బీజింగ్: ఎగ్జామ్స్ వస్తున్నాయంటే చాలు.. ఏడాది ముందే కొనుక్కుని, పేజీ నలగనివ్వకుండా భద్రంగా దాచిపెట్టుకున్న పుస్తకాలను ఓ గ్రంథంలా ముందుకేసుకుంటారు. ఇన్నేసి గంటలు చదువుకోవాలి అంటూ టైం టేబుల్ కూడా రాసుకుంటారు. కానీ దాన్ని పాటించేది ఏ కొద్దిమందో. మరికొందరి విషయానికొస్తే.. ఎగ్జామ్ అనగానే దెబ్బకు దేవుడు గుర్తొస్తాడు. ఇక ఇంకో రకం.. పడుకునేముందు పుస్తకం తల కింద పెట్టుకుంటే అందులో ఉన్నదంతా ఎలాంటి ట్రాఫిక్ లేకుండా నేరుగా బుర్రలోకెక్కుతుందని వారి అభిప్రాయం. ఇక్కడ చెప్పుకునే బుడ్డోడు కూడా ఈ చివరి కోవకు చెందిన వాడే. (ఛోటా భీమ్-ఇందుమతి పెళ్లి: నిజమేనా?)
మరికాసేపట్లో పరీక్ష జరుగుతుందనగా ముఖ్యమైన ప్రశ్నలను చదవడం మాని ఓ బ్రిలియంట్ ఐడియా వేశాడు. పుస్తకం తీసి అందులోని సారాంశం అంతటినీ చేతితో బుర్రలో వేసుకుంటున్నాడు. ఇలా ఒక్కో పేజీ తెరుస్తూ.. దీక్షగా దాన్ని చేతులతో తలలోకి ఎక్కించుకున్నాడు. అవనీష్ శరన్ అనే వ్యక్తి ఈ వీడియోను ట్విటర్‌లో షేర్ చేయగా తెగ వైరలవుతోంది. "అవును, చిన్నప్పుడు నేనిలాగే చేశాను", "నా జీవితం ఇప్పటికీ ఇలాగే సాగుతోంది" అంటూ నెటిజన్లు ఆ సన్నివేశాన్ని తమ జీవితానికి ఆపాదించుకుంటున్నారు. చైనాలోని ఓ స్కూల్‌లో క్విజ్ పోటీలకు ముందు ఈ వీడియో చిత్రీకరించారు. (బీరు గుటగుటా తాగిన చేప: మంచిదేనా?)
Comments
Please login to add a commentAdd a comment