groundnut farmers
-
కష్టాలు పడుతున్న వేరుశనగ రైతులు
-
వేరుశెనగ నాటడం ఎలా: ఉత్తమ చిట్కాలు మరియు ఉపాయాలు
-
వేరుశనగ సాగులో పాటించాల్సిన మెళకువలు
-
అంతకు మించి
జిల్లాకు వరప్రదాయినిగా మారిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఫలాలు రైతులకు అందుతున్నాయి. రబీలో సాగు చేసిన వేరుశనగ పంట రైతు చేతికి వచ్చింది. బీడు భూముల్లో కృష్ణా జలాలు పారగా రైతులు తమ రెక్కల కష్టంతో పసిడి పంటలుపండించారు. దీంతో జిల్లాలోని ప్రధాన వ్యవసాయ మార్కెట్లన్నీ రబీ వేరుశనగతో కిటకిటలాడుతున్నాయి. సాక్షి, నాగర్‌కర్నూల్ : రబీ పంటలు చేతికొచ్చాయి. జిల్లాలో ఎక్కడ చూసినా వేరుశనగ రైతుల సందడే కనిపిస్తోంది. ట్రాక్టర్లు, ఆటోలు, ఎద్దుల బండ్లన్నీ మార్కెట్‌యార్డుల చెంతకే వెళ్తున్నాయి. వారంపదిరోజులుగా అయితే వేలాది బస్తాల వేరుశనగ ప్రతిరోజూ ఆయా మార్కెట్లకు తరలి వస్తుందంటే నమ్మశక్యం కావడంలేదు. సరుకును కొనేందుకు స్థానిక వ్యాపారులే కాక ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటకకు చెందిన వారు సైతం ఇక్కడ నుంచే కొనుగోలు చేస్తున్నారు. ఈ కారణంగా వ్యాపారుల మధ్య పోటీ పెరిగి ప్రభుత్వ మద్దతు ధర కంటే అధికంగానే మార్కెట్లలో ధర లభిస్తోంది. జిల్లా లో అత్యధికంగా క్వింటాల్‌కు రూ.5వేలకు పైగా ధర లభిస్తుండటంతో రైతుల ము ఖాల్లో ఆనందం కనిపిస్తోంది. ఈ ధర రై తుల కష్టాలను పూర్తిగా తీర్చనప్పటికీ ఆ రువేల పైచిలుకు ధర లభిస్తే రైతులకు కొంత లాభం చేకూరే అవకాశాలున్నాయి. కలిసొచ్చిన తుంపర సేద్యం ఆరుగాలం శ్రమించే జిల్లా రైతాంగానికి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాలువల ద్వారా కృష్ణా జలాలు పొలాల గుండా పారాయి. 2017 అక్టోబర్ నుంచి కాలువల నుంచి నీరు పారుతుండటంతో రైతులు ధైర్యంగా రబీ పంటకు శ్రీకారం చుట్టారు. దీనికితోడు భూగర్భ జలాలు మెరుగు పడటంతో తుంపర సేద్యం ద్వారా వేరుశనగను భారీగా సాగు చేశారు. సాధారణ సాగు విస్తీర్ణం 69వేల 887 ఎకరాలు కాగా ఈసారి లక్షా 30వేల ఎకరాల్లో సాగైంది. రాష్ట్రంలోనే కందనూలు జిల్లాలో అత్యధికంగా వేరుశనగ సాగైనట్టు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. మూడు ప్రధాన మార్కెట్లలో పెరిగిన వ్యాపారం జిల్లాలో నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల్లోని వ్యవసాయ మార్కెట్లకు పెద్ద ఎత్తున వేరుశనగ తరలివస్తోంది. నేరుగా కమీషన్ ఏజెంట్లే రైతుల నుంచి వేరుశనగను కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనప్పటికీ వేరుశనగ డిమాండ్ నేపథ్యంలో ప్రభుత్వ మద్దతు ధరను మించి ధర లభిస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటి వరకు గత 15 రోజుల నుంచి వేరుశనగ లావాదేవీలలో గరిష్టంగా క్వింటాల్‌కు రూ.5039 చెల్లించి ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేశారు. కనిష్టంగా రూ.4029 జిల్లాలో వేరుశనగ ధర నమోదైంది. సరాసరిగా రూ.4735 క్వింటాల్‌కు ప్రైవేటు వ్యాపారులు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు జిల్లాలో ప్రైవేటు వ్యాపారులు 28వేల 991 క్వింటాళ్ల వేరుశనగను కొనుగోలు చేశారు. వేరుశనగ విక్రయాలు మరో 20 రోజులపాటు ఇదేవిధంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో సాగయిన వేరుశనగ విస్తీర్ణంలో కేవలం 25 శాతం మాత్రమే ఇప్పటి వరకు రైతుల చేతికి వచ్చింది. మొత్తం పంట దిగుబడి అంచనా ఒక లక్షా 61వేల 140 మెట్రిక్ టన్నులుగా వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఎకరాకు 6 నుంచి పది క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. స్థలాభావంతో ఇబ్బందులు జిల్లాలోని రబీ పంట ఒక్కసారిగారైతుల చేతికి రావడంతో మార్కెట్ యార్డులలో స్థలాలు సరిపోక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల రాష్ట్ర మార్కెటింగ్ శాఖా మంత్రి హరీశ్‌రావు జిల్లాలో పర్యటించిన సందర్భంలో వసతులు పెంచాలని అధికారులను ఆదేశించారు. అయినప్పటికీ కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. దీంతో రైతులకు మార్కెట్ యార్డులలో పలు రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా మధ్యాహ్నం వేళ రైతులు విశ్రాంతి తీసుకునేందుకు భవనాలు లేకపోవడం, భోజనం చేయటానికి వేర్వేరుగా రూములు లేకపోవడంతో ఆరు బయటనే భోజనాలు చేసి విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది. మలమూత్ర విసర్జనకు సైతం మూత్రశాలలు లేకపోవడం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. మార్కెట్ చుట్టూ ప్రహరీ గోడ లేక పందుల బెడదతో పంటకు రక్షణ లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో వ్యవసాయ పనులకు కూలీల కొరత అధికమైంది. వేరుశనగ పంట తొలగింపునకు ఒక్కో మహిళా కూలీకి రూ.300 దాకా కూలి చెల్లించాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా కూలీలు దొరకక చాలామటుకు భూముల్లోనే వేరుశనగ మిగిలి ఉంది. ఇలా మరికొద్ది రోజులు గడిస్తే వేరుశనగ కాయలు మొలకెత్తే ప్రమాదం లేకపోలేదు. వ్యవసాయ శాఖాధికారులు వేరుశనగ పంట తీసేందుకు ప్రత్యేకంగా యంత్రాల వినియోగంపై రైతుల్లో అవగాహన కల్పించాల్సి ఉంది. ఇందుకు సంబంధించి ముందస్తు వ్యూహం లేక రైతులకు వచ్చే లాభమంతా కూలీలకే చెల్లించాల్సి వస్తోంది. ఒక ఎకరం వేరుశనగ సాగుకు రూ.10వేలు విత్తనాలకు, మరో 10వేలు ఎరువులు, కూలీల ఖర్చులు అవుతాయి. ఇలా ఎకరానికి ఒక్కో రైతు రూ.20వేలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఎకరా దిగుబడి సరాసరి ఐదు క్వింటాళ్లు అనుకుంటే రైతుకు ప్రస్తుతం అందుతున్న ధర ప్రకారం రూ.25వేలు చేతికొస్తాయి. అంటే రైతు పెట్టిన పెట్టుబడి