guljar
-
పాకిస్థాన్ సమాధానం పైనే అతని భవిష్యత్
సాక్షి, సిటీబ్యూరో: దుబాయ్‌లో ఉండగా మిస్డ్‌కాల్ ద్వారా పరిచయమైన కర్నూలు మహిళ కోసం అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చి, గత నెలలో నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులకు చిక్కిన గుల్జార్ ఖాన్ పాకిస్థానీ అని అధికారికంగా నిర్ధారించడానికి పోలీసు విభాగం ప్రయత్నాలు ప్రారంభించింది. దీనికోసం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) ద్వారా దౌత్య కార్యాలయాన్ని సంప్రదించడానికి సన్నాహాలు చేస్తోంది. గుల్జార్ వ్యవహారంపై పాకిస్థాన్ నుంచి వచ్చే సమాధానం ఆధారంగానే తదుపరి చర్యలు చేపట్టాలని సిట్ అధికారులు నిర్ణయించారు. ఇదీ జరిగింది.. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావెన్సీలో ఉన్న కుల్వాల్ ప్రాంతానికి చెందిన గుల్జార్ ఖాన్ ఆర్థికంగా స్థిరపడిన కుటుంబానికి చెందిన వాడు. ఇతడు 2004లో కొన్నాళ్ల పాటు దుబాయ్‌లో నివసించాడు. ఆ సమయంలో ఓ రోజు తనకు పొరపాటుగా వచ్చిన మిస్డ్ కాల్‌కు స్పందించి కాల్ బ్యాక్ చేశాడు. ఈ కాల్‌ను కర్నూలు జిల్లా గడివేములకు చెందిన దౌలత్‌బీ అందుకోవడంతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. వివాహిత అయిన దౌలత్‌బీ భర్త కొన్నాళ్ల క్రితం అనారోగ్యంతో మరణించారు. వీరిద్దరి నడుమ ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. దీంతో ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న గుల్జార్ 2008లో సౌదీ మీదుగా ఇక్కడకు చేరుకున్నాడు. ఇన్నేళ్లు తన భార్యాపిల్లలతో కలిసి గడివేములలో నివసించిన గుల్జార్‌కు కొన్నాళ్ల క్రితం టీబీ వ్యాధి సోకింది. దీంతో పెయింటింగ్ పని చేయలేకపోతున్న ఇతగాడు తన స్వదేశానికి వెళ్లిపోవాలనుకున్నాడు. దీనికోసం తనతో పాటు భార్య, పిల్లలకు విజయవాడ పాస్‌పోర్ట్ కార్యాలయం నుంచి పాస్పోర్ట్స్ పొందాడు. పాక్‌తో పాటు దుబాయ్‌లో ఉన్న తన కుటుంబీకులతో సంప్రదింపులు జరిపాడు. పంజాబ్‌లో ఏర్పాటైన కర్తార్‌పూర్ కారిడార్ మీదుగా అడ్డదారిలో రావాలని సోదరుడు షాజీద్ సలహా ఇచ్చాడు. దీంతో ఢిల్లీ మీదుగా కర్తార్‌పూర్ చేయడానికి కర్నూలు నుంచి రైలులో గత నెల్లో సిట్ పోలీసులకు చిక్కాడు. సిట్ పోలీసులు ఇతడిని అరెస్టు చేసినప్పుడు గడివేముల చిరునామాతో తీసుకున్న ఆధార్ కార్డు, ఓటర్ ఐడీలతో పాటు పాస్‌పోర్ట్ కూడా స్వాధీనం చేసుకున్నారు. మరోపక్క ఇతడు సౌదీలో ఉండగానే తన పాకిస్థానీ గుర్తింపుల్ని ధ్వంసం చేసి హరిద్వార్ నుంచి హజ్ యాత్ర వచ్చి పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నానంటూ భారత్ రాయబార కార్యాలయాన్ని సంప్రదించాడు. గుల్జార్‌ను భారతీయుడిగానే భావించిన ఆ అధికారులు ఎమర్జెన్సీ సర్టిఫికెట్ (ఈసీ) జారీ చేసి ఇక్కడకు పంపారు. ఈ నేపథ్యంలో గల్జార్ గడివేముల నుంచి