Guizhou
-
గ్రహాంతర అన్వేషణ సాధనం
ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోనే అతి పెద్ద సింగిల్ అపెర్చర్ రేడియో టెలిస్కోప్. చైనాలోని గుయిఝౌలో ఏర్పాటు చేశారు దీనిని. దీని వ్యాసం ఐదువందల మీటర్లు. అందుకే దీనిని ‘ఫైవ్హండ్రడ్ మీటర్ స్ఫెరికల్ టెలిస్కోప్’ (ఫాస్ట్) అని కూడా పిలుచుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇది పనిచేయడం ప్రారంభించింది. అయితే, రేడియో తరంగాల అంతరాయాలు ఏర్పడటంతో, వాటిని తొలగించేందుకు దీని పనిని శాస్త్రవేత్తలు నిలిపివేశారు. (పాపం కుక్కతో అంట్లు తోమిస్తున్నారు) సాంకేతిక ఇబ్బందులు తొలగిన తర్వాత తిరిగి ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి పని చేయనుంది. గ్రహాంతర అన్వేషణలో ఇది మిగిలిన టెలిస్కోప్‌ల కంటే అద్భుతంగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి సుదూర ప్రాంతాల నుంచి నేరోబ్యాండ్ సిగ్నల్స్ అందుతున్నాయని, బహుశ అవి గ్రహాంతరవాసులకు చెందినవే కావచ్చని భావిస్తున్నామని ఈ టెలిస్కోప్ ప్రాజెక్టులో కీలక ప్రాత పోషించిన బీజింగ్ నార్మల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఝాంగ్ టోంగ్జీ చెబుతున్నారు. (బీజింగ్‌లో మళ్లీ కరోనా కాటు) -
ఆహా! బుడ్డోడి తెలివి
-
ఎగ్జామ్‌కు ముందు 'బ్రిలియంట్' ఐడియా!
బీజింగ్: ఎగ్జామ్స్ వస్తున్నాయంటే చాలు.. ఏడాది ముందే కొనుక్కుని, పేజీ నలగనివ్వకుండా భద్రంగా దాచిపెట్టుకున్న పుస్తకాలను ఓ గ్రంథంలా ముందుకేసుకుంటారు. ఇన్నేసి గంటలు చదువుకోవాలి అంటూ టైం టేబుల్ కూడా రాసుకుంటారు. కానీ దాన్ని పాటించేది ఏ కొద్దిమందో. మరికొందరి విషయానికొస్తే.. ఎగ్జామ్ అనగానే దెబ్బకు దేవుడు గుర్తొస్తాడు. ఇక ఇంకో రకం.. పడుకునేముందు పుస్తకం తల కింద పెట్టుకుంటే అందులో ఉన్నదంతా ఎలాంటి ట్రాఫిక్ లేకుండా నేరుగా బుర్రలోకెక్కుతుందని వారి అభిప్రాయం. ఇక్కడ చెప్పుకునే బుడ్డోడు కూడా ఈ చివరి కోవకు చెందిన వాడే. (ఛోటా భీమ్-ఇందుమతి పెళ్లి: నిజమేనా?) మరికాసేపట్లో పరీక్ష జరుగుతుందనగా ముఖ్యమైన ప్రశ్నలను చదవడం మాని ఓ బ్రిలియంట్ ఐడియా వేశాడు. పుస్తకం తీసి అందులోని సారాంశం అంతటినీ చేతితో బుర్రలో వేసుకుంటున్నాడు. ఇలా ఒక్కో పేజీ తెరుస్తూ.. దీక్షగా దాన్ని చేతులతో తలలోకి ఎక్కించుకున్నాడు. అవనీష్ శరన్ అనే వ్యక్తి ఈ వీడియోను ట్విటర్లో షేర్ చేయగా తెగ వైరలవుతోంది. "అవును, చిన్నప్పుడు నేనిలాగే చేశాను", "నా జీవితం ఇప్పటికీ ఇలాగే సాగుతోంది" అంటూ నెటిజన్లు ఆ సన్నివేశాన్ని తమ జీవితానికి ఆపాదించుకుంటున్నారు. చైనాలోని ఓ స్కూల్లో క్విజ్ పోటీలకు ముందు ఈ వీడియో చిత్రీకరించారు. (బీరు గుటగుటా తాగిన చేప: మంచిదేనా?) -
12 నిండు ప్రాణాలు.. 14 గంటల పోరాటం
-
12 నిండు ప్రాణాలు.. 14 గంటల పోరాటం
బీజింగ్: తక్కువ సమయంలో అధ్బుత నిర్మాణాలు చేపట్టడంలో చైనీయులది అందెవేసిన చెయ్యి. అదే సమయంలో పని ప్రదేశాల్లో కార్మికులు ఎక్కువగా చనిపోయే దేశం కూడా చైనాయే. అక్కడే ఏటా సగటున 66 వేల మంది కార్మికులు పని ప్రదేశంలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి కొనసాగింపు అన్నట్లు.. నిర్మాణంలో ఉన్న ఓ రైల్వే టన్నెట్ పేలిపోవడంతో 12 మంది కార్మికులు మరణించారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. నైరుతి చైనాలోని గిజావు ఫ్రావిన్స్ లో మంగళవారం చోటుచేసుకుందీ ఘటన. భారీ టన్నెల్ ఒక్కసారిగా పేలిపోవడంతో అక్కడ పనిచేస్తోన్న కార్మికులు నిర్మాణ శిధిలాల కింద చిక్కుకుపోయారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే సుమారు 2వేల మంది సహాయక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. 14 గంటల పోరాటం తర్వాత మొత్తం 12 మృతదేహాలను వెలికితీయగలిగారు. ప్రమాదం ఎలా జరిగిందనే కారణం తెలియాల్సిఉందని, దర్యాప్తు కొనసాగిస్తామని అధికారులు తెలిపారు. స్వల్ప వ్యవధిలోనే చైనా సుమారు 17 వేల కిలోమీటర్ల హైస్పీడ్ రైల్వే ట్రాక్ నిర్మించిన సంగతి తెలిసిందే.