Gudumba manufacturing
-
గుడుంబాపై ఉక్కుపాదం మోపండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గుడుంబా తయారీని సహించేది లేదని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. గుడుంబాపై ఉక్కుపాదం మోపాలని, తయారీదారులపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేయాలని ఎక్సైజ్ అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ‘గుడుంబా గుప్పు–పల్లెకు ముప్పు’ శీర్షికన రాష్ట్రంలో మళ్లీ కోరలు చాస్తున్న గుడుంబా తయారీపై బుధవారం ‘సాక్షి’మెయిన్ ఎడిషన్‌లో ప్రచురితమైన కథనానికి స్పందనగా, తాజా పరిస్థితి గురించి బుధవారం ఆయన ఎక్సైజ్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదల, నిబద్ధతతో రాష్ట్రం గుడుంబా రహితంగా మారిందని, ఆ ఇమేజ్ పోతే సహించేది లేదని చెప్పారు. చదవండి: గుడుంబా గుప్పు.. పల్లెకు ముప్పు గుడుంబా తయారీదారులను, బెల్లం అమ్మకందారులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. క్షేత్ర స్థాయిలో అధికారులు ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని, అలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆబ్కారీ జిల్లాల అధికారులు ప్రతి రోజూ తమ సిబ్బంది నుంచి వివరాలు తీసుకుని, ఆ నివేదికలను తనకు పంపాలని ఆదేశించారు. డిప్యూటీ కమిషనర్లు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, పోలీస్, తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లతో కలసి తనిఖీలు నిర్వహించాలని సూచించారు. లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా ఊరుకోవద్దని, మద్యం అమ్మకాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే షాపుల లైసెన్సులు రద్దు చేయాలని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, అదనపు కమిషనర్ అజయ్‌రావు, టీఎస్‌బీసీఎల్ ఎండీ సంతోష్‌రెడ్డి, ఉన్నతాధికారులు ఖురేషీ, హరికిషన్లతో పాటు వివిధ జిల్లాల డిప్యూటీ కమిషనర్లు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. ఇప్పటివరకు 1,922 కేసులు నమోదు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గుడుంబా తయారీ, అమ్మకందారుల మీద ఇప్పటివరకు 1,922 కేసులు పెట్టి 8,091 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నామని ఎక్సైజ్ అధికారులు మంత్రికి వివరించారు. అక్రమ మద్యం అమ్మేవారిపై 743 కేసులు పెట్టి 777 మందిని అరెస్టు చేశామని, 6,223 లీటర్ల మద్యం, 4,525 లీటర్ల బీరును సీజ్ చేశామని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం సరఫరా చేస్తున్న 21 మందిపై కేసులు నమోదు చేసి 212 లీటర్ల మద్యం 22 లీటర్ల బీరు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. లాక్డౌన్ సందర్భంగా 45 మంది నిబంధనలకు వ్యతిరేకంగా మద్యం అమ్ముతున్నారని గుర్తించి కేసులు పెట్టామని, 80 మందిని అరెస్టు చేశామని మంత్రికి వివరించారు. -
బెల్టుషాపుల రద్దుతో నాటు.. ఘాటు!
ఇది కనగానపల్లి మండలం బద్దలాపురంలో నాటు సారా తయారీ స్థావరం. గ్రామ సమీపంలో ఉండే పొలాల్లోనే సారా కాస్తున్నారు. ఇక్కడ రోజుకు 1500 లీటర్ల సారా తయారు చేస్తున్నట్లు సమాచారం. గ్రామంలో 10 కుటుంబాలు దాకా ఇదే పని చేస్తున్నట్లు తెలుస్తోంది. వ్యర్థ పదార్థాలతో తయారుచేసే ఈ నాటు సారాను లీటరు రూ.100లతో విక్రయిస్తున్నారు. విషపూరితమైన నాటుసారా తాగి గ్రామంలో చాలా మంది అనారోగ్యాల పాలై ప్రాణాలను పొగొట్టుకొంటున్నారు. నాటుసారాకు బానిసైన ఓ వ్యక్తి 15 రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రస్తుతం చాలా గ్రామాల్లో బెల్టు షాపులు రద్దు కావటంతో నాటుసారా అన్ని చోట్లకు విస్తరిస్తోంది. కనగానపల్లి మండలంతోపాటు చెన్నేకొత్తపల్లి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని రామగిరి, చెన్నేకొత్తపల్లి మండలాల్లో కూడా నాటుసారా తయారీ కేంద్రాలు ఉన్నాయి. ఈ మూడు మండలాల పరిధిలో సుమారు 15 గ్రామాల్లో నాటుసారా తయారీదారులు ఉన్నట్లు సమాచారం. సాక్షి, కనగానపల్లి: రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలను మద్యం మత్తు నుంచి దూరం చేయాలని గ్రామాల్లో బెల్టు షాపులను రద్దు చేసింది. అయితే నాటుసారా తయారీదారులు పేదల బతుకుల్లో కుంపటి పెడుతున్నారు. బెల్టు షాపుల రద్దు తర్వాత గ్రామాల్లో నాటు సారాయి తయారీ, అమ్మకాలు జోరుగా సాగిస్తున్నారు. రాష్ట్రానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మద్యం మహమ్మారి నుంచి ప్రజలను కాపాడి, వారిని ఆర్థికంగా ఎదిగేందుకు దోహదపడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మద్య నిషేధాన్ని విడతల వారీగా అమలు చేయాలని చూస్తున్నారు. ప్రజారోగ్యం ప్రశ్నార్థకం కుళ్లిన పండ్లు, వ్యర్థ పదార్థాలతో ఈ నాటుసారా తయారు చేస్తుండటంతో ఇది చాలా మత్తుగా ఉండటంతో పాటు విష పూరితంగా ఉంటోందని స్థానికులు చెబుతున్నారు. ఈ నాటుసారా తయారీలో ఎక్కువగా కుళ్లిన అరటి పండ్లు, చెడిపోయిన బెల్లం, యూరియా వంటి పదార్థాలు వినియోగిస్తారు. దీనిని తయారు చేసేందుకు రూ.20(లీటర్‌కు) ఖర్చు వస్తే, తర్వాతా దీనిని రూ.100 లకు విక్రయిస్తూ తయారీదారులు మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. అయితే దీనిని తాగేవారు మాత్రం ఆర్థికంగా నష్టపోవటంతో పాటు వారి ఆరోగ్యాలను కూడా పాడు చేసుకొంటున్నారు. బద్దలాపురంలో నాటుసారా ఎక్కువగా సేవించి ఆరోగ్యాలు పాడుచేసుకొని కొందరు ప్రాణాలను కూడా పొగొట్టుకొంటున్నారని గ్రామంలోని మహిళలు వాపోయారు. దాడులు చేస్తే ఒట్టు.. మండలంలో పలుచోట్ల నాటుసారా తయారీ, విక్రయాలు కొనసాగుతున్నా, దీనిని నివారించవలసిన ఎక్సైజ్ అధికారులు మండలంలో ఎక్కడా దాడులు చేయటం లేదు. దీంతో బద్దలాపురం, వేపకుంట, తూంచర్ల, పాతపాళ్యం వంటి గ్రామాల్లో విచ్చలవిడిగా నాటుసారా తయారీ, విక్రయాలు కొనసాగిస్తున్నారు. ఇక గ్రామాల్లో సాధారణ పోలీస్ సిబ్బంది కూడా కేవలం మద్యం బెల్టు షాపులపై మాత్రం దాడులు చేసి, నాటు సారా విక్రయాలను చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించి నాటుసారా మహమ్మారి నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. మద్యాన్ని ప్రజలకు దూరం చేయాలి మద్యపానంతో గ్రామాల్లో చాలా కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. ప్రభుత్వం గ్రామాల్లో బెల్టు షాపులను రద్దు చేయించినా కొన్ని గ్రామాల్లో నాటుసారా తయారీ చేసి ప్రజలకు విక్రయిస్తున్నారు. దీనివల్ల ప్రజలు ఆర్థికంగా దెబ్బతినటంతో పాటు అనారోగ్యం పాలవుతున్నారు. బద్దలాపురంలోనే నాటుసారాకు అలవాటు పడి చాలా మంది అనారోగ్యాల పాలై ప్రాణాలు కూడా పోగొట్టుకొన్నారు. ఎక్సైజ్ అధికారులు గ్రామాల్లో విసృతంగా తనిఖీలు చేసి నాటుసారా తయారీని అరికట్టాలి. –నాగార్జున, బద్దలాపురం, కనగానపల్లి మండలం స్థావరాలపై దాడులు నిర్వహిస్తాం ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాల్లో మద్యం బెల్టు షాపులను పూర్తీగా నివారించాం. అయితే గ్రామాల్లో నాటుసారా తయారీ జరుగుతున్నట్లు మాకు ఎక్కడా సమాచారం లేదు. నాటుసారా తయారీ స్థావరాలు ఉన్నట్లు తెలిస్తే వెంటనే వాటిపై దాడులు చేసి, విక్రయదారులపై చర్యలు తీసుకొంటాం. –తఖీబాషా, ఎక్సైజ్ సీఐ, చెన్నేకొత్తపల్లి -
