గరుడాద్రిలో పోలీసుల తనిఖీలు: 30 మంది అరెస్ట్
రేణిగుంట: గరుడాద్రి ఎక్స్ప్రెస్లో ఎర్రచందనం కూలీలను పోలీసులు అరెస్ట్ చేశారు. అందిన ప్రాథమిక సమాచారం మేరకు గురువారం పోలీసులు గరుడాద్రి ఎక్స్ప్రెస్ రైల్లో రేణిగుంట వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 30 మంది ఎర్రచందనం కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.