gurmeet ramrahim singh
-
జర్నలిస్ట్ హత్య కేసులో డేరా బాబాకు జీవిత ఖైదు
సాక్షి, న్యూఢిల్లీ : లైంగిక దాడి కేసుల్లో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ సింగ్ (డేరాబాబా)కు జర్నలిస్ట్ హత్య కేసులో హర్యానాలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం జీవిత ఖైదు విధించింది. జర్నలిస్ట్ రామచంద్ర ఛత్రపతి హత్య కేసులో డేరాబాబాను కోర్టు దోషిగా నిర్ధారించింది. కాగా పూరాసచ్ పేరుతో రాంచందర్ చత్తర్‌పతి నిర్వహించే వార్తాపత్రికలో డేరా బాబా ఆశ్రమంలో మహిళలు, బాలికలపై లైంగిక వేధింపులకు సంబంధించి పలు వార్తలు ప్రచురితమయ్యేవి. డేరా బాబా నిర్వాకాలపై కథనాలు ప్రచురిస్తున్న క్రమంలో రాంచందర్ చత్తర్పతిని 2002 అక్టోబర్ 24న ఆయన ఇంట్లోనే కాల్చిచంపారు. ఈ హత్య కేసులో 2003లో డేరా బాబాపై కేసు నమోదు చేయగా, 2006లో కేసుపై విచారణను సీబీఐ చేపట్టింది. 2007లో కేసుకు సంబంధించి అభియోగాలు నమోదు చేశారు. జర్నలిస్ట్ ఛత్రపతి హత్య కేసులో డేరా బాబాను దోషిగా నిర్ధారిస్తూ గురువారం హర్యానాలోని పంచ్‌కుల సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం తీర్పు వెలువరించి శిక్షను ఖరారు చేసింది. ఈ కేసులో ఇతర నిందితులు కుల్దీప్ సింగ్, నిర్మల్ సింగ్, కృషన్ లాల్‌లకు జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి రూ 50,000 జరిమానా విధించింది. -
భక్తులను కాపాడుకునే పనిలో..!?
సాక్షి, సిర్సా: అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష పడ్డ డేరా మాజీ అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్.. అనుచరులు తమ భక్తులను కాపాడుకునేందుకు నానాతంటాలు పడుతున్నారు. గుర్మీత్ అరెస్ట్ తరువాత.. వరుస పరిణామాలతో డేరా లోపలి అరాచకాలు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో చాలా మంది భక్తులు గుర్మీత్‌కు దూరంగా జరిగారు. తమ పాలోవర్లను కాపాడుకోవడానికి గుర్మీత్ అనుచరులు సోషల్ మీడియాను అస్త్రంగా వాడుకుంటున్నారు. ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్, వాట్సప్, యూట్యూబ్ ఇలా అన్ని రకాల మాధ్యమాలను ఉపయోగించుకుంటున్నారు. డేరా హెడ్‌క్వార్టర్‌లోని ప్రధాన అనుచరులు గుర్మీత్ గురించిన ఆడియో, వీడియోలను వ్యక్తిగతంగానూ, గ్రూపుల్లోనూ పోస్ట్ చేస్తున్నారు. అత్యాచారల కేసులు, కొత్తగా విచారణలోకి తీసుకున్న హత్యానేరాలను కుట్రగా చెబుతూ ప్రచారం చేస్తున్నారు. గుర్మీత్.. ఒక నిజమైన దేవదూత.. ఆయన మాత్రమే మన పాపాలను పోగొట్టగలడు అంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. గుర్మీత్ ప్రఖ్యాతలు నచ్చని కొందరు.. ఆయనపై కక్ష్యగట్టి దుర్మార్గపూరితంగా వ్యవహరిస్తున్నారు.. అటువంటి వారి మాటలను నమ్మకండి.. అంటూ పాలోవర్లకు మెసేజ్‌లు వెళుతున్నాయి. కొందరు అనుచరులు వీటిని విశ్వసించి.. గుర్మీత్‌ను నమ్ముతుంటే.. మరికొందరు మాత్రం.. ఆయనను చీదరించుకుంటున్నారు.