ఏజెన్సీ ఉద్యోగ భర్తీ ఇంకెప్పుడు? | When agency replacement of job? | Sakshi
Sakshi News home page

ఏజెన్సీ ఉద్యోగ భర్తీ ఇంకెప్పుడు?

Published Sun, Jan 11 2015 2:19 AM | Last Updated on Sat, Sep 2 2017 7:30 PM

గుమ్మడి లక్ష్మీనారాయణ

గుమ్మడి లక్ష్మీనారాయణ

 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, రాష్ట్రాల్లోని మారుమూల (షెడ్యూల్డ్ ఏజెన్సీ) ప్రాం తాల్లో విద్యా ప్రమాణాలు, ఉద్యోగ నియామకాలు చిరకాలంగా అస్తవ్యస్తంగా ఉంటున్నాయి. తెలంగాణ లో ఏజెన్సీ నిరుద్యోగ అభ్యర్థులు కూడా ఉద్యోగ ప్రకటనల కొరకు ఆశగా ఎదురుచూస్తున్నారు. మైదాన ప్రాంత గిరిజనుల అక్ష రాస్యత (37.04 శాతం) కంటే ఏజెన్సీ ప్రాంత గిరిజ నుల అక్షరాస్యత (17 శాతం) తక్కువగా ఉంది. అంటే బంగారు తెలంగాణకు, స్వర్ణాంధ్ర ప్రదేశ్ లక్ష్యానికి ఆది వాసులు యోజనాల దూరంలోనే ఉన్నారు. అభివృ ద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఆదివాసీ ప్రాంతాల్లో విద్యా వనరులు కల్పించడానికి, స్థానిక గిరిజన ఉపాధ్యాయులను నియమించడానికి ప్రభుత్వం ఉత్తర్వు నంబర్ 3ని విడుదల చేసి నిన్నటికి (2015, జనవరి 10) నాటికి పుష్కర కాలం దాటి మూడేళ్లు గడిచింది. ఏజెన్సీ ఆదివాసీ ప్రాంతాల్లో ఉపాధ్యాయ ఖాళీలను నూటికి నూరుశాతం స్థానిక గిరిజనులకే కేటాయించాలనే ప్రభుత్వ ఉత్తర్వు నం.3ని సమ ర్థిస్తూ పదోన్నతులు కూడా వారికే వర్తింపచేయాలని 2011, డిసెంబర్ 28న ఉమ్మడి రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం తీర్పునిచ్చింది. రాష్ట్రంలో దళిత, గిరిజనుల పదోన్నతుల్లో రిజర్వేషన్ల ఉత్తర్వు నం.5 (2003 నుం డి) అమలవుతున్నందున ఏజెన్సీ పదోన్నతులపై ప్రభుత్వ ఉదాసీనత ఈ మూడేళ్లలో పరాకాష్టకు చేరుకుంది.

 ఏజెన్సీ గిరిజనుల సమగ్రాభివృద్ధికి 9 జిల్లాల పరిధిలో ఉట్నూరు, భద్రాచలం, ఏటూరునాగారం, శ్రీశైలం, పార్వతీపురం, పాడేరు, కే.ఆర్.పురం, రంప చోడవరం, సీతంపేటలలో సమగ్ర గిరిజనాభివృద్ధి (ఐటీడీఏ) సంస్థలు 1974లో ఏర్పడినప్పటికీ వీటి లో విద్యావసతులు, నియామకాలు, పదోన్నతులకు సంబంధించి నెలకొన్న పరిస్థితులు ఏజెన్సీలో అడవి కాచిన వెన్నెలను స్ఫురింపచేస్తున్నాయి. ఉత్తర్వు నం.3 విడుదలై పద్నాలుగేళ్లు పూర్తయిన ప్పటికీ విద్యాశాఖలోని ఏజెన్సీస్థాయి ఉద్యోగాలు 40 శాతం కూడా భర్తీకాలేదు. నేటికీ ఏజెన్సీ పాఠశాలలు విద్యా వాలంటీర్లతోనే కాలం గడిపేస్తున్నాయి. ప్రభుత్వ ఉదాసీనతకు తోడు అధికారుల అలసత్వం, రాజ కీయ జోక్యంతో ఏజెన్సీ విద్య, సంక్షేమ, ఉద్యోగ నియామకాలు, పదోన్నతులలో సకల లొసుగులూ చోటు చేసుకుంటున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న బంజారా, ఎరుకల, యానాది తెగలను 1976 లో రాజ్యాంగ సవరణ ద్వారా మైదాన ప్రాంత గిరిజ నులుగా చేర్చడంతో ఉద్యోగ రిజర్వేషన్లలో పరాయీ కరణ పెరిగింది. వీరు అధికారుల అండదండలతో ఏజెన్సీ ధ్రువీకరణ పత్రాలనూ పొందడంతో అర్హు లైన ఏజెన్సీవాసులకు ఉద్యోగాల్లో అన్యాయం జరు గుతోంది. ఏజెన్సీ ఉత్తర్వు(3) అమలులో వైఫల్యం కారణంగా  ఆదివాసులకు కనీస స్థాయి ఉద్యోగాలూ దక్కకపోగా, గత 15 ఏళ్లలో అవి మిగులుబాటు (బ్యాక్‌లాగ్) అవుతూ వస్తున్నాయి. పలుకారణాల తో నంబర్ 3 ఉత్తర్వుకు గ్రహణం పట్టడంతో ఉమ్మ డి రాష్ట్రంలో ఎవరు గిరిజనులు, ఏవి ఏజెన్సీ గ్రామా లు, ఎవరు ఏజెన్సీ పరిధికి చెందుతారు అనే విష యాల్లో అధికారులు గందర గోళం సృష్టిస్తున్నారు.