7337559597
గుడుంబాపై ఫిర్యాదులకు వాట్సప్ నంబర్ ప్రారంభించిన డిప్యూటీ సీఎం ‘కడియం’ వరంగల్ రూరల్ : జిల్లాలో గుడుంబా తయారీ, అమ్మకాలను అరికట్టడమే లక్ష్యంగా అధికార యంత్రాంగం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా గుడుంబా తయారీ, రవాణా, అమ్మకాల సమాచారాన్ని తెలుసుకునేందుకు వాట్సప్ నంబర్ 7337559597 ను ఏర్పాటుచేశారు. గుడుంబాకు సంబంధించి ఎవరికైనా సమాచారం తెలిస్తే ఈ నంబర్‌కు వివరాలు తెలియజేయొచ్చు. ఈ మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్డీఏ) ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన వాట్సప్ నంబర్‌ను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి గురువారం ఆవిష్కరించారు. -
కొత్త జీవితం
గుడుంబా తయూరీ మానేస్తున్న పలువురు గిరిజనులు ఉపాధి కోల్పోరుున వారికి {పత్యామ్నాయ మార్గాలు ఆర్నెళ్లుగా అమలవుతున్న {పణాళిక ఆత్మగౌరవం సరే.. ఆర్థిక సాయం సరిపోతలేదంటున్న లబ్ధిదారులు హన్మకొండ : గుడుంబా తయారీ, అమ్మకాలకు ప్రధానంగా ఆర్థిక వెనుకబాటు, నిరక్షరాస్యత తదితర సామాజిక అంశాలు మూల కారణాలుగా ఉన్నారుు. దీనిని గుర్తించిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. గుడుంబా తయారీదారులకు అవగాహన కల్పించడంతో పాటు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించే ప్రణాళికలు జిల్లాలో ఆర్నెళ్లుగా అమలవుతున్నాయి. దీంతో గుడుంబా తయారీదారుల జీవితాలు అంధకారం నుంచి ఆత్మగౌరవం వైపు అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా గిరిజన గూడేలు, లంబాడి తండాలు గుడుంబా తయారీకి, వినియోగానికి ప్రధాన అడ్డాలుగా ఉన్నాయి. గుడుంబా సేవించి ప్రజలు మృత్యు ఒడికి చేరుతున్నారు, కుటుంబాలు పెద్దదిక్కును కోల్పోతున్నారుు. సరైన ఉపాధి మార్గాలు లభించక ఎక్కువ మంది ఈ గుడుంబా తయారీ, అమ్మకాల ఊబిలోకి వెళ్తుంటే.. ఎక్కువ లాభాలు వస్తాయనే దురాశతో మరికొందరు జత కలుస్తున్నారు. ఈ సమస్య మూలాలల్లోకి వెళ్లి పరిష్కారం చూపించడంలో చాలా కాలంగా ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి అవలంభించాయి. వరంగల్ వేదికగా సీఎం ప్రకటన గుడుంబా తయారీని సంపూర్ణంగా నిషేధిస్తామని 2015 జనవరిలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వరంగల్ వేదికగా ప్రకటించారు. ఆ తర్వాత గుడుంబా తయారీదారులపై దాడులు ముమ్మరమయ్యాయి. నల్లబెల్లంపై నిషేధం, బైండోవర్లు, పీడీ యాక్టులతో తండాలు, గిరిజనగూడేలు అదిరిపోయాయి. అరుుతే, ప్రత్యామ్నాయ ఉపాధిమార్గం చూపకుండా దాడులు చేస్తే ఏటేటా కేసుల సంఖ్య పెరిగిపోతుందే తప్ప పరిష్కారం లభించడం లేదని గ్రహించారు. ప్రత్యామ్నాయ ఉపాధి చూపించడం ద్వారా గుడుంబా నిర్మూలనకు చర్యలు చేపట్టారు. జిల్లా, డివిజన్, మండలం, పంచాయతీ, గ్రామ స్థాయిలో కమిటీలు వేశారు. ఇందులో ఎక్సైజ్, పోలీసు, మహిళా స్వయం సహాయక సంఘాలు, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన సిబ్బంది సభ్యులను చేశారు. అవగాన.. ఆర్థికసాయం ఏక్సైజ్ శాఖ చేపడుతున్న దాడుల సందర్భంగా జీవనోపాధికి ఇతర మార్గాలు లేక గుడుంబా కోరల్లో చిక్కుకున్న