గుడుంబాపై ఫిర్యాదులకు వాట్సప్ నంబర్
ప్రారంభించిన డిప్యూటీ సీఎం ‘కడియం’
వరంగల్ రూరల్ : జిల్లాలో గుడుంబా తయారీ, అమ్మకాలను అరికట్టడమే లక్ష్యంగా అధికార యంత్రాంగం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా గుడుంబా తయారీ, రవాణా, అమ్మకాల సమాచారాన్ని తెలుసుకునేందుకు వాట్సప్ నంబర్ 7337559597 ను ఏర్పాటుచేశారు.
గుడుంబాకు సంబంధించి ఎవరికైనా సమాచారం తెలిస్తే ఈ నంబర్‌కు వివరాలు తెలియజేయొచ్చు. ఈ మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఏ) ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన వాట్సప్ నంబర్‌ను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి గురువారం ఆవిష్కరించారు.
7337559597
Published Fri, Jan 13 2017 11:35 PM | Last Updated on Tue, Sep 5 2017 1:11 AM
Advertisement
Advertisement