పెళ్లి కుమార్తె మరొకరిని ప్రేమిస్తోందని.. | groom suicide after bride affair with anotherperson | Sakshi
Sakshi News home page

పెళ్లి కుమార్తె మరొకరిని ప్రేమిస్తోందని..

Published Sun, Sep 4 2016 6:53 PM | Last Updated on Mon, Sep 4 2017 12:18 PM

పెళ్లి కుమార్తె మరొకరిని ప్రేమిస్తోందని..

పెళ్లి కుమార్తె మరొకరిని ప్రేమిస్తోందని..

మైసూరు: తనతో నిశ్చితార్థమైన యువతి మరొకరిని ప్రేమిస్తోందని తెలియడంతో ఆదివారం పెళ్లిపీటలు ఎక్కాల్సిన వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన  శనివారం మైసూరులో జరిగింది. పోలీసుల కథనం మేరకు..వివరాలు.....విశ్వేశ్వర నగర్‌కు చెందిన మంజునాథ్‌కు తమిళనాడు కోయంబత్తూరుకు చెందిన యువతితో నెల రోజుల క్రితం నిశ్చితార్థమైంది. ఆదివారం వీరిద్దరికి మైసూరులో వివాహం నిర్వహించేందుకు ఏర్పాటుల చేశారు.

అయితే తను మరో యువకుడిని ప్రేమిస్తున్నానని నిన్ను కేవలం పేరుకు మాత్రమే పెళ్లి చేసుకుంటున్నానని ప్రియుడితో కలసి ఉన్న ఫోటోను సదరు యువతి మంజునాథ్‌ మొబైల్‌కు మెసేజ్‌ చేసింది. దీంతో జీవితంపై విరక్తి చెందిన మంజునాథ్‌ శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement