gummanur rajaram
-
కాళ్లు మొక్కినా.. ఆత్మభిమానం తాకట్టు పెట్టినా!
రెండుసార్లు ఎమ్మెల్యే టిక్కెట్టు.. ఐదేళ్లు మంత్రి పదవి, ఈ దఫా ఎన్నికల్లో కర్నూలు ఎంపీ టిక్కెట్.. ఇదీ గుమ్మనూరు జయరాంకు వైఎస్సార్సీపీ ఇచ్చిన ప్రాధాన్యత. బోయ సామాజిక వర్గం కావడంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేశారు. బోయలు పల్లకీలు మోయడానికి మాత్రమే కాదని.. రాజకీయంగానూ ఎదగాలనే ఉద్దేశంతో గుమ్మనూరుకు పార్టీ అవకాశం కల్పిస్తూ వచ్చింది. ఇదే సమయంలో జిల్లాలో మరికొందరికి కూడా రాజకీయ ఎదుగుదలకు దారులు వేసింది. అలాంటి పార్టీని గుమ్మనూరు జయరాం స్వార్థ ప్రయోజనాల కోసం కాదనుకున్నారు. బీసీలను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు పంచన చేరి ఏకంగా కాళ్లు మొక్కడం ద్వారా, బోయల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడు. టిక్కెట్ విషయానికొచ్చే సరికి చంద్రబాబు అసలు నైజం బయటపడింది. గుమ్మనూరు కోరుకున్న గుంతకల్లు విషయంలో మూడో విడత జాబితాలోనూ చోటు దక్కకపోవడం, కనీసం ఆలూరునైనా ఇస్తారనుకుంటే ఇప్పటికే మంత్రాలయం బోయలకు ఇవ్వడంతో టీడీపీలో చేరిన ఫలితం అనుభవిస్తున్నాడని ఆయన వర్గీయుల్లో చర్చ జరుగుతోంది. సాక్షి ప్రతినిధి కర్నూలు: తెలుగుదేశంపార్టీ అసెంబ్లీ అభ్యర్థుల మూడో జాబితాను శుక్రవారం టీడీపీ ప్రకటించింది. అందులో గుమ్మనూరు జయరాం పేరు లేదు. టీడీపీలో చేరికకు ముందు, వైఎస్సార్ కాంగ్రెస్ పారీ్టకి రాజీనామా చేసే సమయంలో గుంతకల్లు టిక్కెట్ తనకు ఇస్తామని చంద్రబాబు చెప్పారని, గుంతకల్లు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నానని విలేకరుల సమావేశంలో జయరాం వెల్లడించారు. మంత్రిగా ఉండి పారీ్టలో చేరడంతో గుంతకల్లు టిక్కెట్ వస్తుందనే భావనలోనే అంతా ఉన్నారు. అయితే గుంతకల్లు అభ్యరి్థని ఖరారు చేసేందుకు చంద్రబాబు చేపట్టిన ఐవీఆర్ఎస్ సర్వేలో జయరాంకు ప్రతికూలంగా ఫలితాలు వచ్చినట్లు తెలుస్తోంది. పైగా గుంతకల్లు టీడీపీ నేతలు స్థానికేతరుడిని తమపై రుద్దడం ఏంటని, జిల్లాలో ఎప్పుడూ లేని సంప్రదాయం తీసుకొస్తున్నారని వాపోయారు. గుంతకల్లు, గుత్తి, పామిడి నేతలతో పాటు అనంతపురం జిల్లాలోని టీడీపీ మాజీ ఎమ్మెల్యేల నుంచి కూడా జయరాంకు మద్దతు లభించలేదని సమాచారం. పొలిట్‌బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు జితేంద్రగౌడ్‌కు పూర్తిగా మద్దతు ప్రకటించినట్లు తెలుస్తోంది. రాయదుర్గం అభ్యరి్థగా కాల్వ పోటీ చేయబోతున్నారు. గుంతకల్లులో జయరాంకు టిక్కెట్ ఇస్తే వాలీ్మకుల్లో మరో పవర్ సెంటర్‌గా, తనకు ప్రత్యామ్నాయంగా జయరాం ఉండొచ్చనే ఆలోచనతో కాల్వ పూర్తిగా జితేంద్రకు మద్దతు ఇస్తున్నట్లు చర్చ జరుగుతోంది. జయరాంను వ్యతిరేకిస్తూ జితేంద్ర చేపట్టిన ర్యాలీలో కూడా భారీగా కార్యకర్తలు హాజరయ్యారు. అయితే గుంతకల్లు టిక్కెట్ ఇస్తే రూ.50కోట్ల వరకూ పెట్టుకుంటానని గుమ్మనూరు సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. దీంతో చివరి నిమిషంలో ‘డబ్బు మూటల’ బరువు పెరిగి తనకు టిక్కెట్ వస్తుందనే ఆశతోనే జయరాం ఉన్నారు. ఇప్పటికైతే జయరాం అభ్యరి్థత్వాన్ని చంద్రబాబు పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఆలూరు టిక్కెట్‌పైనే ఆశలు గుంతకల్లు ద్వారాలు దాదాపు మూసుకుపోయాయనే భావనలో జయరాం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతోనే ఆలూరు టిక్కెట్ తనకు ఇవ్వాలని పట్టుదలగా ఉన్నారు. ఇందుకు కోట్ల సుజాతమ్మ మద్దతు కూడా కూడగట్టే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. టిక్కెట్ విషయంలో తనకు సహకరిస్తే, ఆ ‘రుణం’ తీర్చుకుంటానని జయరాం చెప్పినట్లు తెలుస్తోంది. మంత్రాలయం టిక్కెట్ వాలీ్మకి సామాజిక వర్గానికి చెందిన రాఘవేంద్రకు ఇవ్వడంతో మరో టిక్కెట్ ఇవ్వలేమని టీడీపీ స్పష్టం చేసినట్లు చర్చ జరుగుతోంది. అయితే జయరాం మాత్రం గుంతకల్లు, ఆలూరులో ఏదో ఒక టిక్కెట్ ఇవ్వాలని నమ్మించి మోసం చేయడం సరికాదనే ఆవేదనలో ఉండటం గమనార్హం. ఎరక్కపోయి వచ్చి.. చంద్రబాబు మాత్రం పార్టీ కోసం పనిచేయాలని, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని గుమ్మనూరు జయరాంకు చెప్పినట్లు తెలుస్తోంది. మంత్రిగా ఉండి, టిక్కెట్ ఇస్తామని చెప్పి ఇవ్వలేనపుడు రేపు అధికారంలోకి వస్తే తనకేం న్యాయం చేస్తారనే భావనలో గుమ్మనూరు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. పైగా తాను టీడీపీ అధికారంలోకి వస్తుందనే ఉద్దేశంతో రాలేదని, ఆలూరుపై పట్టు కోల్పోకూడదనే భావనతోనే వచ్చానని, గుంతకల్లు టిక్కెట్ తనకు, ఆలూరులో తాను ప్రతిపాదించిన వ్యక్తికి టిక్కెట్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు మాట తప్పుతున్నారని టీడీపీ ముఖ్యనేతలతో గుమ్మనూరు గట్టిగానే మాట్లాడినట్లు తెలుస్తోంది. -
జయరాం చేరికను వ్యతిరేకిస్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు
-
మంత్రివర్గం నుంచి గుమ్మనూరు జయరాం బర్తరఫ్
సాక్షి, తాడేపల్లి: పార్టీ ఫిరాయించిన మంత్రి గుమ్మనూరి జయరాంను రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ బర్తరఫ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన సిఫార్సుకు ఆమోదం తెలిపారాయన. ఇదిలా ఉంటే.. తన మంత్రి పదవికి రాజీనామా చేయకుండానే గుమ్మనూరు తాజాగా టీడీపీలో చేరడం గమనార్హం. మరోవైపు మంత్రి గుమ్మనూరు జయరాం చేరికపై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. గుంతకల్లు టీడీపీ కార్యాలయం ఎదుట ఆ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు.గుమ్మనూరు జయరాం అవినీతి పరుడంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముఖ్యంగా గుమ్మనూరు చేరికను మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జయరాం ఇచ్చే డబ్బు కు ఆశ పడి చంద్రబాబు ఆయన్ని టీడీపీలో చేర్చుకోవడం దౌర్భాగ్యమని, రాబోయే ఎన్నికల్లో గుమ్మనూరుకు సహకరించేది లేదంటూ గుంతకల్లు టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇదీ చదవండి: ప్చ్.. ఊరేదైనా మారని తీరు -
AP: కార్మిక మంత్రిగా గుమ్మనూరు జయరాం బాధ్యతలు
సాక్షి, అమరావతి: ఏపీ కార్మిక మంత్రిగా గుమ్మనూరు జయరాం బాధ్యతలు చేపట్టారు. బుధవారం ఉదయం సచివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారన్నారు. బీసీలంతా ఎప్పటికీ సీఎం జగన్‌కి అండగా ఉంటారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ లకు సీఎం అధిక ప్రాధాన్యం ఇచ్చారన్నారు. రాష్ట్రంలో స్థానిక యువతకు 75 శాతం ఉద్యోగాలు కల్పిస్తున్నారని, ఇందుకోసం ప్రత్యేక బిల్లు తెచ్చారని గుర్తు చేశారు. కార్మికులకు ఈఎస్ఐ ద్వారా వైద్యం అందించడంతో పాటు ఈ-ఔషధ ద్వారా పాదర్శక విధానం తీసుకొచ్చామని మంత్రి పేర్కొన్నారు. చదవండి: ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య యజ్ఞం రాజకీయ నేపథ్యం: 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఆలూరులో పాటీచేసి ఓటమి పాలయ్యారు. 2012లో వైఎస్సార్సీపీలో చేరారు. 2014, 2019 ఎన్నికల్లో ఆలూరు నుంచి వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. -
‘సమైక్య’ దీక్ష.. సడలని ఆకాంక్ష
కర్నూలు, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర పరిరక్షణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ కార్యాచరణలో భాగంగా జిల్లాలో బుధవారం రెండో రోజూ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పిలుపులో భాగంగా రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లును నిరసిస్తూ చేపట్టిన నిరసనకు సమైక్య వాదులు స్వచ్ఛందంగా మద్దతిచ్చారు. నంద్యాలలోని సిటీకేబుల్ కార్యాలయం వద్ద మహిళలు అధిక సంఖ్యలో దీక్షబూనారు. ఆలూరు అంబేద్కర్ సర్కిల్లో నియోజకవర్గ ఇన్చార్జి గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో హుళేబీడు గ్రామానికి చెందిన పది మంది మహిళలు నిరాహార దీక్ష నిర్వహించారు. ఆదోని భీమాస్ సర్కిల్లో వైఎస్సార్సీపీ యువజన విభాగానికి చెందిన ఎనిమిది మంది కార్యకర్తలు దీక్షలో పాల్గొన్నారు. స్థానిక నాయకులు ప్రసాదరావు, చంద్రకాంత్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డిలు వీరికి పూలమాలలు వేసి మద్దతు పలికారు. ఆళ్లగడ్డలో పార్టీ నేత బి.వి.రామిరెడ్డి ఆధ్వర్యంలో నాలుగు రోడ్ల కూడలిలో నిర్వహించిన శిబిరంలో ఆచారి కాలనీకి చెందిన 13 మంది పార్టీ శ్రేణుల్లో దీక్ష చేపట్టారు. డోన్‌లోని పొట్టి శ్రీరాములు సర్కిల్లో ఐదుగురు కార్యకర్తలు నిరాహార దీక్ష నిర్వహించారు. కోడుమూరు పాతబస్టాండ్ వద్ద దీక్ష చేస్తున్న 11 మంది వర్కూరు గ్రామస్తులకు నియోజకవర్గ సమన్వయకర్త మణిగాంధీ, పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హరిచక్రపాణిరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు యు.వి.రాజారెడ్డి తదితరులు సంఘీభావం ప్రకటించారు. ఎమ్మిగనూరు సోమప్ప సర్కిల్లో కేడీసీసీ మాజీ ఉపాధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో నందవరం మండలానికి చెందిన పది మంది పార్టీ కార్యకర్తలు దీక్షలో కూర్చున్నారు. నందికొట్కూరు పటేల్ సెంటర్లో పార్టీ నాయకుడు బండిజయరాజు ఆధ్వర్యంలో 20 మంది కార్యకర్తలు.. ఆత్మకూరు మండల కన్వీనర్ ఏరువా రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కొత్తబస్టాండ్ వద్ద 30 మంది పార్టీ కార్యకర్తలు దీక్ష చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 150 మంది పార్టీ కార్యకర్తలు రిలే దీక్షల్లో పాల్గొనగా సమైక్యవాదులు పెద్ద ఎత్తున శిబిరాలను సందర్శించి సంఘీభావం తెలిపారు.