GST Bil
-
జీఎస్టీ బిల్లు ఉంటే చాలు.. రూ.కోటి వరకూ నగదు బహుమతులు
GST reward scheme: చాలా కాలంగా ఎదురుచూస్తున్న 'మేరా బిల్ మేరా అధికార్' పథకాన్ని కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రారంభించనుంది. దీని ద్వారా ఏదైనా కొనుగోలుకు సంబంధించిన జీఎస్టీ ఇన్‌వాయిస్‌ని మొబైల్ యాప్‌లో అప్లోడ్ చేసి రివార్డ్ పొందవచ్చు. ఇన్వాయిస్ ప్రోత్సాహక పథకం కింద రిటైలర్ లేదా హోల్‌సేల్ వ్యాపారి నుంచి తీసుకున్న ఇన్వాయిస్ను యాప్‌లో అప్లోడ్ చేసినవారికి నెలవారీగా, త్రైమాసికంవారీగా లక్కీ డ్రా తీసి రూ. 10 లక్షల నుంచి రూ. 1 కోటి వరకూ నగదు బహుమతులు ఇవ్వనున్నట్లుగా సంబంధిత అధికారులు పీటీఐ వార్తా సంస్థతో పేర్కన్నారు. 'మేరా బిల్ మేరా అధికార్' మొబైల్ యాప్ ఐవోఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ యాప్‌లో అప్లోడ్ చేసే ఇన్వాయిస్లో విక్రేతకు సంబంధించిన జీఎస్టీఐఎన్, ఇన్వాయిస్ నంబర్, చెల్లించిన మొత్తం, పన్ను మొత్తం వివరాలు ఉండాలి. ఒక వ్యక్తి ఒక నెలలో గరిష్టంగా 25 ఇన్వాయిస్లను యాప్‌లో అప్లోడ్ చేయవచ్చు. అయితే ఈ ఇన్వాయిస్ కనీసం రూ. 200 కొనుగోలు విలువను కలిగి ఉండాలి. ప్రతి నెలా లక్కీ డ్రాలు కంప్యూటరైజ్డ్ లక్కీ డ్రాల ద్వారా విజేతలను నిర్ణయిస్తారు. ప్రతి నెలా 500కు పైగా లక్కీ డ్రాలు నిర్వహిస్తారు. ప్రైజ్ మనీ రూ.లక్షల్లో ఉంటుంది. అలాగే త్రైమాసానికి రెండు చొప్పున లక్కీ డ్రాలు తీస్తారు. ఇక్కడ రూ. 1 కోటి వరకూ నగదు బహుమతి ఉంటుంది. ఈ పథకం తుది దశకు చేరుకుందని, ఈ నెలలోనే దీన్ని ప్రారంభించవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు. జీఎస్టీ ఎగవేతను అరికట్టడానికి , వార్షిక టర్నోవర్ రూ. 5 కోట్లకు మించిన సంస్థలకు ప్రభుత్వం ఇప్పటికే ఎలక్ట్రానిక్ ఇన్‌వాయిస్‌ని తప్పనిసరి చేసింది. 'మేరా బిల్ మేరా అధికార్' స్కీమ్ బీ2సీ కస్టమర్ల విషయంలో కూడా ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్ అంగీకరిస్తుంది. తద్వారా కొనుగోలుదారు లక్కీ డ్రాలో పాల్గొనేందుకు అర్హత పొందవచ్చు. ఇదీ చదవండి: Revised I-T rules: ఉద్యోగులకు గుడ్‌న్యూస్: ఇన్కమ్ ట్యాక్స్ నిబంధనల్లో మార్పులు.. భారీగా పన్ను ఆదా! -
పైసా వసూల్, జీఎస్టీ పన్ను లక్షకోట్లను దాటేసింది!
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ క్రియాశీలత ఉత్తేజాన్ని ప్రతిబింబిస్తూ, వరుసగా రెండవనెల ఆగస్టులోనూ వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు లక్ష కోట్లకు అధిగమించాయి. రూ.1,12,020 కోట్లుగా నమోదయ్యాయి. 2020 ఆగస్టుతో (రూ.86,449 కోట్లు) పోల్చితే ఈ నిధులు 30 శాతం అధికం కావడం గమనార్హం. కోవిడ్ ముందస్తు స్థాయి ఆగస్టు 2019 (రూ.98,202 కోట్లు) కన్నా కూడా ఈ నిధులు 14 శాతం అధికం కావడం మరో విషయం. జులై, ఆగస్టు మాసాల్లో తిరిగి రూ. లక్ష కోట్లకు పైగా జీఎస్టీ వసూళ్లు నమోదవడం ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి సంకేతమని ఆర్థిక శాఖ విశ్లేషించింది. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతోపాటు ఎగవేతదారులపై చర్యలు తీసుకోవడం వంటి కారణాలు కూడా జీఎస్టీ వసూళ్లలో పెరుగుదలకు కారణమైనట్లు తెలిపింది. ప్రభుత్వం ఈ మేరకు బుధవారం తాజా గణాంకాలను విడుదల చేసింది. వేర్వేరుగా ఇలా... ►సెంట్రల్ జీఎస్టీ రూ.20,522 కోట్లు ►స్టేట్ జీఎస్టీ రూ.26,605 కోట్లు ► ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (రాష్ట్రాల మధ్య వస్తు, సేవల రవాణాకు సంబంధించి వసూళ్లు– ఐజీఎస్టీ) రూ.56,247 కోట్లు. (వస్తు దిగుమతులపై వసూలయిన రూ.26,884 కోట్లుసహా) ► సెస్ రూ.8,646 కోట్లు (వస్తు దిగుమతులపై వసూలయిన రూ.646 కోట్లుసహా). అప్పడానికి జీఎస్టీ వర్తించదు కాగా అప్పడానికి జీఎస్టీ వర్తించబోదని పరోక్ష పన్నులు, కస్టమ్స్ సుంకాల కేంద్ర బోర్డ్ (సీబీఐసీ) వివరణ ఇచ్చింది. పేరు లేదా ఆకారంతో సంబంధం లేకుండా.. పాపడ్‌కు జీఎస్టీ వర్తించబోదని స్పష్టం చేసింది. ‘‘గుండ్రంగా ఉన్న పాపడ్‌కు జీఎస్టీ నుండి మినహాయింపు ఉంది. చదరపు పాపడ్‌కు జీఎస్టీ వర్తిస్తుందని మీకు తెలుసా? నాకు ఈ లాజిక్ అర్థం అయ్యేలా మంచి చార్టర్డ్ అకౌంటెంట్ని ఎవరైనా సూచించగలరా?’’ అని ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ హర్షా గోయెంకా మంగళవారం చేసిన ట్వీట్ నేపథ్యంలో సీబీఐసీ తాజా వివరణ ఇచ్చింది. చదవండి: ఫేస్బుక్లో హింస ఈ రేంజ్లో ఉందా!? -
గుజరాత్ ఫలితాలను నిర్ణయించేవి ఇవే?!
గుజరాత్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు గతంలో ఎన్నడూ లేనంత ప్రతిష్టాత్మకంగా ఈ దఫా జరగనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీకి ఈ ఎన్నికలు ఒకరకంగా విషమ పరీక్ష పెడుతున్నాయనడంలో సందేహం లేదు. రెండు విడతల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో 5 అంశాలు ఓటర్లును ప్రభావితం చేసే అవకాశముందని తెలుస్తోంది. పటేల్ కోటా ఈ దఫా శాసనసభ ఎన్నికలను అత్యంత ప్రభావితం చేస్తున్న ఏకైక అంశం ఇదే. పటేల్ వర్గానికి రిజర్వేషన్ కోటా కల్పించాలని హార్ధిక్ పటేల్ చేసిన ఉద్యమం తరువాత దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. దాదాపు రెండు దశాబ్దాల పాలనలో బీజేపీకి అతి పెద్ద సవాల్ విసిరిన అంశం కూడా ఇదే. ఇదిలా ఉండగా.. పటేల్ వర్గాన్ని ఓబీసీలో చేర్చే విషయంపై గత నెల్లో ప్రభుత్వం ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్‌పై హార్ధిక్ పటేల్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. గుజరాత్‌లోని 182 స్థానాల్లో దాదాపు 60 నియోజకవర్గాల్లో పటేల్ వర్గం జయాపజాలను నిర్ణయించే స్థాయిలో ఉంది. జీఎస్టీ భారతీయ జనతాపార్టీకి మొదటి నుంచి అండగా ఉన్న చిన్న, సన్నకారు వ్యాపారులంతా జీఎస్టీతో కుదేలయ్యారు. అంతేకాకుండా వస్త్ర పరిశ్రమ వ్యాపారులు 5శాతం జీఎస్టీని తగ్గించాలని ప్రధాని మోదీని కోరుతున్నారు. పారిశ్రామిక అడ్డా అయిన సూరత్‌లోనూ జీఎస్టీ పట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. లక్షలాది మంది వ్యాపారులు రోడ్లమీదకు వచ్చి జీఎస్టీకి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రభుత్వం మాత్రం జీఎస్టీ వల్ల తాత్కాలికంగా ఇబ్బందులు ఎదురైనా భవిష్యత్‌లో మాత్రం మంచి ఫలితాలు వస్తాయని చెబుతోంది. నర్మదా డ్యామ్ ప్రధాని నరేంద్ర మోదీ గత సెప్టెంబర్ నెల్లో దేశంలోనే అత్యంత భారీ ప్రాజెక్టుల్లో ఒకటైన నర్మాదా ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల 2 లక్షల 46 వేల హెక్టార్ల భూమి సాగులోకి వస్తుంది. ఈ ప్రాజెక్టు గుజరాత్ స్వరూన్నే మార్చేస్తుందని ప్రధాని మోదీ ప్రకటిస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తోంది. దాదాపు 500 కిలోమీటర్ల పొడవైన ప్రధాన కాలువ, ఆరు బ్రాంచ్ కెనాల్స్ పనులను బీజేపీ ఇప్పటికీ పూర్తి చేయలేదని కాంగ్రెస్ విమర్శిస్తోంది. నిరుద్యోగం గుజరాత్ యువత ప్రస్తుతం ఎన్నడూలేనంత నిరాశలో ఉంది. ఉద్యమాలు, పోరాటాలతో పలు సంస్థలు మూతపడ్డాయి. దీంతో వందలాది మంది యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో.. ఈ విషయాన్నే అధికంగా ప్రస్తావిస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులు టీచర్లు, అంగన్వాడీ ఉద్యోగులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో విధుల నిర్వహణ కోసం గుజరాత్ ప్రభుత్వం కాంట్రాక్టు పద్దతిలో యువతను ఉద్యోగాల్లోకి తీసుకుంది. వీరికి ఖచ్చితమైన వేతనంతో రెండేళ్ల కాంట్రాక్టు కింద వీరికి ఉద్యోగాలు ఇచ్చింది. అయితే ప్రస్తుతం కాంట్రాక్టు ఉద్యోగులు.. తమ వేతనాలు పెంచడంతో పాటు.. రెగ్యులర్ సర్వీసులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
జీఎస్టీపై నేడు కాంగ్రెస్ అసమ్మతి పత్రం!
న్యూఢిల్లీ: వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) బిల్లుపై అసమ్మతి పత్రం (డిసెంట్ నోట్) ఇవ్వటానికి కాంగ్రెస్ సంసిద్ధమైంది. బిల్లులో తాము కోరిన ఐదు మార్పుల్లో దేనినీ ఎంపిక కమిటీ ఆమోదించేలా లేకపోవటంతో అసమ్మతి పత్రం ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటివరకూ మినహాయింపు ఉన్న పొగాకు, విద్యుత్‌ను జీఎస్టీలో చేర్చాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. యూపీఏ హయాంలో ప్రవేశపెట్టిన జీఎస్టీ బిల్లులో ఉన్న విధంగా.. వివాద పరిష్కారం నిబంధనను కూడా కొత్త బిల్లులో చేర్చాలని డిమాండ్ చేస్తోంది. జీఎస్టీ 18 శాతం మించరాదని గరిష్ట పరిమితిని బిల్లులో విధించాల్సిందిగా పట్టుపడుతోంది. వీటిలో ఏవీ అంగీకరించే అవకాశాలు కనిపించకపోవటంతో.. బీజేపీ ఎంపీ భూపీందర్‌యాదవ్ నేతృత్వంలో శుక్రవారం సమావేశం కానున్న 21 మంది సభ్యుల ఎంపిక కమిటీ భేటీలో అసమ్మతి పత్రం ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది.