ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోనే అతి పెద్ద సింగిల్ అపెర్చర్ రేడియో టెలిస్కోప్. చైనాలోని గుయిఝౌలో ఏర్పాటు చేశారు దీనిని. దీని వ్యాసం ఐదువందల మీటర్లు. అందుకే దీనిని ‘ఫైవ్‌హండ్రడ్ మీటర్ స్ఫెరికల్ టెలిస్కోప్’ (ఫాస్ట్) అని కూడా పిలుచుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇది పనిచేయడం ప్రారంభించింది. అయితే, రేడియో తరంగాల అంతరాయాలు ఏర్పడటంతో, వాటిని తొలగించేందుకు దీని పనిని శాస్త్రవేత్తలు నిలిపివేశారు. (పాపం కుక్కతో అంట్లు తోమిస్తున్నారు)
సాంకేతిక ఇబ్బందులు తొలగిన తర్వాత తిరిగి ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి పని చేయనుంది. గ్రహాంతర అన్వేషణలో ఇది మిగిలిన టెలిస్కోప్‌ల కంటే అద్భుతంగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి సుదూర ప్రాంతాల నుంచి నేరోబ్యాండ్ సిగ్నల్స్ అందుతున్నాయని, బహుశ అవి గ్రహాంతరవాసులకు చెందినవే కావచ్చని భావిస్తున్నామని ఈ టెలిస్కోప్ ప్రాజెక్టులో కీలక ప్రాత పోషించిన బీజింగ్ నార్మల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఝాంగ్ టోంగ్జీ చెబుతున్నారు. (బీజింగ్‌లో మళ్లీ కరోనా కాటు)
Comments
Please login to add a commentAdd a comment