 ఏజెన్సీ పదోన్నతులు: 2009 నుంచి ఏజెన్సీ ప్రాంతాల్లోని పాఠశాల సహాయకులు, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు పదోన్నతుల్లో కేవలం సీని యారిటీకే ప్రాధాన్యం ఇవ్వటంతో అర్హతలున్న ఆది వాసీ ఉపాధ్యాయులు స్థానిక ఏజెన్సీలో భారీగా నష్ట పోతున్నారు. దీనికి విరుగుడుగా ఏపీ ట్రిబ్యునల్ 2009, ఆగస్టు 10న ఒక తీర్పు ఇచ్చింది. దీంతో ఉత్త ర్వు నం.3లో పేర్కొన్న నియామకాలతోపాటు అన్ని విభాగాల పదోన్నతులను ఏజెన్సీ వారికే కేటా యిం చాలని, గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు 2009, డిసెంబర్ 19న మెమో నం.9206 జారీచేశారు. దీని పై గిరిజనేతర ఉపాధ్యాయులు అదే ట్రిబ్యునల్‌లో తమకు అనుకూలంగా తీర్పు తెచ్చుకున్నారు. ఆ తీర్పును ఏజెన్సీ ఉపాధ్యాయులు రాష్ట్ర ఉన్నత కోర్టు లో సవాల్ చేయగా, ఉత్తర్వు నంబర్‌ను సమర్థిస్తూ, పదోన్నతులు కూడా ఏజెన్సీ వారికే వర్తిస్తాయని 2011 డిసెంబర్ 28న సంచనల తీర్పు వెలువడింది. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాసంచాలకులు పంపి న వివరణాత్మక ఉత్తర్వుల ప్రకారం, ఖమ్మం జిల్లా ఏజెన్సీ పాఠశాలల్లో 2012 జనవరి, జూలై నెలల్లో పదోన్నతులు అమలు జరిగాయి. కానీ వరంగల్ జిల్లా పాఠశాల విద్యా సంచాలకులు ఇచ్చిన వివర ణాత్మక ఉత్తర్వులను జిల్లా విద్యాశాఖాధికారి అమలుచేయనందున పదోన్నతికోసం ఎదురుచూ స్తున్న సుమారుగా 52 మంది ఉపాధ్యాయులు 2012 ఆగస్టు నుంచి తమ సేవాకాలాన్ని నష్టపోతు న్నారు. ఏజెన్సీ ఆదివాసులు ఇన్ని అడ్డంకులు ఎదు ర్కొంటున్న స్థితిలో వారికి ప్రత్యేక డీఎస్సీలను ఐడీ టీఏల ద్వారా నిర్వహించాలి. ఏజెన్సీ ఉత్తర్వు నం.3 ను ఉద్యోగ నియామకాలతోపాటు పదోన్నతుల లోనూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు చిత్తశుద్ధితో అమలు చేసినప్పుడే ఏజెన్సీ అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న తెలంగాణ ప్రభుత్వం అత్యంత వెనుకబడిన ఆదివాసీలకు ఏజెన్సీ ఉత్తర్వు -3 ప్రకారం నూటికి నూరు శాతం ఉద్యోగాలు కల్పి స్తేనే ఆర్థిక ప్రగతితో కూడిన ‘గిరిప్రగతి’ లక్ష్యాన్ని చేరుకుంటారు. ఏజెన్సీ వాసులకు అందుబాటులో ఉన్నత విద్యాసంస్థలను కూడా నెలకొల్పితే ఆదివా సులు సంపూర్ణ అక్షరాస్యులుగా ఎదుగుతారు.
 (ఏజెన్సీ జీవో నం.3 ఉత్తర్వుకు నిన్నటికి 15 ఏళ్లు)
 గుమ్మడి లక్ష్మీనారాయణ
 ప్రధాన కార్యదర్శి, ఆదివాసీ రచయితల సంఘం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement