కొత్త జీవితం | Alternative ways of those who have lost employment | Sakshi
Sakshi News home page

కొత్త జీవితం

Published Mon, Jul 4 2016 11:59 PM | Last Updated on Mon, Sep 4 2017 4:07 AM

Alternative ways of those who have lost employment

గుడుంబా తయూరీ మానేస్తున్న పలువురు గిరిజనులు
ఉపాధి కోల్పోరుున వారికి {పత్యామ్నాయ మార్గాలు
ఆర్నెళ్లుగా అమలవుతున్న  {పణాళిక ఆత్మగౌరవం సరే..
ఆర్థిక సాయం సరిపోతలేదంటున్న లబ్ధిదారులు

 

హన్మకొండ : గుడుంబా తయారీ, అమ్మకాలకు ప్రధానంగా ఆర్థిక వెనుకబాటు, నిరక్షరాస్యత తదితర సామాజిక అంశాలు మూల కారణాలుగా ఉన్నారుు. దీనిని గుర్తించిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. గుడుంబా తయారీదారులకు అవగాహన కల్పించడంతో పాటు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించే ప్రణాళికలు జిల్లాలో ఆర్నెళ్లుగా అమలవుతున్నాయి. దీంతో గుడుంబా తయారీదారుల జీవితాలు అంధకారం నుంచి ఆత్మగౌరవం వైపు    అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా గిరిజన గూడేలు, లంబాడి తండాలు గుడుంబా తయారీకి, వినియోగానికి ప్రధాన అడ్డాలుగా ఉన్నాయి. గుడుంబా సేవించి ప్రజలు మృత్యు ఒడికి చేరుతున్నారు,  కుటుంబాలు పెద్దదిక్కును కోల్పోతున్నారుు. సరైన ఉపాధి మార్గాలు లభించక ఎక్కువ మంది ఈ గుడుంబా తయారీ, అమ్మకాల ఊబిలోకి వెళ్తుంటే.. ఎక్కువ లాభాలు వస్తాయనే దురాశతో మరికొందరు జత కలుస్తున్నారు. ఈ సమస్య మూలాలల్లోకి వెళ్లి పరిష్కారం చూపించడంలో చాలా కాలంగా ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి అవలంభించాయి.
 

వరంగల్ వేదికగా సీఎం ప్రకటన
గుడుంబా తయారీని సంపూర్ణంగా నిషేధిస్తామని 2015 జనవరిలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వరంగల్ వేదికగా ప్రకటించారు. ఆ తర్వాత గుడుంబా తయారీదారులపై దాడులు ముమ్మరమయ్యాయి. నల్లబెల్లంపై నిషేధం, బైండోవర్లు, పీడీ యాక్టులతో తండాలు, గిరిజనగూడేలు అదిరిపోయాయి. అరుుతే, ప్రత్యామ్నాయ ఉపాధిమార్గం చూపకుండా దాడులు చేస్తే ఏటేటా కేసుల సంఖ్య పెరిగిపోతుందే తప్ప పరిష్కారం లభించడం లేదని గ్రహించారు. ప్రత్యామ్నాయ ఉపాధి చూపించడం ద్వారా గుడుంబా నిర్మూలనకు చర్యలు చేపట్టారు. జిల్లా, డివిజన్, మండలం, పంచాయతీ, గ్రామ స్థాయిలో కమిటీలు వేశారు. ఇందులో ఎక్సైజ్, పోలీసు, మహిళా స్వయం సహాయక సంఘాలు, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన సిబ్బంది సభ్యులను చేశారు.
 
 
అవగాన.. ఆర్థికసాయం

ఏక్సైజ్ శాఖ చేపడుతున్న దాడుల సందర్భంగా జీవనోపాధికి ఇతర మార్గాలు లేక గుడుంబా కోరల్లో చిక్కుకున్న వారిని గుర్తించి గుడుంబా నిర్మూలన కమిటీకి తెలియజేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రజాప్రతినిధుల ద్వారా, వ్యక్తిగతంగా కలిసిన వారినీ పరిశీలనలోకి తీసుకుంటున్నారు. వారికి ప్రత్యామ్నయ ఉపాధి కోసం దశలవారీగా ఆర్థికసాయం అందజేయాలని నిర్ణయించారు. అంతకుముందు గుడుంబా కారణంగా తలెత్తే సమస్యలను వివరిస్తున్నారు. ఇందులో  చదువుకునే పిల్లలు ఉంటే వారిని బెస్ట్ అవైలబుల్ పథకం ద్వారా పాఠశాలలకు పంపిస్తున్నారు. అనంతరం ఐకేపీ, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్, కార్పొరేషన్‌ల ద్వారా రుణాలు మంజూరు చేస్తున్నారు. ఒకే గ్రామంలో గుడుంబా బాధితులు సంఖ్య ఎక్కువ ఉంటే వారిని ఒక జట్టుగా చేసి పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చేస్తున్నారు. ఎక్కువగా మేకలు, గొర్రెలు పెంపకం,  పాడిపరిశ్రమ యూనిట్లు మంజూరు చేస్తున్నారు. 2016 జనవరి నుంచి రుణాల మంజూరు యూనిట్లు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు జిల్లాలో ఉపాధి కరువై గుడుంబాపై ఆధారపడిన కుటుంబాలు 3,114 ఉన్నాయని గుర్తించారు. ఇందులో తొలిదశంలో 9 మండలాల్లో 458 మందికి 1.88 కోట్ల రుణాలు మంజూరు చేశారు.
 
ముందున్న సవాళ్లు
గుడుంబా తయారీ ద్వారా వస్తున్న ఆదాయంతో పోల్చితే గొర్రెలు, మేకల పెంపకం ద్వారా వచ్చే ఆదాయం తక్కువ. దీంతో కుటుంబ అవసరాలు అరకొరగా తీరుతున్నాయి. ఇదే సమయంలో తీసుకున్న ఆర్థిక సాయానికి సంబంధించిన నెలవారీ నగదు చెల్లింపు (కిస్తీ)లు కట్టాల్సి రావడం కష్టంగా మారుతోంది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని గుడుంబా తయారీ వదిలి ప్రత్యామ్నాయ ఉపాధి వైపు మళ్లిన వారికి ఉపశమనం కలిగించే మార్గం చూపాల్సి ఉంది.
 
 పది గొర్రెలు సరిపోతలేవు
 గుడుంబా కాసేదాన్ని. ఎప్పుడు ఏ పోలీసోల్లు, ఎక్సైజోళ్లు వస్తరోనని భయపడేదాన్ని. దాడులు చేసేప్పుడు ఇష్టం వచ్చిన మాటలు అనేటోళ్లు. ఇప్పుడు గుడుంబా మానేసిన. ప్రభుత్వ రుణం రూ.50 వేలు, నా సొంత డబ్బు రూ.20 వేలు కలిపి 2015 డిసెంబర్‌లో 10 గొర్రెలు కొన్న. ఆర్నెళ్ల నుంచి పెంచుతున్నా. ఇవి అమ్మితేనే డబ్బులు వస్తరుు. కానీ లోనుకు సంబంధించి నెలనెల రూ.1500 కట్టుడు ఇబ్బందిగా ఉంది. పది గొర్రెలను మేపేందుకు వెళ్తే కనీసం కూలీ కూడా గిట్టుబాటు అరుుతలేదు.  40 గొర్రెలు ఉంటే గిట్టుబాటు అవుతుంది. రుణం రూ.2 లక్షలు ఇస్తే బాగుంటుంది.  - గుగులోత్ కవిత,  కొంపెల్లితండా, భూపాలపల్లి మండలం (15హెచ్‌ఎంకేడీ01)
 

సబ్సిడీ ఇవ్వాలి
గుడుంబా కాస్తే రోజుకు రూ.500 నాకు మిగిలేవి. వాటితో ఇంటి ఖర్చులన్నీ నేనే భరించేదాన్ని. ఇప్పుడు సర్కారుఇచ్చిన రూ.50 వేల రుణంతో పది గొర్రెలను కొనుక్కున్నా. అవి పెంపు కాకముందే ప్రతి నెలా రూ.1500 కిస్తీ కట్టాల్సి వస్తోంది. వీటి కోసం అప్పులు చేయాల్సి వస్తుంది. సర్కారు అందించిన పైసలకు కొంతైన మాఫీ చేస్తే బాగుండేది.  
 
 
 
 
ఈ ఫొటోలో ఉన్న మహిళ పేరు

గుగులోత్ కవిత. భూపాలపల్లి మండలంలోని కొంపల్లితండా నివాసి. గత కొన్నేళ్ళుగా గుడుంబా తయారు చేస్తూ జీవనాన్ని సాగించేది. ప్రభుత్వం సూచన మేరకు గుడుంబా తయారీ మానేసింది. ఇందుకు ఈమెకు గొర్రెల పెంపకం కోసం ఎస్టీ సబ్‌ప్లాన్ కింద శ్రీనిధి పథకంలో భాగంగా రూ.50 వేల రుణం మంజూరు చేశారు. ఈ డబ్బులకు మరో రూ.20 వేలు కలిపి పది గొర్రెలను కొనుగోలు చేసింది. ఇప్పుడు గొర్రెలు మేపుకుంటూ జీవనం  సాగిస్తోంది.  
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement