Gummadi Lakshminarayana
-
ఆదివాసీ కళకు ఆయువు పోసినవాడు!
ఆదివాసీ ‘గుస్సాడి’ నృత్యాన్ని అంతర్జాతీయ సమాజానికి పరిచయం చేసిన కనకరాజు ‘అంతర్జాతీయ కళాకారుల దినోత్సవం’ (అక్టోబర్ 25) నాడు తుది శ్వాస విడిచారు. ఈ సందర్భంగా పద్మశ్రీ అవార్డు గ్రహించి మొత్తం తెలంగాణ ఆదివాసీలకు గర్వకారణమైన ఆయన సేవలను ఒకసారి మననం చేసుకోవడం మన విధి. కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని మార్ల వాయి గ్రామానికి చెందిన కనకరాజు 1941లో జన్మించారు. చిన్నతనం నుంచే ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు అంటే మక్కువ. ఆ క్రమంలోనే గుస్సాడి నృత్యకళపై అభిరుచిని పెంచుకున్నారు. పశువులను మేపడానికి అడవిలోకి పోయిన సందర్భంలో భుజం మీద కట్టెపుల్లను పెట్టుకొని టిక్కుటిక్కుమని శబ్దం చేసుకుంటూ తనే స్వతహాగా గుస్సాడి సాధన చేసేవారు. నిరక్షరాస్యుడైన కనకరాజు బతుకుదెరువు కోసం మార్లవాయి గిరిజన ఆశ్రమ పాఠశాలలో దినసరి కూలీగా పనిచేస్తూనే... ఊరూరా తిరు గుతూ గుస్సాడి నృత్యాన్ని ప్రదర్శించారు. అంత రించిపోతున్న కళను బతికించారు. ఏటా దీపావళికి వారం రోజుల ముందు నుండే గోండు ప్రాంతా లలో దండారి పండుగ మొదలవుతుంది. ఈ పండుగ వారికి చాలా పవిత్రం. గ్రామదేవతల శుభప్రద ఆశీస్సులను ఇతర గ్రామస్థులకు అందించే ధన్యజీవులు గుస్సాడీలు. వారు పొలికేక పెట్టి నాట్యం ఆపిన అనంతరమే వచ్చినవారికి ఆహ్వానాలు, పలకరింపులు మొదలవుతాయి. గుస్సాడీల చేతులలోని రోకళ్లను శంభు మహా దేవుని త్రిశూలంగా భావించి అభిషేకం చేస్తారు. గుస్సాడీలను శివుని ప్రతిరూపాలుగా భావించి వారి వస్తువులు, సంగీత పరిక రాలను (ఎత్మసూర్ పెన్) పూజిస్తారు. అందరూ కలసి గుస్సాడి నృత్యం చేస్తారు. తరువాత అతిథులకు భోజనం వడ్డిస్తారు. దండారీలో గుస్సాడీలు, పోరిక్‌లు ప్రముఖ పాత్ర వహిస్తారు. నెత్తి మీద నెమలి ఈకలు, పెద్ద టోపీ లతో ముఖానికి, ఒంటికి రంగులతో మెడ నిండా పూసల దండలు, కాళ్లకు గజ్జెలు, చేతిలో గంగారాం సోటితో గంతులు వేసుకుంటూ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. ఈ కళ అంతరించి పోకూడదనే ఉద్దేశంతో అప్పటి ఐఏఎస్ అధికారి మడావి తుకారాం ప్రత్యేక చొరవ తీసుకుని కనకరాజును ప్రోత్సహించారు. దీంతో కనకరాజు శిక్షకుడిగా మారి 150 మందికి ఐదు రకాల దరువులతో కూడిన డప్పు సహాయంతో శిక్షణ ఇచ్చారు. 1976 నుండి వరుసగా ఢిల్లీలో జరిగే స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవా లలో ప్రదర్శనలు ఇప్పించారు.1981లో ప్రధాని ఇందిరాగాంధీ ముందు గుస్సాడి నృత్యాన్ని ప్రదర్శించారు. 2014లో ఎర్ర కోటలో రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ముందు ప్రదర్శించారు. కొన్ని సినిమాలలో కూడా ఈ కళను ప్రదర్శించారు. కనకరాజు గుస్సాడి నృత్యానికి చేసిన సేవలకు గుర్తింపుగా 2021లో కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన ‘పద్మశ్రీ’ని ఇచ్చి గౌరవించింది. ఎనిమిది పదుల వయసు దాటినా, గుస్సాడిని బతికించడానికి మరో 30 మందికి శిక్షణనిచ్చారు. గుస్సాడి కళను వెలుగులోకి తెచ్చిన సామాన్యుడైన కనకరాజు ఈనాటి కళాభిమానులకు ఆదర్శప్రాయుడు. కనకరాజుకు నివాళిగా ఆయన శిష్యులు మరింతగా ఈ కళను ప్రపంచవ్యాప్తం చేస్తారని ఆశిద్దాం.– గుమ్మడి లక్ష్మినారాయణ,ఆదివాసీ రచయితల వేదిక వ్యవస్థాపక కార్యదర్శి, తెలంగాణ ‘ 94913 18409 -
చరిత్ర విస్మరించిన యోధుడు రాంజీ
భారత ప్రథమ స్వాతంత్య్ర పోరాటం అంటేనే సహజంగా స్ఫురించేది 1857 సిపాయిల తిరుగు బాటు. మధ్య భారత దేశంలో గోండ్వానా ప్రాం తంలో భాగమైన ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీల నాయకత్వంలోని రాంజీగోండు ఆధ్వర్యంలో రోిహల్లా తిరుగుబాటు (1836-60), కొమురం భీం నేతృ త్వంలో జోడెన్ ఘాట్ తిరుగుబాటు (1938-40) దేశంలోనే ఆదివాసీ తొలి చారిత్రక పోరాటాలుగా నిలిచాయి. రోహిల్లాల తిరుగుబాటుకు చరిత్రకారులు మన చరిత్రకారులు స్థానం కల్పించలేదు. గోండుల వీర యోధుడైన మార్సికోల్లా రాంజీ గోండ్‌ను స్మరించుకునే వారే కనబడరు. మధ్యభారతంలోని మహారాష్ట్ర, ఒడిశా, మధ్య ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నివసించే అనేకమంది గిరిజన తెగల సమూహాల్లో గోండ్వానా రాజ్యం బ్రిటిష్ పాలకుల రాక పూర్వమే ఏర్పడి ఉన్నది. గోండుల పాలన క్రీ.శ 1240-1750 వరకు సుమారు 5 శతాబ్దాలపాటు కొనసాగింది. 9 మంది గోండు రాజులలో చివరివాడైన నీల్కంఠ్షా (క్రీ.శ 1735- 49)ని మరాఠీలు బంధించి చంద్రాపూర్‌ను ఆక్రమిం చుకున్నారు. దీంతో గోండ్వానా ప్రాం తం మరాఠీల ఆధీనమైనా, వారు బ్రిటిష్ వారికి తలొగ్గి గోండ్వా నాను తెల్లదొరలకు అప్పగించారు. దీం తో గోండులపాలన అంతమై, ఆంగ్లే యుల, నైజాం పాలన ఆరంభమైంది. వీరి పీడనకు వ్యతిరేకంగా గిరిజనుల తిరుగుబాటు మొదలైంది. ఆదిలాబాద్ జిల్లాలోని మార్సికొ ల్లా రాంజీ 1836-1860 మధ్య కాలంలో నాటి జనగాం (అసిఫాబాద్) కేంద్రంగా చేసుకుని బ్రిటిష్ సైన్యాలను ధీటుగా ఎదుర్కొన్న తొలి గిరి జన పోరాట యోధుడు. బ్రిటిష్ సైన్యంతో ఎదురొడ్డి ఝాన్షీ లక్ష్మిబాయి వీరమరణం పొందిన తర్వాత నానాసాహెబ్, తాంతియాతోపే, రావు సాహెబ్‌లు తమ బలగాలతో విడిపోయారు. తాంతియా అనుచ రులైన రోహిల్లా సిపాయిలు పెద్ద సంఖ్యలో మహా రాష్ట్రలోని ఔరంగాబాద్, బీదర్, పర్బనీ, ఆంధ్రప్ర దేశ్‌లోని ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశించారు. వీరు అజంతా, బస్మత్, లాథూర్, మఖ్తల్, నిర్మల్‌లను పోరాట కేంద్రాలుగా చేసుకున్నారు. వీరి నేతగా ప్రక టించుకున్న రంగారావు నిజాం ప్రభుత్వాన్ని పడ గొట్టి, బ్రిటిష్ వాళ్లను తరిమేయాలని పోరాటానికి పూనుకున్నాడు. సైనిక బలగాల శిక్షణలో ప్రజల్ని ఉత్తేజితుల్ని చేసేక్రమంలో బ్రిటి ష్ సైన్యానికి పట్టుబడ్డాడు. యావజ్జీవశిక్ష అనుభవిస్తూ అండమాన్ జైలులో 1860 లో మరణించాడు. రాంజీ నేతృత్వంలో తిరుగుబాటు తీవ్రమైంది. రోహిల్లా సిపాయిల తిరుగుబాటు ప్రధానంగా అసిఫాబాద్ తాలూకా నిర్మల్ కేంద్రంగా జరిగింది. అది ప్రధానంగా గోండులు, కోలాము, కోయ తెగల గిరిజనుల ప్రాంతం. రాంజీగోండ్ సారథ్యంలో తిరుగుబాటు ఉధృతంగా మారింది. ఈ తిరుగుబాటు తుది కీలక ఘట్టం 1860 మార్చి ఏప్రిల్‌లో జరిగింది. బానిస బతుకులు వెళ్లదీస్తున్న గోండు గిరిజనులు వెట్టికి ప్రతిఫలం ఆశించడాన్ని తెల్లదొరలు సహించలేకపోయారు. ఆదిలాబాద్ ఏజె న్సీ ప్రాంతాలు బ్రిటిష్ వారి దౌర్జన్యంతో అల్లకల్లో లంగా మారాయి. రాంజీ నాయకత్వంలో వెయ్యి మంది రోహిల్లాలు, గోండులు కలసి నిర్మల్ సమీ పంలోని కొండలను కేంద్రంగా చేసుకుని బ్రిటిష్ పాలకులను ముప్పుతిప్పలు పట్టారు. నిర్మల్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిజాం బలగాలు వారిపై దాడులు చేశా యి. ఆధునిక ఆయుధాల ముందు ఆదివాసులు నిలవలేకపోయారు. తెగించి పోరాడుతున్న ఆది వాసులను నిర్దాక్షిణ్యంగా కాల్చిచంపారు. కడదాకా పోరాడిన రాంజీగోండుతో సహా వెయ్యిమందిని పట్టుకుని నిర్మల్ నడిబొడ్డున ఉన్న ఊడలమర్రి చెటు ్టకు 1860 ఏప్రిల్ 9న ఉరితీశారు. ఆ మర్రి చెట్టు వెయ్యి ఉరిల మర్రిచెట్టుగా ప్రసిద్ధి. తెల్లదొరల దురాగతాలకు చిహ్నంగా నిలిచిన ఆ మర్రిచెట్టును తర్వాతి కాలంలో అంటే 1995లో నరికివేశారు. రాంజీగోండ్ నాయకత్వంలో సాగిన ఇంతటి వీరోచిత పోరాటాన్ని పాలకులు నిర్లక్ష్యం చేశారు. తెలంగాణ పోరాట మూలాలను వెతుక్కుం టూ తనదైన చరిత్రను పునర్నిర్మించుకుంటున్న తరుణంలో రాంజీ చరిత్రను వెలుగులోకి తేవాలి. రాంజీ గోండ్ పోరాటాన్ని, త్యాగాల్ని భావితరాలకు అందించాలి. నిర్మల్‌లోని ఉర్ల మర్రి చెట్టు స్థానంలో రాంజీ గోండు స్మారక స్థూపాన్ని, అలాగే ట్యాంక్ బండ్‌పైన కూడా నిర్మించాలి. (ఏప్రిల్ 9, రాంజీగోండ్ 155వ వర్థంతి.) (గుమ్మడి లక్ష్మీనారాయణ, ఆదివాసీ రచయితల సంఘం) మొబైల్ : 9951430476 -
తెల్లదొరల భరతం పట్టిన ధీరవనిత ‘రాణీమా’
నేడు రాణీమా గైడిన్ల్యూ 22వ వర్ధంతి భారత స్వాతంత్య్రోద్యమంలో బ్రిటిష్ సైన్యాన్ని ఎదిరించి పోరాడిన ఏకైక ఆదివాసీ వీరనారి గైడిన్ల్యూ. ఈశాన్య రాష్ట్రా ల ఆదివాసులు ‘రాణీమా’ అని ప్రేమగా పిలుచుకునే ఆమె నాగా జాతిలోని రాంగ్ మోయీ గిరిజన తెగకు చెంది నది. పశ్చిమ మణిపూర్‌లోని ఒక కుగ్రామంలో గైడిన్ల్యూ 1915, జనవరి 26న జన్మిం చారు. యావత్ భారతావని గర్వించదగిన ఆ స్వాతం త్య్ర యోధురాలు మణిపూర్ ప్రాంతంలో ఆదివాసీల తరఫున పోరాడుతున్న జాదోనాంగ్తో కలిసి ‘హరాకా’ అనే సంస్థను స్థాపించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకం గా పోరాడటంతోపాటూ నాగాజాతి ప్రజల్లో సామాజిక, ధార్మిక, రాజకీయ, నైతిక చైతన్యాన్ని రగిలించడంలోనూ రాణీమా అలుపెరుగని కృషి చేశారు. 1931, ఆగస్టు 29న జోదానాంగ్ను బ్రిటిష్ పాలకులు ఉరితీశారు. దీంతో 17 ఏళ్ల ప్రాయంలోనే గైడిన్ల్యూ ఉద్యమ నాయ కత్వాన్ని చేపట్టి స్వతంత్ర సాయుధ బలగాలను నిర్మిం చారు. గిరిజన, గిరిజనేతర గ్రామాలపై తెల్లదొరలు విరు చుకుపడి విధ్వంసం సాగించారు. రాణీమా బలగాలు ధైర్యసాహసాలతో వారిని ఎదిరించి పోరాయి. ముఖ్య నాగాతెగలైన జెమీ, ల్యాగ్ మేయీ, రాంగ్ మేయీలను హరాకా ఉద్యమం ఏకతాటిపైకి తెచ్చింది. ఆదివాసీ సంస్కృతిని పరిరక్షించింది. అందుకే మణిపూర్ ప్రజలు రాణీమాను సాక్షాత్తూ దేవతగా భావించేవారు. ఆమె నేతృత్వంలో పశ్చిమ మణిపూర్, దక్షిణ నాగాలాండ్, ఉత్తర అసోం ప్రాంతాల్లో స్వాతంత్య్రోద్యమ జ్వాలలు ఎగసాయి. కక్షకట్టిన బ్రిటిష్ ప్రభు త్వం రాణీమాపైకి సైన్యాన్ని పంపింది. ఆమె ఆచూకీ తెలిపిన వారికి నజరానాలు ప్రకటించింది. నిత్యం ప్రజల మధ్యే ఉంటున్నా రాణీమా జాడను ఎవరూ బయట పెట్టలేదు. కానీ బ్రిటిష్‌వారి ఆధునిక ఆయుధ సంపత్తికి కత్తి, డాలు వంటి నాగాల సంప్రదాయక ఆయుధాలు నిలవరిం చలేకపోయాయి. ఎందరో నాగా లు పోరాటంలో నేలకొరిగారు. ఎట్టకేలకు 1932 అక్టో బర్ 17న అస్సాం రైఫిల్స్ పొలోమీపై చేసిన దాడిలో నాగాలకు ఓటమి తప్పలేదు. రాణీమాను నిర్బంధించిన బ్రిటిష్ ప్రభుత్వం ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అయినా హరాకా ఉద్యమం నాగాలాండ్, మణిపూర్ ప్రాంతమంతటా వ్యాపించింది. వివిధ జైళ్లలో 15 ఏళ్లు మగ్గిన తర్వాత, స్వాతం త్య్రానంతరం 1947లో రాణీమా విడుదల య్యారు. కానీ మణిపూర్‌లో ఆమె ప్రవే శాన్ని నిషేధించారు. దీంతో నాగా ప్రజలు ప్రభుత్వ వ్యతిరేక సాయుధ పోరాటం చేప ట్టారు. 1960 నుంచి అజ్ఞాతంలోనే ఉన్న ఆమె 1966 నుంచి బహిరంగంగా నాగా లాండ్లో శాంతిస్థాపనకు కృషి చేశారు. 1972 భారత స్వాతంత్య్ర రతజోత్సవాలలో ప్రభుత్వం ఆమెను ‘తామ్రపత్రం’తో సత్కరించింది. దేశ స్వాతంత్య్రం కోసం, ఆదిమ గిరిజన జాతుల స్వేచ్ఛ కోసం అవిశ్రాంతంగా పోరాడిన రాణీమా 1993, ఫిబ్ర వరి 17న తుదిశ్వాస విడిచారు. రాజ్యాంగం 6వ షెడ్యూ ల్ ఈశాన్య రాష్ట్రాల ఆదివాసీలకు కల్పించిన విశేష హక్కుల వెనుక, దేశవ్యాప్త ఆదివాసీ ఉద్యమాల వెనుక రాణీమా కృషి ఉంది. ఆ ఆదివాసీ, స్వాతంత్య్రయోధు రాలి స్మృతి భారత ప్రజల గుండెల్లో చిరకాలం పది లంగా నిలుస్తుంది. గుమ్మడి లక్ష్మీనారాయణ ఆదివాసీ రచయితల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొబైల్: 9951430476 -
ఆదివాసీల అక్షరశిల్పి గిడుగు రామమూర్తి
సందర్భం (నేడు గిడుగు వెంకట రామమూర్తి పంతులు 75వ వర్ధంతి) ఆదిమ సవర జాతి గిరి జనుల భాషకు లిపిని, నిఘంటువును రూపొం దించి, తెలుగు వాడుక భాషా ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన గిడుగు రామమూర్తి (ఆగస్టు 29, 1863 -జనవరి 22,1940)తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర. శ్రీకాకుళం, విజయనగ రం, విశాఖ జిల్లాలోని కొండ ప్రాంతాల్లో అనేక మంది సవరలు నివసిస్తున్నారు. వారు ఆదిమ నివాసులు. అక్షరజ్ఞానం, బాహ్య సమాజం అంటే తెలియని అమాయకులు. సరైన తిండి, బట్ట లేకు న్నా ప్రత్యేక జీవనసంస్కృతి కలిగిన ప్రపంచం వారిది. గతంలో ఎంతో ఉన్నత విలువలతో జీవిం చిన సవరలు ఆధునిక సమాజంలో వెనుకబడి ఉండటం రామమూర్తిని బాధించింది. బాహ్య ప్రపంచానికి సుదూరంగా ఉండే శ్రీకాకుళం జిల్లాలోని కొండజాతి సవర తెగ గిరిజనుల ఆర్థిక, జీవన స్థితిగతులను గమనించిన గిడుగు, వారికి సవర భాషలోనే విద్యను అందించాలని భావించడానికి కార ణం వారి వెనుకబాటుతనమే కాదు, వారికున్నచారిత్రక నేపథ్యం కూడా. వీరికి చదువు చెప్పి విజ్ఞానవంతు లను చేయగలిగితే వారి బతుకులు బాగుపడతాయని భావించిన గిడు గు సవర భాషను నేర్చుకున్నారు. వాచకాలు, కథల, పాటల పుస్తకాలు, తెలుగు-సవర, సవర- తెలుగు నిఘంటువులను తయారు చేశారు. వాటిని 1911లో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం ప్రచు రించింది. ఇందుకు ప్రభుత్వం పారితోషికం ఇవ్వ బోతే, ‘ఆ డబ్బుతో మంచి బడి పెట్టండి, నేను పెట్టిన బడులకు నిధులు ఇవ్వండి!’ అని కోరారు. ఆ ప్రకారమే ప్రభుత్వం శిక్షణా పాఠ శాలలను ప్రారంభించింది. వాడుకభాషను వ్యతిరేకించిన పండితుల రచనలలోని వ్యాకరణ విరుద్ధ ప్రయోగాలను ఎత్తిచూపుతూ 1911-12 మధ్య ఆంధ్ర పండిత భిష క్కుల భాషా భేషజం అనే గ్రంథాన్ని రాశారు. సవర భాషలో ఎ మాన్యు వల్ ఆఫ్ సవర లాంగ్వేజ్ అనే వర్ణనా త్మక వ్యాకరణాన్ని 1930లో రాశారు. సవర జాతికి సంబంధించిన అంశా లను చేర్చి క్యాస్ట్స్ అండ్ ట్రైబ్స్ ఆఫ్ సదరన్ ఇండియాను రచించిన మానవ శాస్త్రవేత్త ధరస్టన్తో రామమూర్తి చర్చించారు. ఆదివాసీల అక్షర శిల్పి గా, సవర లిపి నిర్మాతగా పేరొందిన గిడుగు కృషికి మెచ్చిన బ్రిటిష్ ప్రభుత్వం 1933లో కైజర్- ఇ- హింద్ బిరుదుతోపాటు బంగారు పతకాన్ని బహూ కరించింది. మద్రాసు గవర్నర్ చిత్రపురానికి వచ్చి ప్రత్యేక దర్బారులో ఈ అవార్డును రామమూర్తికి స్వయంగా అందజేశారు. తెలుగు వారు అధికంగా ఉన్న పర్లాకిమిడిని, 200 గ్రామాలను 1935లో అన్యాయంగా ఒడిశా రాష్ట్రంలో చేర్చడాన్ని నిరసించిన గిడుగు.. 22 ఏళ్లుగా పర్లాకిమిడిలో నివసిస్తూ వచ్చిన ఇంటిని వదిలి రాజమండ్రిలో ఉంటున్న తన నాలుగవ కుమారుడి వద్దకు చేరుకున్నారు. 1936లో ఆంధ్ర విశ్వవిద్యాలయం బహూకరించిన కళా ప్రపూర్ణ బిరుదును వ్యవహారిక భాషావాదులందరికీ అంకి తమిస్తున్నట్లు ప్రకటించడం గిడుగువారికే సాధ్య మైంది. గిడుగు ప్రేరణతో అయినా, ప్రభుత్వాలు అంతరించిపోతున్న ఆదివాసీ భాషల్ని, సంస్కృ తుల్ని పరిరక్షించాలి. గుమ్మడి లక్ష్మీనారాయణ, (వ్యాసకర్త ఆదివాసీ రచయితల సంఘం నేత, వరంగల్. మొబైల్: 9491318409) -
ఏజెన్సీ ఉద్యోగ భర్తీ ఇంకెప్పుడు?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, రాష్ట్రాల్లోని మారుమూల (షెడ్యూల్డ్ ఏజెన్సీ) ప్రాం తాల్లో విద్యా ప్రమాణాలు, ఉద్యోగ నియామకాలు చిరకాలంగా అస్తవ్యస్తంగా ఉంటున్నాయి. తెలంగాణ లో ఏజెన్సీ నిరుద్యోగ అభ్యర్థులు కూడా ఉద్యోగ ప్రకటనల కొరకు ఆశగా ఎదురుచూస్తున్నారు. మైదాన ప్రాంత గిరిజనుల అక్ష రాస్యత (37.04 శాతం) కంటే ఏజెన్సీ ప్రాంత గిరిజ నుల అక్షరాస్యత (17 శాతం) తక్కువగా ఉంది. అంటే బంగారు తెలంగాణకు, స్వర్ణాంధ్ర ప్రదేశ్ లక్ష్యానికి ఆది వాసులు యోజనాల దూరంలోనే ఉన్నారు. అభివృ ద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఆదివాసీ ప్రాంతాల్లో విద్యా వనరులు కల్పించడానికి, స్థానిక గిరిజన ఉపాధ్యాయులను నియమించడానికి ప్రభుత్వం ఉత్తర్వు నంబర్ 3ని విడుదల చేసి నిన్నటికి (2015, జనవరి 10) నాటికి పుష్కర కాలం దాటి మూడేళ్లు గడిచింది. ఏజెన్సీ ఆదివాసీ ప్రాంతాల్లో ఉపాధ్యాయ ఖాళీలను నూటికి నూరుశాతం స్థానిక గిరిజనులకే కేటాయించాలనే ప్రభుత్వ ఉత్తర్వు నం.3ని సమ ర్థిస్తూ పదోన్నతులు కూడా వారికే వర్తింపచేయాలని 2011, డిసెంబర్ 28న ఉమ్మడి రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం తీర్పునిచ్చింది. రాష్ట్రంలో దళిత, గిరిజనుల పదోన్నతుల్లో రిజర్వేషన్ల ఉత్తర్వు నం.5 (2003 నుం డి) అమలవుతున్నందున ఏజెన్సీ పదోన్నతులపై ప్రభుత్వ ఉదాసీనత ఈ మూడేళ్లలో పరాకాష్టకు చేరుకుంది. ఏజెన్సీ గిరిజనుల సమగ్రాభివృద్ధికి 9 జిల్లాల పరిధిలో ఉట్నూరు, భద్రాచలం, ఏటూరునాగారం, శ్రీశైలం, పార్వతీపురం, పాడేరు, కే.ఆర్.పురం, రంప చోడవరం, సీతంపేటలలో సమగ్ర గిరిజనాభివృద్ధి (ఐటీడీఏ) సంస్థలు 1974లో ఏర్పడినప్పటికీ వీటి లో విద్యావసతులు, నియామకాలు, పదోన్నతులకు సంబంధించి నెలకొన్న పరిస్థితులు ఏజెన్సీలో అడవి కాచిన వెన్నెలను స్ఫురింపచేస్తున్నాయి. ఉత్తర్వు నం.3 విడుదలై పద్నాలుగేళ్లు పూర్తయిన ప్పటికీ విద్యాశాఖలోని ఏజెన్సీస్థాయి ఉద్యోగాలు 40 శాతం కూడా భర్తీకాలేదు. నేటికీ ఏజెన్సీ పాఠశాలలు విద్యా వాలంటీర్లతోనే కాలం గడిపేస్తున్నాయి. ప్రభుత్వ ఉదాసీనతకు తోడు అధికారుల అలసత్వం, రాజ కీయ జోక్యంతో ఏజెన్సీ విద్య, సంక్షేమ, ఉద్యోగ నియామకాలు, పదోన్నతులలో సకల లొసుగులూ చోటు చేసుకుంటున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న బంజారా, ఎరుకల, యానాది తెగలను 1976 లో రాజ్యాంగ సవరణ ద్వారా మైదాన ప్రాంత గిరిజ నులుగా చేర్చడంతో ఉద్యోగ రిజర్వేషన్లలో పరాయీ కరణ పెరిగింది. వీరు అధికారుల అండదండలతో ఏజెన్సీ ధ్రువీకరణ పత్రాలనూ పొందడంతో అర్హు లైన ఏజెన్సీవాసులకు ఉద్యోగాల్లో అన్యాయం జరు గుతోంది. ఏజెన్సీ ఉత్తర్వు(3) అమలులో వైఫల్యం కారణంగా ఆదివాసులకు కనీస స్థాయి ఉద్యోగాలూ దక్కకపోగా, గత 15 ఏళ్లలో అవి మిగులుబాటు (బ్యాక్లాగ్) అవుతూ వస్తున్నాయి. పలుకారణాల తో నంబర్ 3 ఉత్తర్వుకు గ్రహణం పట్టడంతో ఉమ్మ డి రాష్ట్రంలో ఎవరు గిరిజనులు, ఏవి ఏజెన్సీ గ్రామా లు, ఎవరు ఏజెన్సీ పరిధికి చెందుతారు అనే విష యాల్లో అధికారులు గందర గోళం సృష్టిస్తున్నారు. ఏజెన్సీ పదోన్నతులు: 2009 నుంచి ఏజెన్సీ ప్రాంతాల్లోని పాఠశాల సహాయకులు, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు పదోన్నతుల్లో కేవలం సీని యారిటీకే ప్రాధాన్యం ఇవ్వటంతో అర్హతలున్న ఆది వాసీ ఉపాధ్యాయులు స్థానిక ఏజెన్సీలో భారీగా నష్ట పోతున్నారు. దీనికి విరుగుడుగా ఏపీ ట్రిబ్యునల్ 2009, ఆగస్టు 10న ఒక తీర్పు ఇచ్చింది. దీంతో ఉత్త ర్వు నం.3లో పేర్కొన్న నియామకాలతోపాటు అన్ని విభాగాల పదోన్నతులను ఏజెన్సీ వారికే కేటా యిం చాలని, గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు 2009, డిసెంబర్ 19న మెమో నం.9206 జారీచేశారు. దీని పై గిరిజనేతర ఉపాధ్యాయులు అదే ట్రిబ్యునల్‌లో తమకు అనుకూలంగా తీర్పు తెచ్చుకున్నారు. ఆ తీర్పును ఏజెన్సీ ఉపాధ్యాయులు రాష్ట్ర ఉన్నత కోర్టు లో సవాల్ చేయగా, ఉత్తర్వు నంబర్‌ను సమర్థిస్తూ, పదోన్నతులు కూడా ఏజెన్సీ వారికే వర్తిస్తాయని 2011 డిసెంబర్ 28న సంచనల తీర్పు వెలువడింది. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాసంచాలకులు పంపి న వివరణాత్మక ఉత్తర్వుల ప్రకారం, ఖమ్మం జిల్లా ఏజెన్సీ పాఠశాలల్లో 2012 జనవరి, జూలై నెలల్లో పదోన్నతులు అమలు జరిగాయి. కానీ వరంగల్ జిల్లా పాఠశాల విద్యా సంచాలకులు ఇచ్చిన వివర ణాత్మక ఉత్తర్వులను జిల్లా విద్యాశాఖాధికారి అమలుచేయనందున పదోన్నతికోసం ఎదురుచూ స్తున్న సుమారుగా 52 మంది ఉపాధ్యాయులు 2012 ఆగస్టు నుంచి తమ సేవాకాలాన్ని నష్టపోతు న్నారు. ఏజెన్సీ ఆదివాసులు ఇన్ని అడ్డంకులు ఎదు ర్కొంటున్న స్థితిలో వారికి ప్రత్యేక డీఎస్సీలను ఐడీ టీఏల ద్వారా నిర్వహించాలి. ఏజెన్సీ ఉత్తర్వు నం.3 ను ఉద్యోగ నియామకాలతోపాటు పదోన్నతుల లోనూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు చిత్తశుద్ధితో అమలు చేసినప్పుడే ఏజెన్సీ అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న తెలంగాణ ప్రభుత్వం అత్యంత వెనుకబడిన ఆదివాసీలకు ఏజెన్సీ ఉత్తర్వు -3 ప్రకారం నూటికి నూరు శాతం ఉద్యోగాలు కల్పి స్తేనే ఆర్థిక ప్రగతితో కూడిన ‘గిరిప్రగతి’ లక్ష్యాన్ని చేరుకుంటారు. ఏజెన్సీ వాసులకు అందుబాటులో ఉన్నత విద్యాసంస్థలను కూడా నెలకొల్పితే ఆదివా సులు సంపూర్ణ అక్షరాస్యులుగా ఎదుగుతారు. (ఏజెన్సీ జీవో నం.3 ఉత్తర్వుకు నిన్నటికి 15 ఏళ్లు) గుమ్మడి లక్ష్మీనారాయణ ప్రధాన కార్యదర్శి, ఆదివాసీ రచయితల సంఘం