gudem kothaveedhi
-
లంచం కేసులో 'చిరంజీవి' అరెస్టు..
సాక్షి, విశాఖపట్నం: మరో అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. గూడెం కొత్త వీధి (జీకే వీధి) తహసీల్దార్ చిరంజీవి రూ.50 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. మైనింగ్ క్వారీకి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) ఇచ్చేందుకు చిరంజీవి లంచం డిమాండ్ చేసినట్టు సమాచారం. బాధితుని ఫిర్యాదు మేరకు ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ ఎంఆర్ఓ ఇంటిపై ఆకస్మిక దాడిచేసి.. రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా చిరంజీవిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. -
మావోయిస్టుల బీభత్సం: మూడిళ్లు పేల్చివేత
గూడెం కొత్తవీధి: మావోయిస్టులు బీభత్సం సృష్టించారు. విశాఖపట్టణం జిల్లా గూడెం కొత్తవీధి మండలం జల్లెల గ్రామంలో మంగళవారం అర్థరాత్రి దాటాక 400 మంది మావోయుస్టులు, మిలీషియా సభ్యులు దాడిచేశారు. గ్రామంలోని మూడు ఇళ్లను మందు గుండు సామాగ్రితో పేల్చేశారు. మైనింగ్ కాంట్రాక్టర్లకు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారన్న అనుమానంతో జల్లెల గ్రామ శివారులో ఉన్న ముగ్గురికి చెందిన ఇళ్లను ధ్వంసం చేశారు. అయితే ఆ మూడు ఇళ్లలో జనం ఎవరూ లేకపోవడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది.