‘కాబూల్ కసాయి’ హెక్మత్యార్కు ఊరట
ఐక్యరాజ్యసమితి: అఫ్గానిస్తాన్ మాజీ ప్రధాని, మిలటరీ కమాండర్ గుల్బుద్దీన్ హెక్మత్యార్కు ఐరాస భద్రతామండలి ఊరటనిచ్చింది. అతని పేరును ఉగ్రవాదుల జాబితా నుంచి తొలగించడమే కాకుండా.. సీజ్ చేసిన అతని ఆస్తులకు విముక్తి కలిగింది, ప్రయాణాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది.
భారత్కు వ్యతిరేకి అయిన హెక్మత్యార్కు ‘కాబూల్ కసాయి’ అనే పేరుంది. పాకిస్థాన్ గూడఛారి సంస్థ ఐఎస్ఐతో హెక్మత్యార్కు సన్నిహిత సంబంధాలు ఉండేవి. 1997 నుంచి అతను పాకిస్థాన్ లోనే నివసిస్తున్నాడు. 1992–96 మధ్య పౌర యుద్ధంలో వేలాది మందిని చంపించాడు. గుల్బుద్దీన్ పై ఆంక్షలు ఎత్తివేయడాన్ని రష్యా వ్యతిరేకించింది. రెండు దశాబద్దాల ప్రవాసం తర్వాత అతడు కాబూల్ కు తిరిగి రానున్నాడు.