రూ.20వేలు పోగా ఎకరాకు కేవలం రూ.5వేలు మాత్రమే రైతు చేతికి అందుతుండటంతో నష్టం లేకుండా రైతులు కొద్దిపాటి లాభంతో బయట పడుతున్నారు. కొల్లాపూర్ మార్కెట్ నిరుపయోగం కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో మార్కెట్ యార్డు ఉన్నా అక్కడి మార్కెట్లో వేరుశనగ కొనుగోలు చేసే ట్రేడర్లు లేక ఆ ని యోజకవర్గంలోని రైతులంతా నాగర్‌కర్నూ ల్ మార్కెట్ యార్డుకు తరలి వస్తున్నారు. దీంతో వారికి ట్రాన్స్‌పోర్టు ఖర్చు అధికంగా వస్తోంది. మిగిలే ఆ డబ్బులు కూడా రైతులు పొందలేకపోతున్నారు. అధికారులు అక్కడే కొనుగోళ్లు ఏర్పాటు చేస్తే సౌకర్యంగా ఉంటుందని రైతులు కోరుతున్నారు. కొల్లాపురం నుంచి వచ్చినా.. నాలుగు ఎకరాల్లో వేరుశనగ పంటను సాగు చేశాను. 27 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. అయితే కొల్లాపూర్ మార్కెట్లో వ్యాపారులు లేక ఇంత దూరం రావాల్సి వచ్చింది రూ.3వేలు పెట్టి ట్రాక్టర్ కిరాయి తీసుకుని నాగర్‌కర్నూల్ మార్కెట్‌కు వచ్చాను. ఇక్కడ వ్యాపారులు క్వింటాల్‌కు రూ.4729 చొప్పున 94 బస్తాలను కొన్నారు. – శ్రీను, ఎల్లూరు, కొల్లాపూర్ మండలం అందరూ ప్రైవేట్‌లోనే విక్రయిస్తున్నారు.. ప్రస్తుతం జిల్లాలో అన్ని మార్కెట్ యార్డుల్లో వేరుశనగ ప్రభుత్వ మద్దతు ధర కంటే ప్రైవేటుగానే రైతులకు అధికంగా వస్తుండటంతో ఎవరూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించేందుకు ఆసక్తి చూపడం లేదు. రానున్న రోజుల్లో ప్రైవేటు వ్యాపారుల వద్ద ధర తగ్గితే అప్పుడు ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ప్రారంభించి ధాన్యం కొంటాం. – బాలమణి, మార్కెటింగ్ ఏడీ -
గుజరాత్ ఫలితాలపై ‘పల్లీల’ ప్రభావం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మకమైన గుజరాత్ అసెంబ్లీకి తొలి విడత పోలింగ్ శనివారం 9వ తేదీన, మలి విడత పోలింగ్ 14వ తేదీన జరుగుతున్న విషయం తెల్సిందే. ఇదివరకటిలాగే ఈ ఎన్నికల్లో కూడా పాటిదార్ కమ్యూనిటీ లేదా పటేళ్లు నిర్ణయాత్మక పాత్ర వహించనున్నారు. రాష్ట్ర జనాభా ఆరు కోట్ల మందిలో 14 నుంచి 16 శాతం వరకున్న పాటిదార్లు రాష్ట్ర ఓటర్లలో 15 శాతం ఉన్నారు. వారు గత రెండున్నర దశాబ్దాలుగా సంప్రదాయబద్ధంగా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తూ వచ్చారు. ప్రభుత్వ విద్యా, ఉపాధి అవకాశాల్లో తమకూ పది శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ 2015లో భారీ ఎత్తున గుజరాత్లో ఆందోళన చేసినప్పటి నుంచి వారి వైఖరి మారిపోయింది. వారి డిమాండ్లను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంగీకరించక పోవడమే అందుకు కారణం. నాటి పాటిదార్ల ఆందోళనకు నాయకత్వం వహించిన హార్దిక్ పటేల్ రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ పార్టీతో అవగాహనకు వచ్చి ఈ సారి కాంగ్రెస్‌కు ఓటు వేయాలని పాటిదార్లకు పిలుపునిచ్చారు. ఆయన పిలుపుకు స్పందించిన యువత కాంగ్రెస్‌కు ఓటు వేసేందుకు ముందుకురాగా, వృద్ధతరం మాత్రం ఇప్పటికీ బీజేపీకే ఓటు వేయాలని భావివిస్తున్నట్లు పలు సర్వేల ద్వారా తెలుస్తోంది. ఓట్ల ఫలితాలను నిర్దేశించే స్థాయికి చేరకున్న పాటిదార్లు నేడు రాష్ట్రంలో భూస్వాములుగా చెలామణి అవుతున్నారు. ఆది నుంచి భూమిని నమ్ముకున్న వారిలోనూ ఉత్తాన పతనాలు ఉన్నాయి. కౌలు రైతుగా జీవితాలను ప్రారంభించిన పాటిదార్లు ధనిక రైతులుగా ఎదగడం, మళ్లీ పండించిన పంటలకు గిట్టుబాటు ధరరాక చితకిపోవడం, ఓబీసీల్లాగా తమకూ రిజర్వేషన్లు కల్పించాలంటూ ఆందోళన చేయడం వరకు దారి తీసిన పరిస్థితులను లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాస్తవానికి ఉత్తర గుజరాత్‌కు చెందిన పాటిదార్లు 1950 ప్రాంతంలో సౌరాష్ట్రకు వలసపోయారు. అక్కడ చవగ్గా భూములను కౌలుకు తీసుకొని వ్యవసాయాన్ని ప్రారంభించారు. 1956లో భూసంస్కరణల చట్టం రావడంతో ఒక్కసారిగా వారి జీవితాలే మారిపోయాయి. వారంతా భూ యజమానులుగా మారిపోయారు. అప్పటి వరకు చిరు ధాన్యాలు పండించిన వారు వేరుశెనగ పంటకు మళ్లారు. ఆ పంటలకు వారికి మంచి గిట్టుబాటు ధర రావడంతోపాటు మిగులు కూడా ఎక్కువే ఉండడంతో పాల డెయిరీ, నూనె, పిండి మిల్లులు లాంటి వ్యవసాయ పరిశ్రమలపై దృష్టిని కేంద్రీకరించారు. మరి కొందరు రైతుల వ్యవసాయ సాగుకు ఉపయోగించే పరికరాలు, మరికొందరు సిరామిక్స్, పంపులు తయారుచేసే ఇంజనీరింగ్ పరిశ్రమలను స్థాపించారు. వారి ఉత్తాన పతనాల్తో వేరు శెనగ పంటనే కీలక పాత్ర పోషించిందని ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త అచ్యుత్ యాగ్నిక్ తెలిపారు. అయితే ధనిక రైతులకుగానీ, ధీరుభాయి అంబానీ లాంటి పారిశ్రామిక వేత్తలకు ఇక్కడ ఏమీ నష్టం వాటిల్ల లేదు. సన్న, చిన్నకారు, మధ్య తరగతి రైతులే ఎక్కువ దెబ్బతిన్నారు. ఎప్పుడూ వంద కిలోల పల్లీలకు నాలుగువేల రూపాయలకు తక్కువగా కనీస మద్దతు ధర ఉండేది కాదు. వరుసగా గత మూడేళ్లుగా పల్లీల కనీస మద్దతుధర 3000 నుంచి 3200 రూపాయలను మించడం లేదు. అది కూడా అందరికి అందడం లేదు. వారంతా చమురు మిల్లులకు పల్లీలను అమ్ముకుంటున్నారు. ఒకప్పుడు వాటికి 3,200 రూపాయల వరకు ధర పలికేది. పామాయిల్ లాంటి చమురు ఉత్పత్తులను విదేశాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకోవడం వల్ల పల్లి నూనెలకు కూడా దారుణంగా డిమాండ్ పడిపోయింది. పామాయిల్ దిగుమతి కారణంగా 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు వంట నూనెల మార్కెట్లో పల్లి నూనె వాట 15 శాతం నుంచి ఒక్క శాతానికి పడిపోయింది. కేంద్రంలోని ప్రభుత్వాలు ప్రధానంగా ఇండోనేసియా, మలేషియాల నుంచి వచ్చే పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని క్రమంగా తగ్గిస్తూ చివరకు పూర్తిగా ఎత్తివేయడం పల్లి నూనెపై ప్రధానంగా ప్రభావం చూపింది. 2005 సంవత్సరం వరకు పామాయిల్‌పై దిగుమతి సుంకం 80 శాతం ఉండగా, 2008 నాటికి పూర్తిగా ఎత్తివేశారు. రైతులు, దేశీయ చమురు మిల్లుల యజమానులు గొడవ చేయడంతో మళ్లీ పామాయిల్‌పై 15 శాతం వరకు దిగుమతి సుంకం విధించారు. ఈలోగానే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల 1992-93 సంవత్సరంలో మనకు కావాల్సిన వంటనూనెలో 3 శాతాన్ని మాత్రమే దిగుమతి చేసుకోగా, ఇప్పుడు 75 శాతాన్ని దిగుమతి చేసుకుంటున్నాం. దిగుమతి సుంకాలను తగ్గించడం వల్ల మన దేశ రైతులు, మిల్లులు భారీగా నష్టపోయాయని భారత చమురు ఉత్పత్తిదారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ‘సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోపియేషన్’ అధ్యక్షుడు భారత్ మెహతా, పతంజలికి పల్లి నూనెను, స్నిక్కర్స్కు పల్లీలను సరఫరా చేసే ‘శ్రీయా పీనట్స్’ యజమాని దయాభాయ్ థూమర్ తెలిపారు. పల్లి నూనెలో సగం రేటుకే మామాయిల్ రావడం వల్లనే దాని దిగుమతికి వ్యాపారులు ఎగబడుతున్నారు. ఇలాంటి దిగుమతులుపై కేంద్రంలోని వాణిజ్యశాఖ నియంత్ర లేకపోవడం ఓ పెద్ద కుంభకోణమని ఇటీవలనే కాగ్ కూడా కేంద్ర ప్రభుత్వానికి అక్షింతలు విధించిన విషయం తెల్సిందే. 2001లో అప్పటి ప్రధాన మంత్రి అటల్ బిహారి వాజపేయి మలేసియా టూర్‌కు వెళ్లొచ్చి మలేసియా నుంచి వచ్చే పామాయిల్ నూనెలపై దిగుమతి సుంకాన్ని తగ్గించడంతో పల్లీలకు ఎసరు మొదలయింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన యూపీఏ కూడా దిగుమతి సుంకాలను తగ్గిస్తూ వచ్చింది. సోయా, సన్‌ఫ్లవర్ నూనెల దిగుమతులు కూడా పల్లి నూనెపై ప్రభావం చూపాయి. అయితే వాటి ప్రభావం దీనంత ఎక్కువగా లేదు. ఈ రోజున భారత్ వంట నూనెల దిగుమతుల్లో నెంబర్ వన్ దేశంగా గుర్తింపు పొందింది. ఏడాదికి 70 వేల కోట్ల రూపాయల నూనెలను దిగుమతి చేసుకుంటున్నట్లు ప్రభుత్వ లెక్కలే తెలియజేస్తున్నాయి. గుజరాత్‌లోని ఒక్క సౌరాష్ట్రలోనే 1400 చమురు మిల్లులు ఉన్నాయి. ఆ మిల్లుల యజమానులను ‘తేలియా రాజాస్’, అంటే ఆయిల్ కింగ్స్ అని పిలిచేవారు. 1980, 1990వ దశకాల్లో వారే గుజరాత్ ముఖ్యమంత్రి అభ్యర్థులను నిర్ణయించేవారని సౌరాష్ట్ర చమురు మిల్లుల అసోసియేషన్ సంఘం మాజీ అధ్యక్షుడు ఉకాభాయ్ పటేల్ తెలిపారు. వాటిలో దాదాపు 500 మిల్లులు మూతపడ్డాయి. వారంతా రోడ్డున పడ్డారు. పండించిన పల్లీలకు గిట్టుబాటు ధర లేక రైతులు కూడా రోడ్డున పడ్డారు. వారిలో 96 శాతం మంది పాటిదార్లే అవడం వల్ల వారు 2015లో రిజర్వేషన్ల కోసం రోడ్డెక్కారు. గుజరాత్లో ఒకప్పటికి ఇప్పటికీ 60 లక్షల టన్నుల పల్లీల ఉత్పత్తి పడిపోయింది. -
వేరుశనగ రైతులకు అన్యాయం