తీసుకున్న గుర్తింపుకార్డులు అక్రమం అని నిర్ధారించాలంటే తొలుత అతడు పాకిస్థానీ అని తేల్చాల్సి ఉంటుంది. వాస్తవానికి గుల్జార్ కొన్నాళ్ల పాటు పాకిస్థాన్ పాస్‌పోర్ట్‌తో దుబాయ్, సౌదీల్లో ఉన్నాడు. ఈ విషయాన్ని పాక్ ధ్రువీకరిస్తేనే బోగస్ వ్యవహారం, అతడు ఇక్కడ నివసించడం అక్రమం అనేది నిర్ధారణ సాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలో సిట్ పోలీసులు ఎంహెచ్ఏ ద్వారా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టెర్నల్ అఫైర్స్‌కు (ఎంఈఏ) లేఖ రాస్తున్నారు. ఇది ఎంఈఏ నుంచి పాకిస్థాన్ రాయబార కార్యాలయానికి చేరుతుంది. ఆ తర్వాత గుల్జార్ తమ పౌరుడు కాదంటూ పాక్ జవాబు ఇస్తే... అసలు ఈ కేసు నిలబడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై సమాధానం వచ్చిన తర్వాతే కేసులో ఎలా ముందుకు వెళ్ళాలన్నది నిర్ణయించనున్నారు. -
గుల్జార్ ఖాన్ @గూగుల్ వాయిస్!
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళను ప్రేమించి భారత్‌లోకి దొడ్డిదారిన అడుగు పెట్టిన పాకిస్తానీ గుల్జార్ ఖాన్ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పాకిస్తాన్లో పుట్టి పెరిగి దుబాయ్‌లో ఉద్యోగం చేస్తూ.. ఫోన్ ద్వారా పరిచయమైన ఆమె కోసం కర్నూలు చేరుకుని.. పదకొండేళ్ల తర్వాత సొంత గడ్డపై మమకారంతో కుటుంబంతో సహా తిరిగి వెళ్లాలని ప్రయాణమైన ఇతడిని ఇటీవల నగరంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. సిట్ అధికారుల విచారణలో గుల్జార్ పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పినట్టు సమాచారం. సాక్షి, హైదరాబాద్: పాకిస్తాన్లో పుట్టి పెరిగి దుబాయ్‌లో ఉద్యోగం చేస్తూ.. ఫోన్ ద్వారా పరిచయమైన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళ కోసం దొడ్డిదారిన దేశంలోకి అడుగు పెట్టాడు. అయితే పదకొండేళ్ల తర్వాత సొంత గడ్డపై మమకారంతో కుటుంబంతో సహా తిరిగి వెళ్లాలని భావించాడు. పాక్‌లోని సియాల్కోట్ జిల్లాలో ఉన్న తన పరివారాన్ని పట్టుకోవడానికి గూగుల్ వాయిస్‌ను వినియోగించాడు. కర్తార్‌పూర్ కారిడార్ మీదుగా ఆ దేశానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తూ గత నెలలో హైదరాబాద్‌లో పోలీసులకు చిక్కాడు. పాకిస్తానీ షేక్ గుల్జార్ ఖాన్ వ్యవహారమిదీ. అతడిని కస్టడీలోకి తీసుకున్న సిట్ అధికారులు వివిధ కోణాల్లో విచారించగా ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. హరిద్వార్ వాసిగా భారత్‌కు.. పాకిస్తాన్‌లోని కుల్వాల్ ప్రాంతానికి చెందిన గుల్జార్ ఖాన్ 2004లో దుబాయ్‌లో నివాసం ఉండేవాడు. ఆ సమయంలో ఓ రోజు తనకు పొరపాటుగా వచ్చిన మిస్డ్ కాల్‌కు స్పందించి కాల్ బ్యాక్ చేశాడు. అలా కర్నూలు జిల్లా గడివేములకు చెందిన దౌలత్‌బీతో పరిచయం ఏర్పడింది. అప్పటికే దౌలత్‌కు వివాహం కాగా.. భర్త అనారోగ్యంతో చనిపోయాడు. దౌలత్తోపరిచయం ప్రేమకు దారి తీయడంతో గుల్జాన్ భారత్‌కు వచ్చేందుకు 2008లో సౌదీ వెళ్లాడు. తాను హరిద్వార్ నుంచి హజ్ యాత్రకు వచ్చానని, తన పాస్‌పోర్ట్ సహా డాక్యుమెంట్లు పోయాయని అక్కడి ఎంబసీలో ఫిర్యాదు చేశాడు. గుల్జార్‌కు ఎమర్జెన్సీ సర్టిఫికెట్ (ఈసీ) జారీ చేసిన అధికారులు విమానంలో ముంబైకి పంపారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చిన అతగాడు దౌలత్‌బీని వెతుక్కుంటూ కర్నూలు మీదుగా గడివేముల చేరుకున్నాడు.ఆమెను కలుసుకున్న గుల్జార్ వివాహం చేసుకోవడంతోపాటు పెయింటర్‌గా అక్కడే స్థిరపడ్డాడు. తాను భారతీయుడినే అంటూ ఆధార్, ఓటర్ ఐడీ తదితరాలను పొందాడు. ప్రస్తుతం గుల్జార్–దౌలత్లకు నలుగురు సంతానం. కుమారుడి సలహాతో.. కుల్వాల్లో నివసిస్తున్న గుల్జార్ కుటుంబం ఆర్థికంగా స్థిరపడిందే. ఇతడి ఇద్దరు సోదరీమణులు వైద్యులుగా పనిచేస్తున్నారు. భార్యాపిల్లలతో గడివేములలో ఉంటున్న గుల్జార్‌కు టీబీ సోకింది. దీంతో ఏ పనిచేయలేకపోతున్న అతను స్వదేశానికి వెళ్లిపోయి కుటుంబంతో కలిసి బతకాలనుకున్నాడు. ఈ నేపథ్యంలో అతడి కుమారుడు గూగుల్ వాయిస్ విషయం చెప్పాడు. తాను టీవీలో ఒక వాణిజ్య ప్రకటన చూశానని, అందులో గూగుల్ వాయిస్ వాడే విధానం ఉందని వివరించాడు. దీంతో ఓ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసిన గుల్జార్ గూగుల్ వాయిస్‌లో తన ఊరు పేరు చెప్పాడు. సియాల్కోట్లోని కుల్వాల్ వివరాలు చూపించిన గూగుల్.. అక్కడి ఓ వస్త్రదుకాణం బోర్డును చూపించింది. ఆ బోర్డుపై ఉన్న ఫోన్ నంబర్‌ను సంప్రదించిన గుల్జార్ తనతోపాటు కుటుంబం వివరాలు చెప్పి, తన తల్లి షరీఫాబీతో మాట్లాడించాలని కోరుతూ వారికి తన నంబర్ ఇచ్చాడు. అనంతరం వీరి మధ్య సంప్రదింపులు మొదలయ్యాయి. కర్తార్‌పూర్ మీదుగా వెళ్దామని.. భారత్ నుంచి పాస్‌పోర్ట్, వీసాతో పాకిస్తాన్‌కు వచ్చి ఉండిపోవడం కష్టమని, దీని కంటే పంజాబ్‌లోని కర్తార్‌పూర్ కారిడార్ మీదుగా అడ్డదారిలో రావాలని సోదరుడు షాజీద్ సలహా ఇచ్చాడు. దీంతో ఢిల్లీ మీదుగా కర్తార్‌పూర్ వెళ్లేందుకు కర్నూలు నుంచి రైలులో గత నెలలో కుటుంబంతో సహా హైదరాబాద్ వచ్చాడు. అప్పటికే ఇతడి వ్యవహారాన్ని కేంద్ర నిఘా వర్గాలు గుర్తించి హైదరాబాద్ సిట్ పోలీసులకు సమాచారం అందించాయి. దీంతో సిట్ బృందం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద వీరిని పట్టుకుంది. గుల్జార్‌ను అరెస్టు చేసిన పోలీసులు దౌలత్‌బీ తదితరులను విడిచిపెట్టారు. కోర్టు అనుమతితో గుల్జార్‌ను ఇటీవల కస్టడీలోకి తీసుకున్నసిట్ పోలీసులు అతడిని వివిధ కోణాల్లో విచారించారు. సిటీ నుంచి కర్నూలు తీసుకెళ్లి పలు రికార్డులు స్వాధీనం చేసుకుని వచ్చారు. ఇతడి నుంచి గడివేములలో తీసుకున్న గుర్తింపుకార్డులు, పాస్‌పోర్ట్ స్వాధీనం చేసుకున్నారు. -
ప్రేమ కోసమై పాక్‌ను వదిలి..
సాక్షి, హైదరాబాద్ : అతని పేరు షేక్ గుల్జార్ ఖాన్... పాకిస్తాన్‌కు చెందిన ఇతను దుబాయ్‌లో ఉండగా మిస్డ్‌కాల్ ద్వారా కర్నూలు జిల్లాకు చెందిన మహిళతో పరిచయం ఏర్పడింది. భర్తను కోల్పోయిన ఆమెతో గుల్జార్ ప్రేమలో పడ్డాడు. ఆమె కోసం సౌదీ మీదుగా నకిలీ గుర్తింపుతో భారత్‌కు వచ్చాడు. అనారోగ్యం పాలుకావడంతో మళ్లీ సొంత గడ్డపై మమకారం ఏర్పడటంతో కుటుంబంతో సహా అక్కడికి వెళ్లిపోవాలని భావించాడు. తన సోదరుడి సలహా మేరకు కర్తార్‌పూర్ కారిడార్ మార్గంలో వెళ్లాలని ప్రయతి్నంచాడు. హైదరాబాద్ చేరుకున్న అతడిని సీసీఎస్ అధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గుల్జార్‌ను కోర్టు అనుమతితో పోలీసు కస్టడీలోకి తీసుకునేందుకు సిట్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. 2004లో గడివేముల మహిళతో పరిచయం.. పాకిస్థాన్, పంజాబ్ ప్రావిన్స్‌లోని కుల్వాల్ ప్రాంతానికి చెందిన గుల్జార్ ఖాన్ ఆరి్థకంగా స్థితిమంతుడు. ఇతను 2004లో కొన్నాళ్ల పాటు దుబాయ్‌లో నివసించాడు. ఆ సమయంలో ఓ రోజు తనకు పొరపాటుగా వచి్చన మిస్డ్ కాల్‌కు స్పందించి కాల్ బ్యాక్ చేశాడు. ఈ కాల్‌ను కర్నూలు జిల్లా, గడివేములకు చెందిన దౌతల్‌బీ అందుకోవడంతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. వివాహిత అయిన దౌతల్ భర్త అంతకు కొద్ది రోజుల ముందే అనారోగ్యంతో మృతి చెందాడు. వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. దీంతో ఆమెను వివాహం చేసుకోవాలని భావించిన గుల్జార్ భారత్‌కు వచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. సౌదీ వెళ్లి హజ్ పేరు చెప్పి.. పాకిస్థాన్ నుంచి నేరుగా భారత్ చేరుకోవడానికి ఇబ్బందులు ఉంటాయని భావించిన గుల్జార్ 2008లో సౌదీ వెళ్లాడు. అక్కడ తన పాకిస్తానీ గుర్తింపులను ధ్వంసం చేసిన అతను భారత ఎంబసీని ఆశ్రయించాడు. తాను హరిద్వార్ నుంచి హజ్ యాత్రకు వచ్చానని, పాస్‌పోర్ట్ సహా డాక్యుమెంట్లు పోయాయని ఫిర్యాదు చేశాడు. గుల్జార్‌కు ఎమర్జెన్సీ సర్టిఫికెట్ (ఈసీ) జారీ చేసిన అధికారులు విమానంలో ముంబైకి పంపారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చిన అతను దౌతల్‌బీని వెతుక్కుంటూ కర్నూలు మీదుగా గడివేముల చేరుకున్నాడు. ఆమెను వివాహం చేసుకున్న గుల్జార్ పెయింటర్‌గా అక్కడే స్థిరపడ్డాడు. తాను భారతీయుడినే అంటూ ఆధార్‌కార్డు, ఓటర్ ఐడీ తదితరాలను పొందాడు. ప్రస్తుతం గుల్జార్–దౌతల్ దంపతులకు నలుగురు సంతానం. అనారోగ్యానికి గురికావడంతో.. ఇన్నేళ్లు భార్యపిల్లలతో కలిసి గడివేములలో నివసించిన గుల్జార్‌కు ఇటీవల టీబీ వ్యాధి సోకింది. దీంతో పెయిటింగ్ పని చేయలేకపోతున్న అతను తన స్వదేశానికి వెళ్లిపోవాలని భావించాడు. ఈ నేపథ్యంలో తనతో పాటు భార్య, పిల్లలకు విజయవాడ పాస్‌పోర్ట్ కార్యాలయం నుంచి పాస్‌పోర్టులు తీసుకున్నాడు. పాక్‌తో పాటు దుబాయ్‌లో ఉన్న తన కుటుంబీకులతో సంప్రదింపులు జరిపాడు. భారత్ నుంచి పాస్‌పోర్ట్, వీసాతో పాకిస్తాన్‌కు వచ్చి ఉండిపోవడం కష్టమని, దీనికంటే పంజాబ్‌లో ఏర్పాటైన కర్తార్‌పూర్ కారిడార్ మీదుగా అడ్డదారిలో రావాలని సోదరుడు షాజీద్ సలహా ఇచ్చాడు. దీంతో ఢిల్లీ మీదుగా కర్తార్‌పూర్ వెళ్లేందుకు గత బుధవారం కర్నూలు నుంచి రైలులో హైదరాబాద్ చేరుకున్నాడు. అప్పటికే ఇతడి వ్యవహారాన్ని కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. సికింద్రాబాద్‌లో పట్టుకున్న సిట్.. ఈ విషయంపై కేంద్ర నిఘా వర్గాలు హైదరాబాద్ సిట్ పోలీసులకు సమాచారం అందించడంతో అప్రమత్తమైన సిట్ ఏసీపీ బి.శ్రీనివాసరావు నేతృత్వంలో ఏఎస్సై ఎం.వెంకటేశ్వర్లు తదితరులతో కూడిన బృందం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద కాపుకాసింది. అల్ఫా హోటల్ వద్ద వీరిని అదుపులోకి తీసుకున్న అధికారులు కుటుంబాన్ని విడిచిపెట్టి గుల్జార్‌ను అరెస్టు చేశారు. అతడి నుంచి భారత్‌లో తీసుకుని గుర్తింపుకార్డులు, పాస్‌పోర్ట్ స్వాదీనం చేసుకున్నారు. నిందితుడిపై ఐపీసీతో పాటు పాస్‌పోర్ట్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గుల్జార్ వ్యవహారాన్ని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని సిటీ పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. -
టీటీడీ ఈవో గోపాల్ బదిలీ..
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్‌లకు స్థానచలనం కలిగింది. రాష్ట్రప్రభుత్వం ఈమేరకు గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో గోపాల్ బదిలీ అయ్యారు. గోపాల్ స్థానంలో డి.సాంబశివరావు నియమితులయ్యారు. మున్సిపల్ పరిపాలనాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఎ. గిరిధర్, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ కార్యదర్శిగా అజయ్ జైన్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌గా సునీతకు అదనపు బాధ్యతలు అప్పగించగా, గుల్జార్, ఎంజీ గోపాల్‌కు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. సాధారణ పరిపాలనా శాఖను సంప్రదించాలని వారికి ఆదేశాలు అందాయి. కాగా గుల్జార్ ఇప్పటికే కేంద్ర సర్వీసులకు ఎంపిక అయ్యారు.