gunasekharan
-
ఆసక్తికరంగా...
ఎం. అరుణ్, శర్మిష్ట, అనన్య త్యాగి కాంబినేషన్లో హేమరాజ్ దర్శకత్వంలో టి. జయచంద్ర నిర్మించిన ‘జాబాలి’ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలోని 80 నిమిషాల గ్రాఫిక్ వర్క్ పిల్లలనూ, పెద్దలనూ ఆకట్టుకుంటుందని, ప్రస్తుతం వస్తున్న హారర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని దర్శకుడు పేర్కొన్నారు. ఓ ఆయుర్వేద కళాశాలకు చెందిన ఏడుగురు స్టూడెంట్స్ ఓ మందుకోసం కీకారణ్యంలోకి అడుగుపెడితే ఏం జరిగిందన్నది ఆసక్తికరంగా తెరెక్కించామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: గుణశేఖరన్. -
50 ఏళ్ల వయసులో.. పదోతరగతి పాస్
చదువుకు వయసు అడ్డం కాదని ఆ పెద్దాయన నిరూపించారు. తమిళనాడు జాతీయ రహదారుల శాఖలో పనిచేస్తున్న గుణశేఖరన్ (50) తన కొడుకుతో కలిసి పదోతరగతి పరీక్ష రాసి.. పాసయ్యారు కూడా!! రోడ్లు వేసే పని చేస్తున్న గుణశేఖరన్, పోలవకలి పాళ్యంలోని ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదువుతన్న ఆయన కొడుకు తమీజ్ ఇద్దరూ కలిసి పదోతరగతి పరీక్షలు రాశారు. ఆ పరీక్షల ఫలితాలు శుక్రవారమే వెల్లడయ్యాయి. తండ్రికి 500కు గాను 234 మార్కులు రాగా, కొడుకు ఏకంగా 459 మార్కులు సాధించినట్లు అధికారులు తెలిపారు. హైస్కూలు వరకు రాకుండానే చదువు వదిలేసిన గుణశేఖరన్ కొన్నేళ్ల క్రితం ప్రైవేటుగా ఎనిమిదో తరగతి పరీక్ష రాసి పాసయ్యారు. రెండేళ్ల తర్వాత తన కొడుకుతో కలిసి ఇంటర్మీడియట్ కూడా రాస్తానని, దాంతో తనకు పదోన్నతి అవకాశాలు కూడా వస్తాయని గుణశేఖరన్ ఆనందంగా చెబుతున్నారు.