► అధికారుల నిలదీత ► పోలీసుల సమక్షంలోబాండ్ల పంపిణీ తొండూరు : ఖరీఫ్ 2016లో వేరుశనగ పంట సాగు చేసి నష్టపోయిన వారికి ఇన్పుట్ సబ్సిడీలో అవకతవకలు జరిగాయని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఇనగలూరు గ్రామంలో సర్పంచ్ సావిత్రమ్మ అధ్యక్షతన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ బాండ్ల పంపిణీ కార్యక్రమం ఏఓ కిశోర్ నాయక్ ప్రారంభించారు. పంట సాగు చేసి నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ మంజూరు కాకుండా.. పంట సాగు చేయని వారికి ఎలా వచ్చిందంటూ వ్యవసాయాధికారులను అన్నదాతలు నిలదీశారు. వేరుశనగ సాగు చేసిన వారి పేర్లను ఎంపీఈఓ శివ చదివి వినిపించారు.సాగుచేయని వారి పేర్లు జాబితాలో ఎలా వచ్చాయంటూ అధికారులను నిలదీశారు.అర్హులైన వారికి బాండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చక్రం తిప్పిన గ్రామ నౌకర్లు: ఇన్పుట్ సబ్సిడీ మంజూరులో గ్రామ నౌకర్లు చక్రం తిప్పినట్లు రైతులు చెబుతున్నారు. గ్రామ నౌకర్లు, ఎంపీఈఓలు ఫీల్డ్ విజిట్‌కు వెళ్లినప్పుడు రైతుల వద్ద డబ్బులు తీసుకుని పంట సాగు చేయని వారి పేర్లను జాబితాలో పొందుపరిచారని ఆరోపించారు. గ్రామంలో ఓ రైతు అర ఎకరాలో వేరుశనగ సాగు చేస్తే రూ.13వేలు,మరొకరికి ఎకరాకు రూ.26వేలు మంజూరైందని.. అర్హులైన మేం ఐదెకరాల్లో సాగు చేస్తే కేవలం రూ.6వేలు మాత్రమే వచ్చిందని గ్రామానికి చెందిన బాల ఎరికల్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి అంకిరెడ్డి, అరుణమ్మ, వీరనారాయణరెడ్డి తెలిపారు. ఎంపీఈఓలు, జియో ట్యాగింగ్ చేసే సమయంలో గ్రామ నౌకర్లు కొంతమంది చక్రం తిప్పారని అన్నదాతలు ఆరోపించారు. కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. దీంతో ఏఓ కిశోర్ నాయక్ తొండూరు ఎస్ఐ శ్రీనివాసులుకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎస్ఐ వెంటనే ఏఎస్ఐ రమణ, పోలీసు సిబ్బందిని ఇనగలూరు గ్రామానికి పంపించారు. పోలీసుల సమక్షంలో బాండ్లు పంపిణీ చేశారు. ఈ విషయమై ఏఓ కిశోర్నాయక్ను సాక్షి వివరణ కోరగా ఫీల్డ్ విజిట్‌లో రెవెన్యూ అధికారులు పొరపాటు చేయడంవల్ల ఇలా జరిగిందని.. రెండు రోజుల్లో రెవెన్యూ అధికారులతో చర్చించి రైతులందరికీ ఇన్పుట్ సబ్సిడీ అందేలా చూస్తామని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ తాలుకా కార్యదర్శి దశరథరామిరెడ్డి, మాజీ సర్పంచ్ గంగయ్య, ఎంపీఈఓలు తదితరులు పాల్గొన్నారు. -
ఎర్రిపల్లిలో వేరుశెనగ పంట పరిశీలించిన వైఎస్ జగన్
పులివెందుల : జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఆయన శుక్రవారం పులివెందుల మండలం ఎర్రిపల్లిలో పర్యటించారు. వర్షాలు లేక దెబ్బతిన్న వేరుశెనగ పంటలను వైఎస్ పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత ముందు రైతులు తమ కష్టాలను ఏకరువు పెట్టుకున్నారు. వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నా...ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన వైఎస్ జగన్.... బాధిత రైతులకు అండగా ఉంటానంటూ భరోసా కల్పించారు. పంటలు ఎండిపోతున్నా...ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ‘జిల్లాలో 71వేల హెక్టార్లలో వేరుశెనగ పంట వేశారు. దాదాపు అన్నిచోట్లా పంట చేతికొచ్చే పరిస్థితి లేదు. 70 రోజుల తర్వాత కూడా కాయలు రాలేదు. జూన్ లో కాస్తో కూస్తో వర్షాలు పడ్డాయి. జూలైలో చాలీచాలని వర్షాలు, ఆగస్టులో అసలు వర్షాలే పడలేదు. వర్షాలు లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. జూన్ 7న ఎస్ఎల్బీసీ సమావేశం పెట్టారు. ఆగస్టు 12న జరగాల్సిన మీటింగ్‌ను ఇప్పటివరకూ జరపలేదు. సీజన్ అయిపోయాక ఈ నెల 15న జరుపుతారట. రుణాలు మాఫీ అవ్వక, ఇన్సూరెన్స్ అందక రైతులు అల్లాడిపోతున్నారు. 2015-16 క్రాఫ్ ఇన్సురెన్స్ ఇప్పటివరకూ ఇవ్వలేదు. శ్రీశైలంలో 845 అడుగుల నీరుంటేనే పోతిరెడ్డిపాడుకు నీళ్లొస్తాయి. కానీ కరెంట్ కోసమని శ్రీశైలం నుంచి ఎడాపెడా నీళ్లువాడి 780 అడుగులకు తీసుకెళ్లారు. 854 అడుగులు లేకపోతే రాయలసీమకు నీళ్లు ఎలా ఇస్తారు. గండికోటకు 10 టీఎంసీల నీరు ఇస్తామని చంద్రబాబు చెబుతున్నారు. ఇప్పటివరకూ నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీనే ఇవ్వలేదు. మరి నీరు ఏకరంగా ఇస్తారో చెప్పాలి. బ్రహ్మంసాగర్ కు 12 టీఎంసీల నీళ్లిస్తామని ఇప్పటివరకూ ఇవ్వలేదు. 2008లో వైఎస్ఆర్ మాత్రం ఇచ్చారు. చంద్రబాబు రెండేళ్లలో ఒక్క టీఎంసీ నీళ్లు కూడా ఇవ్వలేకపోయారు. హంద్రీనీవా, గాలేరి-నగరి అన్ని ప్రాజెక్టులు నత్తనడకనే నడుస్తున్నాయి. వైఎస్ఆర్ హయాంలో ఈ ప్రాజెక్టులన్నీ 80 శాతం పూర్తయ్యాయి. మిగతా 20 శాతాన్ని కూడా చంద్రబాబు పూర్తి చేయలేకపోయారు. ఇప్పుడు రెయిన్ గన్లను తానే కనిపెట్టినట్లు చెబుతున్నారు. పులివెందులలో 4వేల ఎకరాలకు నాలుగు రెయిన్ గన్లు ఇచ్చారు. వాటితో 4వేల ఎకరాలను ఎలా కాపాడతారు. వరదలొచ్చినప్పుడు ఎవరైనా ఏరియల్ సర్వే నిర్వహిస్తారా? కానీ చంద్రబాబు మాత్రం కరువును తెలుసుకునేందుకు ఏరియల్ సర్వే నిర్వహించారు. ఏరియల్ సర్వే చేస్తే కరువు తీవ్రత తెలుస్తుందా?. రాయలసీమలో 8లక్షల హెక్టార్లలో వేరుశెనగ పంట వేస్తే 7 లక్షల హెక్టార్లలో పంట ఎండిపోయింది. కానీ చంద్రబాబు మాత్రం 61వేల హెక్టార్లలోనే పంట దెబ్బతిందని 42వేల హెక్టార్లలో రెయిన్ గన్స్ తో కాపాడామని అబద్ధం చెబుతున్నారు. కేవలం 18 వేల హెక్టార్లలో మాత్రమే పంటనష్టం జరిగిందంటున్నారు. ఇన్సూరెన్స్ కూడా రాకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నారు. పంట నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి. 2015-16 ఇన్పుట్ సబ్సిడీని వెంటనే చెల్లించాలి. ఈ ఏడాది ఎకరాకు రూ.10వేల చొప్పున పరిహారం ఇవ్వాలి’ అన్నారు.