అమెరికా సెనేట్లో గన్స్ బిల్ ఫెయిల్
వాషింగ్టన్: అమెరికాలో వ్యక్తులకు తుపాకులు వంటి ఆయుధాలు అమ్మే విషయంలో నిబంధనలు కఠినతరం చేయాలన్న ఆలోచన ముందుకుసాగలేదు. పరిమితులు విధించాలన్న యోచన విజయవంతం కాలేదు. ఈ మేరకు అమెరికా సెనేట్లో ప్రవేశ పెట్టిన బిల్లులు మద్దతు పొందలేకపోయాయి. ఇటీవల అమెరికాలోని ఓర్లాండోలో జూన్ 12న కాల్పుల ఘటన చోటుచేసుకుని 49 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
దీంతో ఆయుధాల అమ్మకాల చట్టంలో మార్పులు తీసుకురావాలని ఇటు డెముక్రాట్లు, అటు రిపబ్లికన్లు ఆలోచన చేశారు. ఆ మేరకు ప్రతిపాదనలు రూపొందించి బిల్లుల రూపంలో సెనేట్ లో పెట్టారు. అయితే, ఈ రెండు బిల్లులు కూడా ముందుకు వెళ్లేందుకు కావాల్సిన మద్దతును పొందలేకపోయాయి. వీటిపై కార్యచరణ ప్రారంభం కావాలంటే కనీసం 60 ఓట్లు రావాల్సి ఉండగా అది విఫలం అయింది. డెమొక్రాట్ల బిల్లు రిపబ్లికన్లు నో చెప్పగా.. రిపబ్లికన్ల బిల్లుకు డెమొక్రాట్లు అడ్డు చెప్పారు. దీంతో ఇద్దరి ప్రతిపాదనలు ముందుకు సాగలేదు.