండాలు వేస్తున్నారు. అసలు నా భర్త ఆత్మహత్య చేసుకునేంత పిరికివారు కాదు.. ఇదంతా నా అత్తింటివారి కుట్ర’ అని విజయనగరానికి చెందిన నవ వధువు మహ్మద్ ముబీనా తెలిపారు. వధువు మార్చేశారన్న మనస్తాపంతో పెళ్లయిన మూడు రోజులకే ఫ్యాన్‌కు ఉరివేసుకుని వీఆర్ఓ షేక్ మదీన్ మంగళవారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ మేరకు బుధవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా ముబీనా తన తండ్రి ముగ్గుల్ జానీతో కలసి మీడియాతో మాట్లాడారు. రంజాన్ నెలలో తనను చూసేందుకు మదీన్ వచ్చారని, నాటి నుంచి పలుమార్లు రావడం, వెళ్లడం చేసేవారని చెప్పారు. కానీ పెళ్లయిన నాటి నుంచి అత్త, ఆడపడుచులు వేధింపులు మొదలుపెట్టారని తెలిపారు. తన భర్త మదీన్ చాలా మంచి వారనీ, అన్యాయంగా వేధించి, ఆయన్ను చంపేశారని ఆరోపించారు. లక్షల రూపాయలు ఖర్చుపెట్టి తన తల్లిదండ్రులు పెళ్లిచేశారని, వచ్చినప్పటి నుంచి కనీసం ఒక్కరోజు కూడా తనను ప్రశాంతంగా ఉండనివ్వలేదని, గదిలో నిర్బంధించారనీ ఆరోపించారు. ఇప్పుడు పెళ్లి సమయంలో పిల్లను మార్చేశారంటూ కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. కొన్ని నెలలుగా మా ఇంటికి వచ్చిన మదీన్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు తాను తెలుసనీ, తన ఆధార్, రేషన్‌కార్డు ఏదైనా అన్నీ చూడాలనీ, విచారణ చేయాలని కోరారు. ఎప్పుడూ బ్యూటీక్లినిక్‌కు వెళ్లని తనను ముఖంపై చిన్న మచ్చలున్నాయంటూ అత్త, ఆడపడుచులు తీసుకెళ్లారనీ, పొడవాటి జుత్తును కత్తిరించేశారనీ, ఏవో క్రీమ్స్ రాయడంతో ముఖంపై మచ్చలు ఎక్కువయ్యాయని, అయితే వైద్యులు ఆ మచ్చలు తగ్గిపోతాయని చెప్పారన్నారు. తన భర్త ఆస్పత్రికి తీసుకెళ్తున్నప్పుడే తనతో మాట్లాడుతూ ‘మా అమ్మా, చెల్లి ఏమన్నా పట్టించుకోవద్దు... నేనున్నాన’ని నచ్చచెప్పారన్నారు. పదిగంటలకు చౌట్రీకి వెళ్తానని చెప్పి వెళ్లిన వ్యక్తి మరి తిరిగిరాలేదని కన్నీటిపర్యంతమయ్యారు. తనను రూమ్‌లోనే బంధించారని, చచ్చిపోయేంత పిరికివాడు కాదని, తనకు న్యాయం జరిగే వరకూ వదిలే ప్రసక్తేలేదని తెలిపారు. ముబీనా తండ్రి ముగ్గుల్ జానీ మాట్లాడుతూ తనకు ఒకే కుమార్తె, ఇద్దరు మగపిల్లలు ఉన్నారనీ, అలాంటిది పిల్లనే మార్చేశామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తన కూతురు బతుకు నాశనం చేశారన్నారు. రూ. 20 లక్షలపైగా ఖర్చుపెట్టి విశాఖలో ప్రధానం, పెళ్లి చేశామని, ఎంతో ఆనందంగా ఉండాల్సిన సమయంలో ఇటువంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదన్నారు. పెళ్లికొడుకు మదీన్ రెండు, మూడుసార్లు ఇంటికి వచ్చినప్పుడు బట్టలు కొనడానికి బయటకు తీసుకెళ్తానంటేనే తాను పంపలేదని, అలా వెళ్లకూడదని చెప్పానని, అటువంటిది బిడ్డను ఎలా మార్చుకుంటాననీ ప్రశ్నించారు. తల్లి, కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్లనే ఏదో జరిగిందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. -
వధువును మార్చేశారని.. పెళ్లైన మూడోరోజే...
విజయనగరం టౌన్/చీపురుపల్లి: వదువు నచ్చలేదని మనస్తాపం చెందిన ఓ నవవరుడు పెళ్లైన మూడు రోజులకే ఉరేసుకుని మృతి చెందిన సంఘటన విజయనగరం పట్టణంలోని బాబామెట్టలో మంగళవారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి టూటౌన్ సీఐ బీవీజే రాజు అందించిన వివరాల ప్రకారం.. పట్టణంలోని బాబామెట్టకు చెందిన షేక్ మదీన్ చీపురుపల్లి మండలం పెదనడిపల్లి వీఆర్ఓగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయనకు ఈ నెల 2న వివాహం జరిగింది. విశాఖపట్నంలోని రైల్వే న్యూకాలనీలో సాలూరుకు చెందిన మహ్మద్ ముబీనాతో వివాహమైంది. అదేరోజు సాయంత్రం విజయనగరంలోని సింగపూర్ సీటీలో ఉన్న నివాసానికి వచ్చారు. మరుసటి రోజు సోమవారం ఉదయం లేచిన దగ్గర నుంచి మదీన్ డల్‌గా, ఆలోచనలో ఉండడాన్ని తల్లి షహీదాబేగమ్ పసిగట్టింది. ఎందుకు అలా ఉన్నావని ప్రశ్నించగా పెళ్లికుమార్తె ముఖంపై మచ్చలున్నాయని, అందంగా లేదని, నచ్చలేదని సమాధానం ఇచ్చాడు. దీంతో తల్లి కోడల్ని చర్మవ్యాధి నిపుణుల వద్దకు తీసుకెళ్లి చూపించారు. కానీ మంగళవారం కూడా కొడుకు దిగాలుగా ఉండడాన్ని చూసి తల్లి ఓదార్చింది. రిసెప్షన్ రోజే.. పెళ్లై మూడోరోజు రావడంతో ఊర్లో ఉన్న బంధువులకు మంగళవారం రాత్రి రిసెప్షన్ ఇచ్చేందుకు మదీన్ కుటుంబీకులు సిద్ధం అవుతున్నారు. ఆ సమయంలో ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చిన మదీన్ బాబామెట్ట ఎంఐజీ 84లో నివాసం ఉంటున్న మిత్రుని ఇంటికి వెళ్లాడు. అక్కడ మరో ఆలోచన లేకుండా ఫ్యాన్ కొక్కానికి ఉరేసుకుని చనిపోయాడు. ఈ విషయం తెలియని రిసెప్షన్ ఉంచుకుని కొడుకు ఎక్కడికి వెళ్లాడో వెతకాల్సిందిగా మృతుని స్నేహితులకు ఫోన్లో చెప్పింది. వారంతా మదీన్‌కు ఫోన్లు చేయగా ఎంతకి లిఫ్ట్ చేయకపోవడంతో బాబామెట్ట ప్రాంతంలో ఉన్న స్నేహితుని ఇంటికి వెళ్లి చూడగా ఫ్యాన్‌కు విగత జీవుడై కనిపించాడు. అయినప్పటికీ స్నేహితులు సపర్యలు చేసి, పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో కేంద్రాస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. మదీన్‌కు తల్లితో పాటు ఓ చెల్లెలు ఉన్నారు. ఆస్పత్రి వద్ద మిన్నంటిన రోదనలు.. కేంద్రాస్పత్రి వద్ద కుమారుడు మృతదేహాన్ని చూసిన తల్లి కన్నీటి పర్యంతమయ్యారు. మదీన్ బంధువులు, భార్యతరపు వారు అక్కడకు చేరుకోవడంతో ఆస్పత్రిలో విషాదఛాయలు అలముకున్నాయి. పెళ్లి చూపుల్లో చూపించిన అమ్మాయిని కాకుండే వేరే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసిన కారణంగానే మదీన్ ఆత్మహత్య చేసుకున్నారని తల్లి చెప్పినట్లు సీఐ వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ వివరించారు. రెవెన్యూ వర్గాల్లో అలజడి.. మదీన్ మృతి వార్తను తెలుసుకున్న చీపురుపల్లి తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, ఆయన పని చేస్తున్న గ్రామ ప్రజలు విషయం తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. బీటెక్ విద్యను అభ్యసించిన మదీన్ అందరితో బాగా ఉంటూ చక్కగా విధులను నిర్వహిస్తుండేవాడని వారు చెబుతున్నారు. రిసెప్షన్‌కు వస్తున్నామని కూడా మదీన్‌కు తాము చెప్పినట్లు తహసీల్దార్ ముక్తేశ్వరరావు, వీఆర్ఓలు పేర్కొంటున్నారు. ఆయనతో తమకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. -
రైలు కింద పడి వరుడు ఆత్మహత్య
సేలం: తెల్లారితో వివాహం జరగాల్సిన స్థితిలో రైలు కిందపడి వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఈరోడ్ జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగింది. వివరాలు.. ఈరోడ్ జిల్లా ఊంజలూర్ సమీపంలో ఉన్న వెంగంపూర్ కురంగన్ పాళయం రైల్వే ట్రాక్‌పై శుక్రవారం ఉదయం ఒక యువకుడు శవంగా కనిపించాడు. సమాచారం అందుకున్న ఈరోడ్ రైల్వే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. విచారణలో ఊంజలూర్ సమీపంలో ఉన్న కాశిళయం ప్రాంతానికి చెందిన షణ్ముగం(70) విశ్రాంత ఉపాధ్యాయుడు. ఇతనికి ప్రభాకర్ (27), విక్కి (అలియాస్ విఘ్నేష్) (25)అనే కుమారులున్నారు. ప్రభాకర్‌కి వివాహమైన కరూర్‌లో నివసిస్తున్నాడు. విఘ్నేష్ మెకానిక్ ఇంజినీరింగ్ చదివి, చెన్నైలో ఉన్న ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. విఘ్నేష్‌కు శుక్రవారం వివాహం చేయడానికి నిశ్చయించారు. ఏర్పాట్లను కొడుముడిలో ఉన్న ఒక కల్యాణ మండపంలో జోరుగా చేశారు. కాగా, వివాహం కోసం కొన్ని రోజుల కిందట చెన్నై నుంచి విఘ్నేష్ ఇంటికి వచ్చాడు. గురువారం రాత్రి రైలు కిందపడి విఘ్నేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. ఈరోడ్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
పెళ్లి కుమార్తె మరొకరిని ప్రేమిస్తోందని..
మైసూరు: తనతో నిశ్చితార్థమైన యువతి మరొకరిని ప్రేమిస్తోందని తెలియడంతో ఆదివారం పెళ్లిపీటలు ఎక్కాల్సిన వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శనివారం మైసూరులో జరిగింది. పోలీసుల కథనం మేరకు..వివరాలు.....విశ్వేశ్వర నగర్‌కు చెందిన మంజునాథ్‌కు తమిళనాడు కోయంబత్తూరుకు చెందిన యువతితో నెల రోజుల క్రితం నిశ్చితార్థమైంది. ఆదివారం వీరిద్దరికి మైసూరులో వివాహం నిర్వహించేందుకు ఏర్పాటుల చేశారు. అయితే తను మరో యువకుడిని ప్రేమిస్తున్నానని నిన్ను కేవలం పేరుకు మాత్రమే పెళ్లి చేసుకుంటున్నానని ప్రియుడితో కలసి ఉన్న ఫోటోను సదరు యువతి మంజునాథ్ మొబైల్‌కు మెసేజ్ చేసింది. దీంతో జీవితంపై విరక్తి చెందిన మంజునాథ్ శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.