వారిని గుర్తించి గుడుంబా నిర్మూలన కమిటీకి తెలియజేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రజాప్రతినిధుల ద్వారా, వ్యక్తిగతంగా కలిసిన వారినీ పరిశీలనలోకి తీసుకుంటున్నారు. వారికి ప్రత్యామ్నయ ఉపాధి కోసం దశలవారీగా ఆర్థికసాయం అందజేయాలని నిర్ణయించారు. అంతకుముందు గుడుంబా కారణంగా తలెత్తే సమస్యలను వివరిస్తున్నారు. ఇందులో చదువుకునే పిల్లలు ఉంటే వారిని బెస్ట్ అవైలబుల్ పథకం ద్వారా పాఠశాలలకు పంపిస్తున్నారు. అనంతరం ఐకేపీ, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్, కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరు చేస్తున్నారు. ఒకే గ్రామంలో గుడుంబా బాధితులు సంఖ్య ఎక్కువ ఉంటే వారిని ఒక జట్టుగా చేసి పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చేస్తున్నారు. ఎక్కువగా మేకలు, గొర్రెలు పెంపకం, పాడిపరిశ్రమ యూనిట్లు మంజూరు చేస్తున్నారు. 2016 జనవరి నుంచి రుణాల మంజూరు యూనిట్లు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు జిల్లాలో ఉపాధి కరువై గుడుంబాపై ఆధారపడిన కుటుంబాలు 3,114 ఉన్నాయని గుర్తించారు. ఇందులో తొలిదశంలో 9 మండలాల్లో 458 మందికి 1.88 కోట్ల రుణాలు మంజూరు చేశారు. ముందున్న సవాళ్లు గుడుంబా తయారీ ద్వారా వస్తున్న ఆదాయంతో పోల్చితే గొర్రెలు, మేకల పెంపకం ద్వారా వచ్చే ఆదాయం తక్కువ. దీంతో కుటుంబ అవసరాలు అరకొరగా తీరుతున్నాయి. ఇదే సమయంలో తీసుకున్న ఆర్థిక సాయానికి సంబంధించిన నెలవారీ నగదు చెల్లింపు (కిస్తీ)లు కట్టాల్సి రావడం కష్టంగా మారుతోంది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని గుడుంబా తయారీ వదిలి ప్రత్యామ్నాయ ఉపాధి వైపు మళ్లిన వారికి ఉపశమనం కలిగించే మార్గం చూపాల్సి ఉంది. పది గొర్రెలు సరిపోతలేవు గుడుంబా కాసేదాన్ని. ఎప్పుడు ఏ పోలీసోల్లు, ఎక్సైజోళ్లు వస్తరోనని భయపడేదాన్ని. దాడులు చేసేప్పుడు ఇష్టం వచ్చిన మాటలు అనేటోళ్లు. ఇప్పుడు గుడుంబా మానేసిన. ప్రభుత్వ రుణం రూ.50 వేలు, నా సొంత డబ్బు రూ.20 వేలు కలిపి 2015 డిసెంబర్లో 10 గొర్రెలు కొన్న. ఆర్నెళ్ల నుంచి పెంచుతున్నా. ఇవి అమ్మితేనే డబ్బులు వస్తరుు. కానీ లోనుకు సంబంధించి నెలనెల రూ.1500 కట్టుడు ఇబ్బందిగా ఉంది. పది గొర్రెలను మేపేందుకు వెళ్తే కనీసం కూలీ కూడా గిట్టుబాటు అరుుతలేదు. 40 గొర్రెలు ఉంటే గిట్టుబాటు అవుతుంది. రుణం రూ.2 లక్షలు ఇస్తే బాగుంటుంది. - గుగులోత్ కవిత, కొంపెల్లితండా, భూపాలపల్లి మండలం (15హెచ్‌ఎంకేడీ01) సబ్సిడీ ఇవ్వాలి గుడుంబా కాస్తే రోజుకు రూ.500 నాకు మిగిలేవి. వాటితో ఇంటి ఖర్చులన్నీ నేనే భరించేదాన్ని. ఇప్పుడు సర్కారుఇచ్చిన రూ.50 వేల రుణంతో పది గొర్రెలను కొనుక్కున్నా. అవి పెంపు కాకముందే ప్రతి నెలా రూ.1500 కిస్తీ కట్టాల్సి వస్తోంది. వీటి కోసం అప్పులు చేయాల్సి వస్తుంది. సర్కారు అందించిన పైసలకు కొంతైన మాఫీ చేస్తే బాగుండేది. ఈ ఫొటోలో ఉన్న మహిళ పేరు గుగులోత్ కవిత. భూపాలపల్లి మండలంలోని కొంపల్లితండా నివాసి. గత కొన్నేళ్ళుగా గుడుంబా తయారు చేస్తూ జీవనాన్ని సాగించేది. ప్రభుత్వం సూచన మేరకు గుడుంబా తయారీ మానేసింది. ఇందుకు ఈమెకు గొర్రెల పెంపకం కోసం ఎస్టీ సబ్‌ప్లాన్ కింద శ్రీనిధి పథకంలో భాగంగా రూ.50 వేల రుణం మంజూరు చేశారు. ఈ డబ్బులకు మరో రూ.20 వేలు కలిపి పది గొర్రెలను కొనుగోలు చేసింది. ఇప్పుడు గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగిస్తోంది.