మావోయిస్టుల బీభత్సం: మూడిళ్లు పేల్చివేత | maoists attack the gudem kothaveedhi | Sakshi
Sakshi News home page

మావోయిస్టుల బీభత్సం: మూడిళ్లు పేల్చివేత

Published Wed, Aug 12 2015 7:27 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM

maoists attack the gudem kothaveedhi

గూడెం కొత్తవీధి: మావోయిస్టులు బీభత్సం సృష్టించారు. విశాఖపట్టణం జిల్లా గూడెం కొత్తవీధి మండలం జల్లెల గ్రామంలో మంగళవారం అర్థరాత్రి దాటాక 400 మంది మావోయుస్టులు, మిలీషియా సభ్యులు దాడిచేశారు. గ్రామంలోని మూడు ఇళ్లను మందు గుండు సామాగ్రితో పేల్చేశారు.

మైనింగ్ కాంట్రాక్టర్లకు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారన్న అనుమానంతో జల్లెల గ్రామ శివారులో ఉన్న ముగ్గురికి చెందిన ఇళ్లను ధ్వంసం చేశారు. అయితే ఆ మూడు ఇళ్లలో జనం ఎవరూ లేకపోవడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement