ఆసక్తికరంగా...
ఎం. అరుణ్, శర్మిష్ట, అనన్య త్యాగి కాంబినేషన్‌లో హేమరాజ్ దర్శకత్వంలో టి. జయచంద్ర నిర్మించిన ‘జాబాలి’ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలోని 80 నిమిషాల గ్రాఫిక్ వర్క్ పిల్లలనూ, పెద్దలనూ ఆకట్టుకుంటుందని, ప్రస్తుతం వస్తున్న హారర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని దర్శకుడు పేర్కొన్నారు. ఓ ఆయుర్వేద కళాశాలకు చెందిన ఏడుగురు స్టూడెంట్స్ ఓ మందుకోసం కీకారణ్యంలోకి అడుగుపెడితే ఏం జరిగిందన్నది ఆసక్తికరంగా తెరెక్కించామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: గుణశేఖరన్.